Thursday, 1 December 2011

ఉపాసన డామినేట్ చేస్తే సంతోషిస్తా: రామ్ చరణ్

ఉపాసన తనను డామినేట్ చేస్తే సంతోషిస్తానని మెగాస్టార్ చిరంజీవి తనయుడు, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ్ అన్నారు. ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌తో ప్రత్యేకంగా ఆ వ్యాఖ్య చేశారు. నిశ్చితార్ధానికి మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నప్పుడు ఆ టీవీ చానెల్ చెర్రీని పట్టుకోగలిగింది. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నిశ్చితార్ధానికి రావడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కారు నడుపుతూ చెర్రీని నిశ్చితార్థం వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. రామ్ చరణ్ తేజ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బెంజ్ కారును తెప్పించారు. కోటిన్నర రూపాయల విలువ చేసే బెంజ్ కారులో రామ్ చరణ్ తేజ్‌ను ఫామ్ హౌస్‌కు తీసుకుని వచ్చారు. అంతకు ముందు తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. రామ్ చరణ్ తేజ్‌ను కారులో కూర్చోబెట్టుకుని తానే కారును నడుపుతూ మొయినాబాద్ ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. నిశ్చితార్థం వేదికను అంగరంగ వైభవంగా తీర్చి దిద్దారు.

ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్ !

సెక్స్ పాఠాలు సాధారణంగా రహస్యంగా ఇంటి గోడల మధ్యనే నేర్చుకుంటారనే అభిప్రాయం ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. కానీ స్వీడన్‌కు చెందిన మహిళా స్కూల్ మాస్టర్ మరో విధంగా భావిస్తున్నారు. మంచి ప్రేమికులు కావడానికి ఆవసరమైన శృంగార కళను నేర్పేందుకు యివా - మారియా థాంప్సన్ ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్‌ను ప్రారంభించినట్లు డైలీ మెయిల్ రాసింది. వియన్నాలోని ఈ ఆస్ట్రియా అంతర్జాతీయ సెక్స్ స్కూల్ పాఠాలకు 1,400 పౌండ్లు వసూలు చేస్తోంది. అప్లయిడ్ సెక్స్‌వాలిటీ విద్యాసంస్థలో 16 ఏళ్ల వయస్సు పైబడినవారెవరైనా చేరవచ్చునని విద్యాసంస్థ ప్రధానాచార్యురాలు చెబుతున్నారు. విద్యార్థులు కో ఎడ్యుకేషన్ డొర్మెటరీ బ్లాక్‌లో పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ల హోంవర్క్‌ను ప్రాక్టీస్ చేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. తమ విద్య థియరీ కాదని, ప్రాక్టికల్ అని స్కూల్ హెడ్ అంటున్నారు. శృంగార భంగిమలు, ఇతర పద్ధతులు, శారీరక లక్షణాలు వంటివాటిలో పాఠాలు ఉంటాయని అంటున్నారు. ఈ స్కూల్ ఇప్పటికే వివాదంలో చిక్కుకుంది. శృంగారంలో పాల్గొంటున్న స్త్రీపురుషుల వాణిజ్య ప్రకటన తీవ్రమైన వివాదాన్ని సృష్టించింది

పూల మొక్కలతో నిండుగా కనిపిస్తున్న తిరుమల

తిరుమల కొండ అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు పుడమి తల్లి పచ్చని చీర సింగారించుకొన్నట్టు వనదేవత సిగలో పూలు తురుముకున్నట్టుంటుంది. తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పూల మొక్కలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. చిరుజల్లుల తాకిడికి పూరెమ్మలు కదులుతూ చూపరులను ఆకర్షిస్తున్నాయి.  తిరుమల కొండలంటేనే చల్లని వాతావరణానికి ప్రకృతి రమణీయతకు నిలయాలు తిరుమలకు వెళ్లే యాత్రికులు వేంకటేశ్వరుని దర్శనంతో బాటు ప్రకృతి నడుమ కాస్త సేద తీరునట్లుంటుందని కూడా భావిస్తారు. గత రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు తిరుమల కొండలన్నీ అభ్యంగన స్నానం చేసినట్టు మెరిసిపోతున్నాయి. తెల తెలవారు జామున కమ్ముకున్న పొగమంచులో కనిపించే ఆలయ శిఖరంతో బాటు వినిపించే సుప్రభాతం మనసును ఆధ్యాత్మిక తీరాలకు తీసుకువెళుతుంది. మాడ వీధులన్నీ మంచుబిందువులు నిండిన పూల పొదలతో అలరిస్తున్నాయి.  ఏడుకొండల వాడి దర్శనంతో బాటు నయనానందకర ప్రకృతి సోయగాలు చూసే అదృష్టం కలిగినందుకు భక్తులు పులకించి పోతున్నారు.

సమ్మె విరమించిన త్రిపుల్ ఐటీ ఉద్యోగులు


కడపజిల్లా ఇడుపాయల ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నలభై ఐదు రోజుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిప్యూటీ సీఎం రాజనర్సింహ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. దీంతో ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని త్రిపుల్ ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు.

పవన్ కొత్త కారులో నిశ్చితార్ధానికి వెళ్లనున్నరామ్‌చరణ్‌

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ నిశ్చితార్ధానికి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫాంహౌస్‌ లోపలికి ఎంటర్‌ అవ్వాలంటే కూడా బార్‌కోడింగ్‌తో ఉన్న యాక్సెస్‌ కార్డు కావలసిందే. ఇందుకోసం ఎటిఎమ్‌ కార్డు సైజులో ఉన్న ఈ యాక్సెస్‌ కార్డులను అహ్వానితులకు అందజేశారు. అంతేకాదు కార్‌పార్కింగ్‌ దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ ఈ మధ్యనే కొత్తగా కొన్న కారులో రామ్‌చరణ్‌ను తానే స్వయంగా నిశ్చితార్ధానికి తీసుకెళ్ళనున్నారు. కేవలం అబ్బాయి ఎంగేజ్‌మెంట్‌ కోసమే, ఈమధ్యనే ఇండియాలో లాంచ్‌ అయిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌యువి వాహనాన్ని పవన్‌ కొన్నట్లు సమాచారం

కర్నూలు నగరం ద్విచక్ర వాహనానికి 28 సీట్లట

ద్విచక్ర వాహనానికి 28 సీట్ల కెపాసిటీ ఉన్నట్లు వాహన యజమానికి కర్నూలు రవాణా శాఖ అధికారులు ఆర్‌సీ జారీ చేసి రికార్డు బద్దలు కొట్టారు. మినీ బస్సులకు మాత్రమే 28 సీట్ల సామర్థ్యం ఉంటుంది. కానీ పక్క చిత్రంలో కనిపించే ద్విచక్ర వాహనానికి 28 సీట్ల కెపాసిటీ ఉన్నట్లు రికార్డు(ఆర్‌సీ) జారీ చేయడం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. కర్నూలు నగరం బీక్యాంప్ నివాసి అయిన శివకుమార్ పిళ్లై గత ఏడాది ఏప్రిల్ 30 న ద్విచక్ర వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆర్‌సీలో సీటింగ్ కెపాసిటీ 28 ఉన్నట్లు పొందు పరిచి జారీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆలస్యంగా గమనించిన వాహన యజమాని శివకుమార్ పిళ్లై కార్యాలయానికి వెళ్లి తప్పును సరిదిద్దాలని కోరగా కంప్యూటర్‌లో తప్పు పడింది. 

మమ్మల్ని ఏం చేయమంటావు అంటూ బుకాయిస్తూ ప్రభుత్వానికి చలానా కట్టండి సవరిస్తామంటూ కార్యాలయం చుట్టూ ఏడాది కాలంగా తిప్పుకుంటున్నారు. సిబ్బంది చేసిన తప్పునకు విని యోగదారుడు విలవిల్లాడుతున్నాడు. జరిగిన పొరపాటుకు దండించి సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యాలయంలో పరిపాలన దారి తప్పింది. మోటార్ క్యాబ్, టూరిస్ట్ క్యాబ్, మోటార్ కార్లకు కూడా ఛాసిస్ నంబర్లు, ఇంజన్ నంబర్లు రికార్డుల్లో తప్పులు కొట్టి జారీ చేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను మరొకరి పేరుతో బదలాయించేటప్పుడు ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ల సమయంలో కూడా వాహనానికి ఉన్న ఛాసిస్, ఇంజిన్ నంబర్లకు బదులు వేరే నంబర్లు పొందు పరుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. షోరూం వాళ్లు ఇచ్చిన పేపర్లను చూపించి రికార్డుల్లో తప్పులను సరి చేయాలని యజమానులు కోరుతున్నప్పటికీ చలానా కట్టాలని దబాయిస్తున్నారు

మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు...ఇందిరక్రాంతి పథం(ఐకేపీ)

 రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) సభ్యుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా పౌర సరఫరాల సంస్థ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్ శాఖ ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సభ్యులకు డిసెంబరు మొదటి వారంలో శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. రెండోవారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద 22,322 హెక్టార్లు, బోర్ల కింద 25,437 హెక్టార్లు, చెరువుల కింద 1020 హెక్టార్లలో వరి సాగు చేశారు. సరాసరిన ఎకరాకు 20 బస్తాల దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు మొదటివారం నుంచి వరి నూర్పిళ్లు ప్రారంభం కానుండటంతో రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉన్న ఎనిమిది మండలాలను గుర్తించి మొదట విడతగా అందులో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు

గూడెంచెరువు, సున్నపురాళ్లపల్లె (జమ్మలమడుగు)
భూమయ్యగారిపల్లె, పాతూరు (ఖాజీపేట) 
మైదుకూరు, అన్నలూరు (మైదుకూరు) 
మండల కేంద్రాలైన చాపాడు, దువ్వూరు, చెన్నూరు 
కొర్రపాడు (రాజుపాళెం)