Showing posts with label ఇందిరక్రాంతి పథం(ఐకేపీ). Show all posts
Showing posts with label ఇందిరక్రాంతి పథం(ఐకేపీ). Show all posts

Thursday, 1 December 2011

మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు...ఇందిరక్రాంతి పథం(ఐకేపీ)

 రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) సభ్యుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా పౌర సరఫరాల సంస్థ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్ శాఖ ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సభ్యులకు డిసెంబరు మొదటి వారంలో శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. రెండోవారంలో కేంద్రాలు ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద 22,322 హెక్టార్లు, బోర్ల కింద 25,437 హెక్టార్లు, చెరువుల కింద 1020 హెక్టార్లలో వరి సాగు చేశారు. సరాసరిన ఎకరాకు 20 బస్తాల దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు మొదటివారం నుంచి వరి నూర్పిళ్లు ప్రారంభం కానుండటంతో రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉన్న ఎనిమిది మండలాలను గుర్తించి మొదట విడతగా అందులో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు

గూడెంచెరువు, సున్నపురాళ్లపల్లె (జమ్మలమడుగు)
భూమయ్యగారిపల్లె, పాతూరు (ఖాజీపేట) 
మైదుకూరు, అన్నలూరు (మైదుకూరు) 
మండల కేంద్రాలైన చాపాడు, దువ్వూరు, చెన్నూరు 
కొర్రపాడు (రాజుపాళెం)