Friday, 10 February 2012

యువతరం రాజకీయాల్లోకి రావాలి...చంద్రబాబు

యువతరం రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. యువ తరంగం సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా పాలన రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆమంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతి లోని పార్టీలో గ్రూపులున్నా.. సదస్సును విజయవంతం చేసేదిశగా యువతను సమీకరించడంలో తలమునకలయ్యా రు. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తామ న్న ప్రకటనతో విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లోనూ కదలిక వచ్చిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. ఈ సదస్సు తో అటు పార్టీకి,ఇటు యువతలో రాజకీయ చైతన్యానికి నాంది పలకటం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Thursday, 9 February 2012

కాంగ్రెస్‌లో విభేదాలు వాస్తవమే...ఎమ్మెల్యే చిరంజీవి

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు శాసనసభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి రూ. 405 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. సీఎంతో బుధవారం జరిగిన సమావేశంలో అభివృద్ధిపైనే చర్చించినట్లు చిరంజీవి పేర్కొన్నారు.కాగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తానని, శాఖల కేటాయింపుల్లో కూడా సమన్వయం చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.

సీబీఐ అవసరమైతే మంత్రులనూ విచారించవచ్చు...జేసీ దివాకర్‌రెడ్డి

లీగల్ ఓపీనియన్ తీసుకుని అవసరమైతే ఆయా శాఖల మంత్రులను కూడా సీబీఐ విచారించవచ్చునని మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ కేవలం ఐఏఎస్‌లను టార్గెట్ చేస్తూ విచారణ జరుపుతోందే తప్ప సంబంధిత మంత్రుల గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలపై జేసీ పై విధంగా స్పందించారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన మంత్రి డీఎల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు జేసీ తిరస్కరించారు. తనను అడిగేకంటే ఆయన్నే అడిగితే సరైన సమాధానం వస్తుందని చతమ్కరించారు. డీఎల్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయన్న దానిపై జేసీ స్పందిస్తూ అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు.వైఎస్ హయాంలోని భూకేటాయింపులకే పరిమితయ్యేలా సభాసంఘం వేయడంపై జేసీ మాట్లాడుతూ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పలు సభాసంఘాలు వేశారన్నారు. అనేక విచారణలు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకునే సభాసంఘం వేశారన్నారు. అంతమాత్రాన టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయనడంలో అర్థం లేదన్నారు.

Wednesday, 8 February 2012

కర్నూలు జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో కర్నూలులో జర గనున్నాయి. ముంబై కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆధ్వర్యంలో ఫైనల్ ఎంపిక జాబితా వెలువడనుం ది. ఈ మే రకు జిల్లాలోని 36 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలకు అర్హ త సాధించిన వారి జాబితా కేడీసీసీ బ్యాంకు అధికారులకు పంపించింది. మొత్తం 146 మందికి లేఖలు పంపినట్టు అధికార వర్గాల సమాచారం. ఇంటర్వ్యూలో త్రిసభ్య కమిటీ..కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగాలకు త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. చైర్మన్‌గా కాతా అంకిరెడ్డి, సభ్యులు గా జీఎం మరియు సీఈవో మోహన్‌రె డ్డి, నా బార్డు డీడీఎం శ్రీవత్స వ్యవహరించనున్నారు.మెరిట్‌కే పట్టం.. ఎంపికలో ఎలాంటి అవకతవకలుండవని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కాతా అంకిరెడ్డి అన్నారు. రాత పరీక్షలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జా బితా మాత్రమే తమకు పంపించారని, మార్కు లు పంపలేదని వివరించారు. ఇంటర్వ్యూలో త్రి సభ్య కమిటీ 5 మార్కులను నిర్ణయిస్తుందన్నా రు. అర్హత పరిశీలనలో డిగ్రీలో 75 శాతం మా ర్కులు దాటిన వారికి మెరిట్ ప్రకారం 5 మార్కు లుండగా.. కంప్యూటర్ పరిజ్ఞానానికి 5 మార్కులుంటాయని చెప్పారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, వ్యవసాయ రంగ అనుభవాలకు ఏడాదికి రెండు మార్కుల చొప్పున 5 సంవత్సరాలకు 10 మార్కులు ఇస్తారన్నారు.మార్కుల విధానం ఇలా.. కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఎంపికకు మొత్తం మార్కులు 200. అందులో రాత పరీక్షకు 175 మార్కులుంటాయి. ఈ జవాబు పత్రాల మూల్యాంకనం ముంబై బ్యాంకింగ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అనంతపురం జిల్లా అన్నదాతలును ఆదుకోండి

వరుస కరువుతో అనంత అన్నదాతలు ప్రజలు కూలీలు, అల్లాడి పోతున్నారు. ఆ భారి నుంచి రక్షించి, ఆదుకోవాలంటూ కేంద్ర కరువు పరిశీలన బృందాలకు జిల్లా టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. నంపెట్టే రైతన్న ఆ కుటుంబ పోషణ కోసం కూలీగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రైతులను ఆదుకోవడంలో పాలకులు,విఫలం చెందారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా పట్టంచుకోవడం లేదన్నారు. పంటల భీమా, పంట నష్టపరిహారం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. అరకొరగా వచ్చిన పరిహారం కూడా బ్యాంకర్లు పాత అప్పులకు జమచేసుకుంటున్నారని వాపోయ్యారు. వర్షాబావ పరిస్థితుల వల్ల భూగర్భ జాలాలు అడుగంటిపోయాయన్నారు. బోర్ల క్రింద పంటలు ఎండిపోవడంతో పాటు తాగడానికి నీరులేక అవస్థలు పడుతున్నామన్నారు. పేదలను ఆదుకోవడానికి ఉపా«ధి పథకం పెట్టినా పనులు కల్పించడంలేదన్నారు. దీంతో వలసలు వెళ్తున్నారని తెలిపారు. జిల్లాకు రావాల్సిన వాటా నీరు కూడా రావడంలేదన్నారు. అందుకే అనంతను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని,నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10వేలు పరిహారం అందించాలని, ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనంతో పాటు ఇతర విత్తనాలు అందించాలని పశువుల కోసం పశుగ్రాసం,నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని . ఉపాధి పథకంను వ్యవసాయానికి సందానం చేయాలని టీడీపీ నేతలు కరువు బృందం ప్రతినిధులకు విన్నవించి వినతి పత్రం అందించారు.

