Showing posts with label కడప. Show all posts
Showing posts with label కడప. Show all posts

Thursday, 24 November 2011

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

Monday, 14 November 2011

హాకి టోర్నీ సీమ జట్లదే హవా

 మదనపల్లెలో జరిగిన అండ ర్-14 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంటు లో కడప, అనంతపురం జట్లు విజేత లుగా నిలిచాయి. రాష్ట్ర స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్వంలో మదనపల్లె గోల్డెన్‌వ్యాలీ స్కూల్ మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. బాలుర విభాగంలో కడప జట్టు, బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయం సాధించాయి. తొలుత బాలుర విభాగంలో చిత్తూరు-అనంత పురం, కడప-కృష్ణా, హైదరాబాద్-వై జాగ్, మహబూబ్‌నగర్- గుంటూరు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. అనంతపురం, కడప, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.సెమీఫైనల్స్‌లో అనంత పురం జట్టు మహబూబ్‌నగర్‌పై 4-1 గోల్స్ తేడాతోనూ, కడప జట్టు హైదరా బాద్‌పై 5-1 గోల్స్ తేడాతోనూ విజ యం సాధించాయి. ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన కడప, అనంతపురం జట్లు ఆట సమయం పూర్తయ్యేసరికి 1-1 స్కోరుతో సమవుజ్జీలుగా నిలబడ్డాయి. దీంతో ఇరు జట్లు సడెన్‌డెత్ గోల్స్‌లో పోటీపడ్డాయి.ఇందులో కడప జట్టు 5 గోల్స్ చేయగా, అనంతపురం జట్టు నాలుగు గోల్స్ మాత్రమే చేసి అపజ యం పాలైంది.బాలికల విభాగంలో క్వార్టర్‌ఫైనల్ ్సలో వైజాగ్ జట్టుపై కడప జట్టు, ప్రకాశం జట్టుపై అనంతపురం జట్టు, తూర్పుగోదావరిపై చిత్తూరు జట్టు, వరంగల్‌పై కర్నూలు జట్టు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చిత్తూ రుపై అనంతపురం జట్టు, కర్నూలుపై కడప జట్టు విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్నాయి.ఫైనల్స్‌లో కడప జట్టుపై అనంతపురం జట్టు 2-0గోల్స్ తేడాతో అవలీలగా విజయం సాధిం చింది. విజేతలకు గోల్డెన్‌వ్యాలీ కర స్పాండెంట్ రమణారెడ్డి, ఆదిత్య కళా శాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శకుంతల బహు మతులను ప్రదానం చేశారు.జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామచంద్ర, వాల్మీకిపురం సీఐ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Sunday, 13 November 2011

కడప లో 15, 16న వస్త్ర దుకాణాలు బంద్

మంగళ, బుధవారాల్లో కడప నగరంలోని వస్త్ర దుకాణాలను మూసివేసి బంద్ నిర్వహించనున్నట్లు ‘ ది కడప క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కోదం డరామిరెడ్డి, చంద్రశేఖర్, కోశాధికారి పోసిన పెద్ద సుబ్బరాయుడు తెలిపారు. 16న ర్యాలీ నిర్వహిస్తామ న్నారు. వస్త్ర వ్యాపారాలపై అదనంగా పెంచిన 5 శాతం ‘వ్యాట్’ను రద్దు చేసే వరకూ తమ నిరసనోద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
 
 

 




Sunday, 6 November 2011

అరటి రైతులు తీవ్ర ఆందోళన

  జిల్లాలో ఒక్కసారిగా అరటి పండు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 10 పలుకగా నేడు కిలో రూ. 3 పలుకుతోంది. దీంతో అరటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాలలో దాదాపు 50 వేల ఎకరాలలో అరటి సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో రోజు వంద లారీలు అరటి కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో కిలో ధర రూ. 10 నుంచి 11 వరకు విక్రయించాల్సి ఉండగా ధరలు పడిపోవడంతో రైతులు కిలో రూ. 3 నుండి 3-50లకే విక్రయించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరటి సాగుపై పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు అవుతుంది. వివిధ రకాలకు చెందిన అరటి పిలకలను తీసుకొచ్చి రైతులు పంటను సాగు చేశారు. 11 నెలలకే పంట దిగుబడి వస్తుంది.   
                                         

 ఎకరాకు 12 వందల చెట్లు రైతులు వేస్తారు. అందులో దాదాపు 300 చెట్లు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బ తింటాయి. ఇక మిగిలిన 900 చెట్లను ఆధారం చేసుకొని రైతులు ఆదాయం తీసుకోవాలి. బాగా పండిన తోటలో ఒక్కొక్క గెలకు 25 నుంచి 30 కిలోల కాయలు వస్తాయి. కిలో రూ. 9 నుంచి 10 వరకు ధర పలుకుతుంది. అయితే కాయలు బాగా పెద్ద సైజ్‌లో ఉన్న ధర మాత్రం పూర్తిగా పడి పోయింది. దళారులకు రైతులు ఒక్కొక్క గెలకు కమిషన్ కూడా తీస్తుంటారు. అయితే రైతులు అందించిన సమాచారం మేరకు నెల కిందట 160 గెలలు కొడితే కేవలం రూ. 9 వేలు మాత్రమే చేతికి అందాయి. ధర బాగుండింటే చేతికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందేది. ధరలు పడిపోవడం వల్ల కేవలం రూ. 9 వేలు వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పంటకు రూ. 70 వేలు పెట్టుబడి పెట్టి 11 నెలల పాటు అరటి తోటలను కంటికి రెప్పలగా కాపాడుకున్న ఫలితం దక్కలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు

Friday, 4 November 2011

నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం

పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే నిమిత్తం ఆర్టీసీ యాజమాన్యం తెల్లరేషన్ కార్డుదారులకు 100 రూపాయలకే వనితా కార్డు పేరిట క్యాట్ కార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కార్డు ద్వారా కుటుంబంలోని మొత్తం సభ్యులందరికీ 10 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. ప్రజలకెంతో ఉపయోగకరంగా వుండటంతో పాటు ఆర్టీసీకి కూడా వనితా క్యాట్ కార్డు ఎంతో లాభదాయకంగా ఉంది. కానీ ఇటీవల కొంత మంది అసలైన వనితా కార్డులను కలర్ జిరాక్స్ చేసి ప్రయాణికులకు అమ్మారు. నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం కూడా చేసినట్లుంది
                                                                    .
ఫలితంగా నకిలీ కార్డుల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ముందుగా కార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన డిపో అసిస్టెంట్ మేనేజర్లు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వల్లే నకిలీ వనితా కార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ వనితా కార్డుల అవినీతిలో డిపో అసిస్టెంట్ మేనేజర్లకు భాగస్వామ్యం ఉంటుందనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వనితా క్యాట్ కార్డులోని ఫొటోలను, కార్డులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన సంతకాలు, వేసిన సీలును మాత్రమే కండక్టర్ పరిశీలిస్తారు. అంతేగాని డ్యూటీలో ఉన్న కండక్టర్ ఆ కార్డు ఒరిజినల్, లేక నకిలీ అని పరిశీలించే పరిస్థితి ఉండదు. కొంతమంది అవినీతి సీఐలు చేసిన మోసాల తప్పిదాలకు కండక్టర్లపై అక్రమ కేసులు బనాయించి బాధ్యులను చేస్తున్నారు

Sunday, 30 October 2011

రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు

 కాశీ మఠం సంస్థానం శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ మాజీ శిష్యుడు, ఆయన వారసుడిగా తృణీకరణకు గురైన రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడపలోని ఇందిరానగర్‌లో గల ఫ్లాట్‌లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్‌లో కొన్ని చీకటి పనులు జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని ఇందిరా నగర్‌లోని ఆయన ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందుకు వచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 20 విగ్రహాలను, రూ.8.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

