తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై
మంగళవారం చలోక్తి విసిరారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదయం శాసనసభను
బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం సభ్యులంతా బయటకు వచ్చారు. ఈ సమయంలో
అసెంబ్లీ ప్రాంగణంలో పయ్యావులకు చిరంజీవి కనిపించారు. ఆయనతో పిచ్చాపాటిగా
మాట్లాడారు. అసెంబ్లీలో ఈ రోజు మీరే స్పెషల్ అంటూ ఆయనతో అన్నారు. దానికి
చిరంజీవి అదేలా అని ప్రశ్నించారు. ఈ రోజు వాలెంటైన్స్ డే కదా మీరే హాట్
ఫేవరెట్ అని చెబుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఐ లవ్యూ అంటూ మీ వెంట పడుతున్నారు
కదా అని అన్నారు. దానికి చిరంజీవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయారు.కాగా
అంతకుముందు మంగళవారం సమావేశమైన అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది.
విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్
తిరస్కరించారు. దీంతో టిఆర్ఎస్, బిజెపి, తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణ
కోసం, సీమాంధ్ర టిడిపి నేతలు మద్యంపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీంతో
స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. ఆ తర్వాత ఇదే సీన్ రిపీట్ కావడంతో మరో
పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. మూడోసారి స్పీకర్ సభను బుధవారానికి వాయిదా
వేశారు.
Showing posts with label ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. Show all posts
Showing posts with label ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. Show all posts
Tuesday, 14 February 2012
Thursday, 24 November 2011
వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల
Wednesday, 23 November 2011
Saturday, 22 October 2011
కడప: విభజిస్తే అగ్నిగుండమే
భావితరాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములులాగా దీక్ష చేసినవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.
విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములులాగా దీక్ష చేసినవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.
Tuesday, 18 October 2011
వైయస్ విజయమ్మను ఆయన మహాభారతంలోని గాంధారితో పోల్చారు
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆస్తులపై హైకోర్టులో పిటిషన్ వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైయస్ విజయమ్మను ఆయన మహాభారతంలోని గాంధారితో పోల్చారు. దృతరాష్ట్రుడు, గాంధారి తమ పుత్రుడికి జ్ఞానోదయం కలిగించకుండా వ్యవహరించడం వల్ల కురువంశాన్నే పోగొట్టుకున్నారని, వైయస్ విజయమ్మ, వైయస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. విజయమ్మ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతి ఆరోపణపై తీర్పు ఇప్పటికే వెలువడిందని ఆయన అన్నారు. అబద్ధాలను అల్లడంలో కూడా వైయస్ విజయమ్మ విఫలమయ్యారని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్ ఉందంటూ జతచేసిన ఫొటో ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేశారని, అదే ఫొటోను తాను కూడా డౌన్ లోడ్ చేశానని, ఆ హోటల్ కట్టినప్పుడు చంద్రబాబు రాజకీయాల్లోకి కూడా రాలేదని ఆయన అన్నారు.
ఆరేళ్లు వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారని, ఆ ఆరేళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారని ఆయన అన్నారు. ఆరేళ్లు చర్యలు తీసుకోలేదంటే వైయస్సార్ చేతకానివాడైనా అయి ఉండాలి లేదా ఆరోపణలు అసత్యాలైనా ఉండాలని అంటూ ఈ రెండింటిలో ఏది నిజమో విజయమ్మ చెప్పగలరా అని ఆయన అడిగారు. చంద్రబాబు బినామీలుగా ఈనాడు రామోజీరావు, మురళీమోహన్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు పేర్లను చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందే రామోజీ రావు ఈనాడు ఉన్నత స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిఎంఆర్, జివికె, రిలయన్స్ లబ్ధి పొందాయని విజయమ్మ ఆరోపించడాన్ని ప్రస్తావిస్తూ ప్రయోజనాలు పొందినవారి పేర్లు చేర్చకుండా ప్రయోజనం పొందనివారి పేర్లను చేర్చారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో భూములు కొన్న విధంగానే వైయస్సార్ బంధువులు కూడా పెద్ద యెత్తున భూములు కొన్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రాక ముందే సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు వ్యాపారాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు
Saturday, 15 October 2011
ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడము
రైతు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాక పోతే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుసెనగ పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవడం కోసం టిడిపి పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్ర కార్యక్రమంలో శుక్రవారం లత్తవరణ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జిల్లా టిడిపి అధ్యక్షులు పార్థసారధిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటు గొప్పలు చెబుతోందని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. రైతుల పక్షాన టిడిపి అండగా ఉంటుందని అన్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందచేయలేదన్నారు. జిల్లా రైతులను ఆందుకోవడం కోసం ఈ సమస్యలను హైదరాబాద్ వరకు తీసుకెళ్లి మొండి ప్రభుత్వం మెడలు వంచడానికి దశలుగా టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు పరిహరం పంపిణీ చేస్తామని, పంటల బీమా అందచేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతా జమ చేయలేదన్నారు. జిల్లా రైతులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం అందచేయాలని వారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పమటికీ రైతు గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు
Subscribe to:
Posts (Atom)