Showing posts with label నాగార్జున. Show all posts
Showing posts with label నాగార్జున. Show all posts

Saturday, 7 January 2012

శ్రీవారీకి తలనీలాలు సమర్పించుకున్న అక్కినేని నాగార్జున

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రారంభ దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించుకున్నారు. నాగార్జునతోపాటు అమల, అఖిల్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 'రాజన్న' డిఫరెంట్ గా ఉందని...ఢమరుకం సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. కాగా ఈరోజు తిరుమలకు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. ఆనాటి హీరోయిన్ మీనా కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అదే సమయంలో ముఖ్యమంత్రి రావడంతో మీనా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు సామాన్య భక్తులతో ఉండిపోయారు

Monday, 2 January 2012

దూరంగా పొండి అంటూ మీడియాఫై...నాగార్జున ఫైర్

సెలబ్రిటీల కుటుంబాల్లో వివాహ వేడుకైనా, విషాద వేడుకైనా, ఏవేడుకైనా ఈ మధ్య మీడియా తెగ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ఇలా పోటీ పడటానికి వివిధ చానల్స్ మధ్య పెరిగి పోతున్న పోటీ తత్వమే అని కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి పోటీ తత్వం ఒక్కోసారి సదరు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజా విషయానికొస్తే... .అన్నపూర్ణమ్మ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు కుటుంబీకులంతా విషాదంలో మునిగి ఉంటే మీడియా హడావుడి కూడా మొదలైంది. అసలు మీడియాకు చాలా దూరంగా ఉండే నాగార్జునకు వారి తీరు నచ్చ లేదని, తన మనుషుల ద్వారా మీడియా వారిని ఆదేశించాడని, వచ్చి పోయే వారిని ఇబ్బంది పెట్టకుండా తమ ఇంటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా ఉంది. అన్నపూర్ణమ్మ అంతిమ యాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కనిపించక పోవడంపై కారణం ఏమిటి? అంటూ ఊహాగానాలు ప్రసారం కావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Wednesday, 28 December 2011

జెకె భారవి దర్శకత్వంలో మోహన్ బాబు,నాగార్జున

ప్రముఖ రచయిత జె కె భారవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఆది శంకరా చార్య. ఈ చిత్రంలో ఆల్రెడీ నాగార్జున గెస్ట్ గా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో కి ఈ సినిమాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. మోహన్ బాబు భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుతున్నారు. గతంలో తాను రాసిన అన్నమయ్యలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను చేసి చిత్రానికి వెన్నుముకలా నిలిచారు. ఇక నాగార్జున ఈ చిత్రంలో చేయటంపై భారవి మాట్లాడుతూ..‘నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగ్ నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను’ అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

Monday, 26 December 2011

నయనతారపై కన్నేసిన నాగార్జున ?

శ్రీరామ రాజ్యం సినిమాలో సీత పాత్ర పోషించిన నయనతార మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆమె అద్భుతమైన నటనకు యావత్ తెలుగు సినిమా లోకం ప్రేక్షకులంతా ముగ్దులైపోయారు. నయన తార కెరియర్లో ఇదివరకెప్పుడూ రాని మంచి పేరు ఈ సినిమాతో సొంతం చేసుకుంది. దీంతో ఆమెతో అలాంటి పాత్రలు చేయించడానికి పలువురు దర్శక నిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు దూరంగా ఉంటుందని ప్రచారం మరో వైపు సాగుతోంది. ఆ విషయం అలా ఉంచితే రామ్ గోపాల్ వర్మ ‘రామాయణం’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో నాగార్జునతో రావణ్ పాత్ర చేయిస్తానని చెప్పాడు కూడా. అయితే నాగార్జున మాత్రం...నేను రావణుడి పాత్ర చేయడం ఏమిటి అదంతా రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు.సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాముడి పాత్రను నాగార్జున డిమాండ్ చేస్తున్నాడని, సీత పాత్రలో నయనతార అయితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని వర్మకు తేల్చి చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు వర్మకూడా సరే అన్నట్లు సమాచారం. శ్రీరామ రాజ్యం సినిమా లాస్ట్ అని నయనతారకు ఆంక్షలు విధించిన ప్రభుదేవా..వర్మ సినిమాలో ఆమె నాగ్‌తో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడో, లేదో అని చర్చించుకుంటున్నారు.

Friday, 25 November 2011

అనుష్క కోసం గోపీచంద్, నాగార్జున పోటీ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తాను ‘రామాయణం’ సినిమాను తెరకెక్కిస్తానని, తన స్టయిల్ లో రామాయణం సినిమాను తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక రావణుడు పాత్ర తరహాలో సాగే క్యారెక్టర్ కి నాగార్జునని సైతం ఎంపిక చేసారు. అయితే సీతా, రాముడుగా కీ రోల్ లో ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో అనుష్క, గోపీచంద్ పేర్లు బయిటకు వచ్చాయి. వీరిది హిట్ పెయిర్ కావటం ఓ కారణం,అంతేగాక అనుష్కలో హుందాతనం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఆమె కోసం గోపీచంద్, నాగార్జున పోటీపడటం సినిమాలో హైలెట్ అవుతుందని వర్మ భావించాడని వినిపిస్తోంది. అందులోనూ ప్రస్తుతం అనుష్క వరసగా నాగార్జున సినిమాల్లో చేస్తోంది. అంతకుముందు గోపీచంద్ తో పెళ్లి జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ సినిమాకు కాంట్రావర్సి తెచ్చి ఓపినింగ్స్ తెస్తాయని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

Tuesday, 22 November 2011

వర్మ సినిమాలో విలన్ గా నాగార్జున

రామ్ గోపాల్ వర్మ చిత్రం శివతో స్టార్ గా ఎదిగిన నాగార్జున మరోసారి ఆయన దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. రామ్ గోపాల్ వర్మ రామాయణం టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జునని రావన్ రాజు అనే పాత్రకు అడిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఓ కార్పోరేట్ సంస్ధకు అధిపతిగా నాగార్జున మోడ్రన్ టచ్ తో పౌరాణిక మూలాలు ఉన్న పాత్రను పోషిస్తారు. అలాగే ఆ పాత్ర సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. రామాయణానికి ఓ కొత్త ట్విస్టు ఇచ్చి సినిమాని నడపాలనుకుంటున్నాడని, అందుకే పాత్రలకు సైతం పాపులర్ స్టార్స్ నే ఎంపిక చేయాలని నాగార్జునని సంప్రదించాడని తెలుస్తోంది. నాగార్జున సైతం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాత్రలో మనుష్యుల్లో ఉండే చీకటి వాంఛలను చూపనున్నారని చెప్తున్నారు. మన్మధుడు గా ఇన్నాళ్లూ ఏలుతున్న నాగార్జున ఒక్కసారిగా ఇటువంటి పాత్రను ఒప్పుకుని వైవిద్యతను ప్రదర్సించాలనుకుంటున్నారు