నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ఒక వరం లాంటిదని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల డైరక్టర్ మోహన్‌రావు పేర్కొన్నారు. కలెక్టరేట్ సభా భవనంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనపై బ్యాంకు అధికారుల తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంఆర్‌వై పథకంలో భాగంగా పరిశ్రమ స్థాపనలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నా రు. రూ.110 కోట్లు సబ్సిడీ వినియోగించుకోవాల్సి ఉండగా మన రాష్ట్రం 73 కోట్లు సబ్సిడీ వినియోగించుకుందన్నారు. రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటులో మొద టి స్థానానికి రావాలంటే బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందిం చాలన్నారు.నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు బ్యాంకు అధికారులు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని సూచించారు. రిజ ర్వు బ్యాంకు 10లక్షలు చిన్న పరిశ్రమలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాం కులు రుణాలు ఇవ్వాలని 25లక్షలు క్రెడిట్ ప్లాన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకులు మంజూరు చేస్తారన్నారు. బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను మొదటి కంతు చెల్లించిన వెంటనే సబ్సిడీ వస్తుందని తెలి పారు. 2011కి 297 కోట్లు మార్జిన్ మనీ కింద 12936 ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు.యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ అందిస్తే వారిని బ్యాంకులు రుణాలు సబ్సిడీపై అందించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన కల్పించాలన్నారు
Wednesday, 23 November 2011
నిరుద్యోగులకు తప్పని తిప్పలు
పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు క్రిమీలేయర్ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకు నేవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తే సరిపోతుంది. కానీ ఈ పర్యాయం ప్రభుత్వం నోటిఫి కేషన్ జారీ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికేట్లు జత చేయాలని ఆదేశించింది. దీంతో అ భ్యర్థులు తహసీల్దార్ కార్యాలయానికు క్యూ కట్టారు. మీ సేవ ద్వారా ఆ దాయం,కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారే కానీ క్రిమిలేయర్ అంశం లేదు. సర్టిఫికేట్ మంజూరు చేయాలం టే రెవెన్యూ అధికారులు పెద్ద తతంగమే పూర్తి చేయాల్సి వుంది. దీని కోసం ఓ ఫైలును తయారు చేసి వీ ఆర్వోలు, ఆర్ఐలు స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి వుంది. దీనితో పాటు అ భ్యర్థుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయాల్సి వుంది. ఆదాయ పరిమితి సంవత్సరానికి రూ.4.5 లక్షలు లోపు వున్న వారికే ఓబీసీ సర్టిఫికేట్ మంజూరు చేయాలన్నది ప్రభుత్వ నిర్ధేశం. ఈ ప్రక్రియ పూర్తి చేసి సర్టిఫికేట్ చేతికందే సరికి వారం రోజులు పడుతోంది. స్థానిక తహసీల్దార్ అమరేం ద్రబాబుతో అభ్యర్థులు తమ సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ వీఆర్వోలు, ఆర్ఐలు విచారించి సైడ్ ఇన్షియల్ వేస్తే క్రిమిలేయర్ సర్టిఫికేట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్ఐలు నవీన్, శాస్త్రిలకు సూచనలిచ్చారు
ఐసెట్ ద్వారానే ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) ద్వారానే వచ్చే ఏడాది ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు స్పష్టం చేశారు. మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామంటూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వద్ద ప్రతిపాదన ఉన్నట్లే మాకు తెలియదని ఆయన చెప్పారు. వాస్తవానికి అలాంటి సమాచారం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2012-13 విద్యా సంవత్సరంలో కూడా ఐసెట్ ద్వారానే ఎంబీఏ కోర్సుకు అడ్మిషన్లు నిర్వహిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. ఇంజనీరింగ్ అడ్మిషన్లు కూడా ఎంసెట్ ద్వారానే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కూడా జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఆలోచన కూడా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ప్రైవేటు సంభాషణల్లో ఆయా ఆలోచనలు వచ్చి ఉండొచ్చని, అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన లేదన్నారు. వృత్తి విద్య ఫీజుల విషయమై రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు
Tuesday, 22 November 2011
‘బెజవాడ’ సినిమా మళ్లీ వాయిదా డిసెంబర్ 1న విడుదల
కడప జిల్లాలోని ఫ్యాక్షన్ మళ్ళీ పగడలెత్తింది.
జిల్లాలోని ఫ్యాక్షన్ పగలు మళ్ళీ పగడలెత్తింది. ప్రొద్దుటూరు, ఆర్టీవో కార్యాలయం వద్ద తండ్రీ, కొడుకులను ప్రత్యర్ధులు వేటకొడవళ్ళతో నరికివేశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. మృతి చెందిన తండ్రీకొడుకులిద్దరూ చెన్నమరాజుపల్లెకు చెందిన సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణలుగా పోలీసులు గుర్తించారు.వీరు ఓ హత్యా కేసులో నిందితులు, ఇటీవలె జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం. వీరిద్దరూ ఈరోజు ఉదయం మోటారు బైక్‌పై వెళుతుండగా మాటు వేసిన ప్రత్యర్ధులు సుమో వాహనంపై వచ్చి, బైక్‌ను ఢీకొట్టి హతమార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు
6000 కోట్లతో రాష్ట్రంలో శ్వేత విప్లవం:ముఖ్యమంత్రి
ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా మిల్క్ మిషన్
చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
చెప్పారు. హైదరాబాద్‌లో ఫుడ్ 360 డిగ్రీస్ పేరిట జరుగుతున్న ఆహార ఉత్పత్తుల
సదస్సును సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో
కొద్ది కాలం క్రితం ప్రయోగాత్మక ప్రాతిపదికన పాల ఉత్పత్తి పెంపునకు ఒక
కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. అదే కార్యక్రమాన్ని రాష్ట్ర
వ్యాప్తంగా విస్తరించడం ద్వారా గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం
ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.చిత్తూరు జిల్లాలో ఇందిరా
క్రాంతి పథం (ఐకెపి) ద్వారా గ్రామీణ మహిళలకు 3000 లీటర్ల వరకు సామర్థ్యం గల
బల్క్ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం ద్వారా
లీటరు పాలకు మూడేళ్ల క్రితం లభించిన ఆరేడు రూపాయల ధర 20 నుంచి 21 రూపాయలు
వచ్చేలా చేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రోజుకి 14 లక్షల
లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దీనికి అనుబంధంగా పెరుగు,
ఫ్లేవర్డ్ మిల్క్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారుచేయడం ద్వారా వారు అదనపు
ఆదాయాలు కూడా పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు.
వర్మ సినిమాలో విలన్ గా నాగార్జున
Subscribe to:
Posts (Atom)