కాశీ మఠానికి చెందిన విగ్రహాలను, చరాస్థులను, ఇతరాలను వెంటనే సుధీంద్ర తీర్థ స్వామీజీకి అప్పగించాలని ఇంతకు ముందు తిరుపతి కోర్టు ఆదేశించింది. దాంతో రాఘవేంద్ర హైకోర్టుకు వెళ్లాడు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. తాను మతపరమైన పర్యటనలో ఉన్నానంటూ వాటిని అప్పగించేందుకు రాఘవేంద్ర తీర్థ నిరాకరించారు. అక్టోబర్ 12వ తేదీన ఇందిరానగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఓ ల్యాప్‌టాప్‌ను, 600 ఏళ్లనాటి లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని, కొన్ని పంచలోహ విగ్రహాలను, పులి గోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా రాఘవేంద్ర తీర్థ స్వామీజీపై కేసులున్నాయి

Saturday, 22 October 2011

అటవీ ప్రాంతాల్లో 25 చిరుతలు

                   
రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని శేషాచలం, వెలుగొండ అటవీ ప్రాంతాల్లో సుమారు 25 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని రాజంపేట డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో అటవీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ... గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా 25 చిరుతలు ఉన్నట్లు తాము నిర్ధరణకు వచ్చామన్నారు. శేషాచలం అటవీ ప్రాంతానికి తరచుగా 20 ఏనుగుల మంద వచ్చి వెళ్తుంటుందన్నారు. ఈ ప్రాణులు అటవీ ప్రాంతాన్ని దాటి శివారుల్లోకి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు

కడప: విభజిస్తే అగ్నిగుండమే

భావితరాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములులాగా దీక్ష చేసినవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.




Tuesday, 18 October 2011

రాయలసీమ ఆర్టీపీపీ మజ్దూర్ పోస్టులు

రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంటు నాలుగవ దశ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి అర్హతను బట్టి అక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని కడప ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు. జూనియర్ ప్లాంటు అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందుకు పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఐటిఐ పాసై ఉండాలని ఆయన చెప్పారు. బాధితుల పక్షాన వచ్చిన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ అధికారులు నిర్ణయించిన అర్హత ఉన్న ప్రజలు బాధితుల్లో లేరన్నారు.

చదవడం, రాయడం వస్తే సరిపోయే మజ్దూర్ పోస్టులు ఇప్పించాలని కోరగా తాను ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్టీపీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పలు సమస్యలపై ప్రజలు ఆర్డీఓకు విన్నవించారు

Sunday, 16 October 2011

దేశంలో వివిధ ప్రైవేటు పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు

                                
దేశంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు శనివారం స్థానిక స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ ఎన్.వెంకటయ్య వివిధ స్కీములను లాంచింగ్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కార్లు, ఇళ్లు, అన్ని వాహనాలకు, స్టాక్స్, షాపులు, బిల్డింగ్‌లకు తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందవచ్చని వెంకటయ్య తెలిపారు. వివిధ వాహనాల మరమ్మతుల నిమిత్తం 56 రకాలకు ఈ పథకం వర్తించనున్నది. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైతే సంబంధిత వాహనదారుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 7 రోజులలోపు ఆ వాహనాన్ని గ్యారేజీకి తీసుకెళ్లడానికి ఇన్సూరెన్స్ ఉన్నవారికి బ్యాంకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇంత వరకు ఈ పథకాన్ని ఏ సంస్థ కూడా ప్రవేశపెట్టలేదని ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది 4000 మంది రైతులకు రూ.12 కోట్లు రాయచోటి ఎస్‌బిఐ పరిధిలో రుణాలు ఇచ్చామని సంబంధిత రైతులు బీమా చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం సహాయక గ్రూపులకు తమ బ్యాంకు నుంచి 1000 మహిళా గ్రూపులకు ఎనిమిది కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పంపిణీ చేశామని, సక్రమంగా పని చేసే గ్రూపులకు మరింత ప్రోత్సాహాలు అందిస్తామని తెలిపారు. అలాగే రూరల్ బ్యాంకింగ్ డెవలప్‌మెంట్ ( ఆర్‌బిడి) మేనేజర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ ఛీఫ్ మేనేజర్ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన సందేహాలు తనను కలిసి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు

Saturday, 15 October 2011

రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు

కడప నగరంలో శుక్రవారం జరిగిన సీమ సమైక్యాంధ్ర సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకులు, మహిళా నాయకురాళ్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్ సిహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు తమ ఉద్యమంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల సమస్య, పెండింగ్ ప్రాజెక్టుల సమస్య తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ విభజన రెండవ అంశంగా భావిస్తామన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమే అన్నింట వెనుకబడి ఉందన్నారు. పోతిరెడ్డిపాడుకు 30 రోజులు వరద నీళ్లు పారితే ప్రస్తుతం మనకు నీళ్లు వచ్చాయన్నారు. గాంధీగిరి అంటునే కెసిఆర్ రౌడీయిజం చేస్తున్నాడన్నారు. రాయలసీమ వాసులుగా మనం ఏం పోగొట్టుకున్నామో వారికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయన్నారు. రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు. మరో మాజీ మంత్రి రామమునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విడిపోతే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి అల్లూరు సీతారామరాజుకన్నా ముందే బ్రిటిష్ వారిపై పోరాడాడన్నారు. తెలంగాణ వారు మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారన్నారు. రాయలసీమ జర్నలిస్టు సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవరికి లేదన్నారు. జెఎసి తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా మీడియా అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే మనకు నీళ్లుండవు, ప్రాజెక్టులు కూడా వారే కట్టుకుంటారన్నారు. అందుకే మన భావాన్ని ఢిల్లీకి గట్టిగా తెలపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వారు నెల రోజులుగా పోరాటం చేస్తుంటే మనం చోద్యం చూడడం దురదృష్టకరమన్నారు. కర్నూలు టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ వారికి బుద్ధి వచ్చేలా మనం ఉద్యమించాలన్నారు. మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కోరటం మనం చేసిన త్యాగాలకు ఫలితమా అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను ఖండించాలన్నారు. మైనార్టీ నాయకులు అమీర్‌బాబు మాట్లాడుతూ సమైక్యతే ముస్లింల మనోభావమన్నారు. లక్ష మంది పొట్టి శ్రీరాముల లాంటి వారు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రొద్దుటూరు భార్ అసోసియేషన్ అధ్యక్షులు నూరుల్లా మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమ కారులపై పోలీసులు పెట్టే ఎలాంటి కేసులైన తమ భార్ అసోసియేషన్ ఉచితంగా వాధిస్తుందన్నారు. మహిళా నాయకురాలు చిక్కేరు జానకి మాట్లాడుతూ తెలంగాణ పోరాటం స్వార్థపూరిత పోరాటమన్నారు. ప్రతి రోజు రాయలసీమ ఉద్యమం ఉండాలన్నారు. మరో నాయకురాలు అల్లె ప్రభావతి మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యమంలో మహిళల మనోభావం దెబ్బతింటోందని ఉద్యమంలో మా పాత్రే ముందుండాలన్నారు

Thursday, 13 October 2011

కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు సీపీఐ

      
                              


ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పులి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని విమర్శించారు. రైతులు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోందని దుయ్యబట్టారు.

ఈ నెల 17, 18 తేదీల్లో కరువు పరిశీలనకు సీపీఐ రాష్ట్ర బృం దం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వస్తోందన్నారు

కడప జిల్లాకు చేరిన గ్రూప్-2 మెటీరియల్

 ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర మెటీరియల్ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. కలెక్టరేట్ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డి మెటీరియల్‌ను స్వాధీన పరచుకుని జిల్లా ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి