కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే
చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్
దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు శాసనసభ్యుడు
చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు తిరుపతి వచ్చిన ఆయన
మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి రూ. 405 కోట్లు విడుదల
చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని ఆయన
అన్నారు. సీఎంతో బుధవారం జరిగిన సమావేశంలో అభివృద్ధిపైనే చర్చించినట్లు
చిరంజీవి పేర్కొన్నారు.కాగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు
తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. ఆరోపణలు నిరాధారమని
కొట్టిపారేశారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తానని, శాఖల
కేటాయింపుల్లో కూడా సమన్వయం చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.
Showing posts with label తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts
Showing posts with label తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts
Thursday, 9 February 2012
కాంగ్రెస్‌లో విభేదాలు వాస్తవమే...ఎమ్మెల్యే చిరంజీవి
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే
చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్
దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు శాసనసభ్యుడు
చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు తిరుపతి వచ్చిన ఆయన
మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి రూ. 405 కోట్లు విడుదల
చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని ఆయన
అన్నారు. సీఎంతో బుధవారం జరిగిన సమావేశంలో అభివృద్ధిపైనే చర్చించినట్లు
చిరంజీవి పేర్కొన్నారు.కాగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు
తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. ఆరోపణలు నిరాధారమని
కొట్టిపారేశారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తానని, శాఖల
కేటాయింపుల్లో కూడా సమన్వయం చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.Friday, 27 January 2012
అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి
తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు
చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి
వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీ
ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం
పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి
సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు
అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు
చిరంజీవి మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం
గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది
కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా
మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ
రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి,
మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని
దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు
చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య
భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు
గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి
అభిమానులు పాల్గొన్నారు.
Monday, 23 January 2012
ఉప ఎన్నికలో తిరుపతి నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ...!?
తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కుతోంది.
చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్లిపోతే తిరుపతి శాసనసభ
నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఓటమి
పాలవుతుందనే భయాలను పక్కన పెడుతూ వ్యూహాత్మకంగా చిరంజీవి ముందుకు
వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో తిరుపతి అభ్యర్థిగా కాంగ్రెసు
నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి వారసురాలిగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే
అవకాశాలను ఆయన వర్గానికి చెందిన నాయకులు తోసిపుచ్చడం లేదు. తిరుపతిలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి
చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి
నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ
వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా
తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి
కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం
చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి తన బావమరిది అల్లు
అరవింద్‌ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి
గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి
దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా
లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను
కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి
భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు
తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్
రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.Friday, 9 December 2011
శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు...చిరంజీవి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిపై
స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది.
చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం విప్ వంగా గీత శుక్రవారం సాయంత్రం
స్పీకర్‌కు శోభా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస
తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఆమె ఓటు వేసిన
విషయం తెలిసిందే. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ
చేసినప్పటికీ ఆమె మాత్రం అనుకూలంగానే ఓటు వేశారు. దీంతో తీవ్ర తర్జన భర్జన
అనంతరం చిరు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నారు.2009 ఎన్నికల
సమయంలో ఆళ్లగడ్డ పిఆర్పీ వర్గాలు శోభకు టిక్కెట్ వ్యతిరేకించినప్పటికీ
చిరంజీవి ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఆమె తీరు చూసి చిరంజీవి ఆవేదన
చెందుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలంతా తనతో ఉంటున్నారు. కానీ కేడర్
వద్దంటున్నా టిక్కెట్ ఇచ్చి గెలిపించిన ఆమె వైఖరితో మాత్రం చిరంజీవిని
ఆగ్రహానికి గురి చేస్తుందట
Tuesday, 6 December 2011
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి
Saturday, 3 December 2011
తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి బుజ్జగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
Subscribe to:
Posts (Atom)