దుకాణాలకు వ్యాపారానికి లెసైన్సు తప్పనిసరి

చిత్తూరు మున్సిపాలిటీలో చేసే ప్రతి వ్యాపారానికి అధికారుల నుంచి పొందిన లెసైన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లెసైన్సు లేకుండా ఎలాంటి వ్యాపారమైనా నిర్వహించడానికి వీల్లేదన్నారు. వ్యాపారాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. పురపాలక చట్టం-1965 ప్రకారం పట్టణాల్లో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ మున్సిలిటీ నుంచి లెసైన్సు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపల్ గెజిట్‌లో దాదాపు 400 రకాల వ్యాపారాలున్నాయని చెప్పారు. టీ దుకాణం నుంచి బార్బర్ షాపు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, సినిమా థియేటర్లు ఇలా అన్నీ డీ అండ్‌వో (డేంజరస్ అండ్ అఫెన్స్) ట్రేడ్స్ కిందకు వస్తాయన్నారు. వీటి నిర్వాహకులు ప్రతి ఏటా మున్సిపాలిటీ నుంచి లెసైన్సు తీసుకోవడానికి కనిష్టంగా రూ.115 నుంచి రూ.24,735 వరకు చెల్లించాలని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం ప్రతి ఏటా 2433 దుకాణాల నుంచి రూ.17 లక్షలు లెసైన్సు రుసుం కింద వసూలు చేస్తున్నామని చెప్పారు.  మొత్తం 3500 దుకాణాల నుంచి రూ.22 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి కార్యరూపం దాల్చడానికి ప్రణాళికయుతంగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి దుకాణదారుడికీ  నోటీసులు జారీ చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారి తెలిపారు. చేసే వ్యాపారం ఆధారంగా ఎంత చెల్లించాలనే విషయం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతారన్నారు. ఆ మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లించాలని చెప్పారు. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటవుతుందని తెలిపారు. రెండో ఏడాది కూడా ఇంతే మొత్తాన్ని చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి రెండేళ్ల తరువాత 15 శాతం రుసుం పెంచుతుంటామన్నారు. ఈ నెలాఖరులోపు రుసుం చెల్లించని వాళ్లు మార్చి 15వ తేదీ లోపు మొత్తం రుసుం మీద 25 శాతం అపరాధం చెల్లించాలని తెలిపారు. లేని పక్షంలో మార్చి 16 నుంచి దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సు లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు సహకరించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వస్తా...యువరాజ్

 బీజ కణ క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స చేసుకుంటున్న యువరాజ్ మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్‌తో ఫోన్‌లో ఛాట్ చేస్తూ "నాకే ఎందుకు ఇంత ఇబ్బంది కోలవేరి డి?" అని అన్నారు. అమెరికాలో ఉన్న బోస్టన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టర్లు నా ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నాడు. డాక్టర్లు ఇచ్చే మెడిషన్‌కు బాగానే రెస్పాండ్ అవుతున్నానని అంటున్నారు. దేవుడి దయవల్ల నేను తొందరలోనే మీ ముందుకి వస్తానని తెలిపాడు.దీనితో పాటు తన ప్రైవసీని గౌరవిస్తున్నందుకు మీడియాకు కృతక్షతలు తెలిపాడు. తన ట్విట్టర్ ద్వారా నా దేశం జెర్సీ, క్యాప్ ధరించి.. దేశం తరుపున మళ్లీ ఆడేందుకు ప్రతి రోజూ ఎదురు చూస్తున్నానని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఇక యువరాజ్ టీమ్‌మేట్స్ టీమిండియా సభ్యులలో ఒకడైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 'యువీ అమెరికాలో కీమోథెరఫీ చికిత్స కోసం వెళ్లిన సంగతి తెలిసింది. అతడు త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం. యువీ సత్వరంగా కోలుకోవాలని జట్టు సభ్యులందరం ప్రార్ధిస్తున్నాం' అని పేర్కొన్నాడు.ట్రీట్‌మెంట్ మొదట్లో, నేను కోపంతో పాటు కొంత గందరగోళ పరిస్దితిలో ఉన్నాను. నేను నా జీవితంలో విభిన్నంగా కొన్ని పనులు చేసి ఉన్నానని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తెలియగానే.. ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు కౌన్సిలర్ చేసిన సహాయం మరువలేదని అన్నారు. ప్రస్తుతం నేను ఓ ఫైటర్‌ని. గతంలో మాదిరి కాకుండా నేను ఇంకా బలవంతుడి మాదిరి తిరిగి వస్తానని యువరాజ్ తెలిపాడు.టీమిండియాకు ప్రపంచ కప్‌ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఎడమ చేతి వాటం యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో కీమెధెరపీ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతక్షతలు తెలిపాడు. తాను కోలుకోవాలంటూ ప్రార్దనలు చేస్తున్న కారణంగా తిరిగి వస్తానని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేసాడు