రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే
అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం
తిరుపతిలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు
ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే
ధైర్యం లేకే కాంగ్రెసు ప్రభుత్వంపై తమపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె
అన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే తమపై వేటు వేసి వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం
కావాలన్నారు.కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్
చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు
చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.
Showing posts with label ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి. Show all posts
Showing posts with label ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి. Show all posts
Monday, 27 February 2012
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సిఎం...శోభా నాగి రెడ్డి
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే
అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం
తిరుపతిలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు
ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే
ధైర్యం లేకే కాంగ్రెసు ప్రభుత్వంపై తమపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె
అన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే తమపై వేటు వేసి వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం
కావాలన్నారు.కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్
చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు
చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.
ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.Tuesday, 14 February 2012
స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించండి... జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
తమను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించాలని, లే దా రాజీనామా ఆమోదించాలని జగన్
వర్గం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్పీకర్‌ను కోరారు. మంగళవారం ఉదయం మీడియాతో
మాట్లాడుతూ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె స్పీకర్‌కు విజ్ఞప్తి
చేశారు.పీఆర్పీని ఇంకా ఎంతకాలం ప్రత్యేక పార్టీగా గుర్తిస్తారని
స్పీకర్‌ను ప్రశ్నించారు. తనను ఇండిపెండెంట్ గా గుర్తిస్తే వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అనుబంద సభ్యురాలిగా కొనసాగిస్తానని శోభానాగిరెడ్డి
పేర్కొన్నారు.
Saturday, 21 January 2012
ఎల్లప్పుడు మా కుటుంబం కార్యకర్తల కోసం..భూమా
కార్యకర్తల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు పాటు పడుతుంటూనే ఉంటుందని భూమా
దంపతులు అన్నారు. పట్టణంలోని భూమా స్వగృహంలో శిరివెళ్ళ మండలం
నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు భూమా దంపతులకు మద్దతు తెలిపేందుకు
ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చి వారిని కలిశారు. ఈ సందర్భంగా భూమా దంపతులు
మాట్లాడుతూ ఈ రోజు మామీద అభిమానంతో ఇంత మంది ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు
చూపించే ఆదరాభిమానాలు చాలా గొప్పవని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా
శిరివెళ్ళలో మీరు చూపించిన ప్రేమ నేను మరచి పోనని భూమా అన్నారు. పార్టీ
అభివృద్ధిపై మీరు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవి ఉన్న, లేకపోయిన ప్రజలకు
అండగా ఉంటామని వారు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
మీద అభిమానంతో వైఎస్సార్ పార్టీకి సంఘీభావంగా ఇక్కడికి రావడం ఆనందంగా
ఉందన్నారు. అందుకు మీకు అండగా ఉంటామని ముస్లిం సోదరులకు భూమా దంపతులు
హామీనిచ్చారు. ఓట్లు మఖ్యం కాదని ప్రజల ఆదరాభిమానాలు ముఖ్యమని వారి అండే
మాకు కొండంత అండని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండలానికి
చెందిన ఖాజాహుస్సేన్, అబ్దులుఖదుర్సు, చాంద్‌భీ, సలాం, నబీరసూల్‌తో పాటు
మరో 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీ నాయకులు
బివి.రామిరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విగ్రహాలపై చెయ్యేస్తే రాజకీయ సమాధి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి
హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా
కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను
వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16
సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం
పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన
తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల
గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి
చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు. Sunday, 18 December 2011
వేటు వేయమని కోరే నైతిక హక్కు చిరంజీవికి లేదని ...శోభా నాగి రెడ్డి
తనపై అనర్హత వేటు వేయమని కోరే నైతిక హక్కు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి
లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్
రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి ఆదివారం అన్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఎప్పుడో ప్రకటించారని
అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరే హక్కు చిరంజీవికి
గానీ, వంగా గీతకు గానీ లేదన్నారు. చిరు మద్దతుతో ప్రభుత్వాన్ని
నిలబెట్టుకోవాల్సి రావడం కాంగ్రెసుకు సిగ్గు చేటు అన్నారు. తనపై వేటు
వేయాలని నిర్ణయం తీసుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
Subscribe to:
Posts (Atom)