రిమాండ్
రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ
మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో
మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో
టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ
తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని
సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో
పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని
కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి
తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై
టీడీపీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు
తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో
ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు
మాట్లాడుతూ నున్న వెంకట రమణ
ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.
Showing posts with label తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు. Show all posts
Showing posts with label తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు. Show all posts
Friday, 24 February 2012
ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలి..చంద్రబాబు డిమాండ్
రిమాండ్
రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ
మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో
మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో
టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ
తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని
సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో
పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని
కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి
తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై
టీడీపీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు
తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో
ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు
మాట్లాడుతూ నున్న వెంకట రమణ
ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.Tuesday, 21 February 2012
శాసనసభ నడపడం చేతకాకపోతే రాజీనామా చేయాలి...చంద్రబాబు
శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తూ పోతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, స్పీకర్
నాదెండ్ల మనోహర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే రకంగా చేసి వైయస్ ఏమయ్యారో
చేశారని, వీరికి కూడా అదే అవుతుందని, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి
వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని, మిగిలి ఉన్న
అసెంబ్లీని భ్రష్టు పట్టించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు
ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. శానససభా సమావేశాల తీరు చూస్తుంటే మొదటి
సారి తనకు ఆవేదన, బాధ కలుగుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ రాజకీయాలు టిడిపికి కొత్తేమీకాదన్నారు. గతంలో ప్రధాని అయ్యే అవకాశం
వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వదులుకున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ
టిడిపి గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. ఉప ఎన్నికల
పొత్తుపై సిపిఎంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ
సమావేశాలు చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలు
చర్చిద్దామన్నా అవకాశం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ
జరుగకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. శాసనసభని
చక్కగా నడిపించవలసిన బాధ్యత స్పీకర్ దేనని చెప్పారు. రేపటి నుంచైనా
శాసనసభని సజావుగా నడిపించమని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలపై శాసనసభని నడపడం
చేతకాకపోతే రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు చురకలు
అంటించారు.శాసనసభ
సమావేశాలు జరగకపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
అనుకుంటున్నారని ఆయన అన్నారు. అది జరగకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తాము ఏం
చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా
నిలబెడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా
చూస్తున్నారని ఆయన అన్నారు. Friday, 10 February 2012
యువతరం రాజకీయాల్లోకి రావాలి...చంద్రబాబు
యువతరం రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
పిలుపునిచ్చారు. యువ తరంగం సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ
సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా పాలన రాజ్యమేలుతోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. మద్యం సిండికేట్లలో
మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆమంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి
బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతి లోని పార్టీలో గ్రూపులున్నా.. సదస్సును విజయవంతం చేసేదిశగా యువతను
సమీకరించడంలో తలమునకలయ్యా రు. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు పెద్దపీట
వేస్తామ న్న ప్రకటనతో విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లోనూ కదలిక వచ్చిందని
పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. ఈ సదస్సు తో అటు పార్టీకి,ఇటు యువతలో
రాజకీయ చైతన్యానికి నాంది పలకటం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Wednesday, 21 December 2011
కాంగ్రెస్ ప్రభుత్వం, త్వరలో ఇంటికి పంపుతాం ...నారా చంద్రబాబు నాయుడు
Thursday, 24 November 2011
కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు
Subscribe to:
Posts (Atom)