Showing posts with label రామ్ చరణ్. Show all posts
Showing posts with label రామ్ చరణ్. Show all posts

Tuesday, 27 December 2011

పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానులకు న్యూఇయర్ రోజు గిఫ్టు

2011 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులను నిరాశ పరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ న్యూఇయర్ రోజు గిఫ్టుతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి మెగా అభిమానులందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న రచ్చ తొలి ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రచ్చ సినిమాపై ఓ మెగా అభిమాని మాట్లాడుతూ ‘‘ రచ్చ సినిమాలో రామ్ చరణ్ న్యూ గెటప్ ను చూడటానికి మేమంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాం, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదలైతే దాన్ని మాకు అందిన బహుమతిగా భావిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ మెడికల్ స్టూండెంట్ పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రచ్చ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
 

Thursday, 8 December 2011

మేమంతా కలిసే హ్యాపీగా ఉన్నాం అభిమానులు తన్నుకోవడమెందుకో?

అభిమానం అభిమానంలా ఉంటే ఒకే...అదే మితిమీరితే? హద్దులు దాటితే? శృతి మించితేనే సమాజానికి ప్రమాదం. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మెగా స్టార్, నందమూరి కుటుంబాలకు చెందిన హీరోల అభిమానులు, హీరో మహేష్ బాబు అభిమానులు ఒకపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. యుద్ధరంగాన్ని తలపిస్తున్నారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ తీవ్రమైన పదజాలంతో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసుల వ్యవస్థ అనేది లేకుంటే వీళ్ల వ్యవహారం ఎంత భయంకరంగా ఉంటుందో? మరి ఎందుకీ ఉన్మాదం? ఎందుకీ గొడవలు, ఎందుకీ పగలు, ప్రతీకారాలు? అభిమానులారా.. మీరు ప్రయాణిస్తున్న మార్గం ఇలా ఎక్కడి వరకు?మరి హీరోల మధ్య ఏమైనా గొడవలున్నాయా? ఏమైనా విబేధాలున్నాయా? అంటే ఏమీ లేదు. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ నిశ్చితార్థంలో పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ముచ్చట్లాడుకోవడమే ఇందుకు నిదర్శం. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఇందుకు తార్కాణం. ఇది ఒకరకంగా మేమంతా కలిసే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మా మధ్య విబేధాలు, గొడవలు లేవని ఫ్యాన్స్ లోకాని వారంతా ఇచ్చిన సందేశం. ఈ విషయాన్ని ఇప్పటికైనా అభిమానులు గుర్తిస్తే మంచిదని అందరి అభిప్రాయం. తమ అభిమానాన్ని చాటు కోవడం పోటీ పండటంలో తప్పులేదు. కానీ మార్గం ఇది ఎంత మాత్రం కాదు. సినిమాను విజయంవంతం చేయడంలో పోటీ పడండి...పరిశ్రమ బాగుపడుతుంది. హీరో పేరు చెప్పి ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి మీ హీరోతో పాటు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలు, ప్రతీకారాలు పెంచుకోవడం ద్వారా జరిగేది హింస, వినాశనం తప్ప మరేమీ మిగలదు.

Thursday, 1 December 2011

ఉపాసన డామినేట్ చేస్తే సంతోషిస్తా: రామ్ చరణ్

ఉపాసన తనను డామినేట్ చేస్తే సంతోషిస్తానని మెగాస్టార్ చిరంజీవి తనయుడు, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ్ అన్నారు. ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌తో ప్రత్యేకంగా ఆ వ్యాఖ్య చేశారు. నిశ్చితార్ధానికి మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నప్పుడు ఆ టీవీ చానెల్ చెర్రీని పట్టుకోగలిగింది. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నిశ్చితార్ధానికి రావడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కారు నడుపుతూ చెర్రీని నిశ్చితార్థం వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. రామ్ చరణ్ తేజ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బెంజ్ కారును తెప్పించారు. కోటిన్నర రూపాయల విలువ చేసే బెంజ్ కారులో రామ్ చరణ్ తేజ్‌ను ఫామ్ హౌస్‌కు తీసుకుని వచ్చారు. అంతకు ముందు తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. రామ్ చరణ్ తేజ్‌ను కారులో కూర్చోబెట్టుకుని తానే కారును నడుపుతూ మొయినాబాద్ ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. నిశ్చితార్థం వేదికను అంగరంగ వైభవంగా తీర్చి దిద్దారు.

Wednesday, 30 November 2011

రామ్ చరణ్.... బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు

రామ్ చరణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోవాలో ఈ పార్టీ జరగనుందని సమాచారం. డిసెంబర్ 2 లేదా మూడవ తేదీల్లో ఈ పార్టీ జరగనుంది. ఈ పార్టీకి అల్లు అర్జున్, రానా, శర్వానంద్, నవదీప్ వంటి తెలుగు హీరోలు, మరికొద్ది మంది రామ్ చరణ్ చిన్నప్పటి ప్రెండ్స్ పాల్గొనన్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్‌ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం

Sunday, 27 November 2011

పవన్ కళ్యాణ్ బాబాయ్ కి విషెష్.....రామ్ చరణ్

రామ్ చరణ్ తాజాగా విడుదలైన పంజా ఆడియోని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే...కళ్యాణ్ బాబాయ్ కి విషెష్,విష్ణు వర్ధన్ మరియు పంజా టీమ్ కి ఆల్ ది బెస్ట్. మిగతా బాబాయి సినిమాల సంగీతం లాగానే పంజా ఆడియో కూడా సక్సెస్ అవుతుంది.బాబాయ్ కు నా శుభాకాంక్షలు.చైనాలో నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను.నేను ఆడియో ఫంక్షన్ కి మిస్సయ్యాను. మీరంతా ఈవెంట్ ని,మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను.పంజాలో పాటలు విన్నాను. అవి సింపుల్లీ సూపర్బ్.ముఖ్యంగా ఓపినింగ్ సాంగ్ గురించి చెప్పుకోవాలి.మెగా ఫ్యాన్స్ తరుపున యవన్ శంకర్ రాజా కు కంగ్రాట్స్ చెప్తున్నాను అన్నారు. రామ్ చరణ్ ..రీసెంట్ గా జరిగిన పంజా ఆడియో కి రామ్ చరణ్ మరియు మెగా కుటుంబం లో ఎవరూ రాకపోవటంతో మీడియాలో ఇదో చర్చనీయాంశమైంది. దీనికి వివరణగా ఈ ట్వీట్ ని ఆయన చేసినట్లు అర్దమవుతోంది