Thursday, 24 November 2011
రజనీ రాణా సినిమా కు బ్రేక్ ....కూతురు సౌందర్య తో మరో సినిమాకు కమిట్ అయ్యారు.
కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు
బాలయ్య అభిమానులకు శుభవార్త....‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్
వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల
లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
లయన్స్ క్లబ్ అధ్యక్షులు పిడికిట నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతినెలా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ నవీన్‌చంద్రా క్లినిక్‌లో ఉచితంగా దంత వైద్యపరీక్షలు నిర్వ హిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతినెలా ఒక పాఠశాలను ఎంపిక చేసుకుని విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యపరీక్షలు నిర్వహించి పేస్టు, బ్రష్, మందులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం లయన్స్‌క్లబ్ కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఎక్కువగా దంత సమస్యలు వస్తా యన్నారు. చిన్నతనం నుంచి దంతాల పరిరక్షణ పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు.
హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్‌జీ గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లోని కుష్బోనీ అడవిప్రాంతం, జంగల్ మహల్‌లో భద్రతాదళాలు-మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారు. ఈ ఘటనలో మరో మహిళా నక్సలైట్ కూడా మృతి చెందిన నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిషన్‌జీది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి.
2250 కోట్లతో రాష్ట్రంలోమెగా వాటర్‌షెడ్లు
భూగర్భ జలాల పెంపు, జీవనోపాదుల మెరుగులో భాగంగా రాష్ట్రంలో రూ.2250 కోట్లతో 450 మెగా వాటర్‌షెడ్లు ప్రారంభించిట్లు రాష్ట్ర సమగ్ర జల వనరుల అభివృద్ధి పథకం ప్రత్యేక కమిషనర్ సువర్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల జీవనోపాదుల మెరుగు కోసం ఇందిర జలప్రభ కింద రూ.1800 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పది వేల హెక్టార్లలో ఆరు వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ఆమె హిందూపురంలో తెలిపారు. ఈ పథ కం కోసం ఉపాధి హామీ ద్వారా రూ. 1000 కోట్లు, నాబార్డ్ ద్వారా రూ.800 కోట్లు విడుదల కానుందని తెలిపారు. ఇప్పటికే నాబార్డ్ ద్వారా రూ. 400 కోట్లు విడుదలైందని ఆమె తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మెగా వాటర్‌షెడ్లు, ఉపాధి హామీ పథకం ఒకే గొడుగు కిందకు తేవడం జరిగిందని, దీని ద్వారా అన్ని జిల్లాల్లో జీవనోపాదుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క మెగా వాటర్‌షెడ్ ద్వారా 15,500 ఎకరాల భూమి సారవంతమవుతుందని, ప్రతి వాటర్‌షెడ్‌పైన 5 నుండి 7 ఏళ్ళ లోపు రూ.5 కోట్ల పైబడి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో 70 మెగా వాటర్‌షెడ్లు ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటికే 20 పైబడి వాటర్‌షెడ్‌లలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు కొన్ని వాటర్‌షెడ్లు కేటాయించారన్నారు. పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, లేకపోతే ఆశించిన స్థాయిలు సాధించడం సాధ్యపడదన్నారు. వాటర్‌షెడ్ల ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని, దీనికి తోడు వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు.
Subscribe to:
Posts (Atom)