Wednesday, 18 January 2012
నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
అనంతపురం జిల్లాలో కరవు బృందం పర్యటన
జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపై అధ్యయనం చేసి వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక
రూపొందించేందుకు కేంద్ర అధ్యయన బృందం రెండు రోజుల పాటు జిల్లాలో
క్షేత్రస్థాయిలో పర్యటన చేయనున్నట్లు కలెక్టర్ వి.దుర్గాదాస్ ఒక ప్రకటనలో
తెలిపారు. కేంద్ర సాంకేతిక బృందంలో 19 మంది సభ్యులు ఉంటారన్నారు. వీరందరూ
ఆయా రంగాలలో వివిధ అంశాలలోనిష్ణాతులని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ
రంగాల్లో, వాతావరణ అంశాలు వంటి అనేక పరిశోధనలు చేసిన అపార అనుభవజ్ఞలన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవారన్నారు.
క్షేత్ర పర్యటనలో వివిధ భౌగోళిక, స్థానిక అంశాలు, అక్కడి పంటల సాగు,
దిగుబడి, వర్షపాతం తదితర వివరాలతో పాటు స్థానిక రైతులతో ముఖాముఖి
కార్యక్రమం చేపడతారన్నారు. 19 మం ది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో మూడు
బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటన చేయనుందన్నారు. 18న ఒకటవ బృందం
అనంతపురం నుంచి బయలుదేరి మలకవేములకు చేరుకుంటుంది. అక్కడ రైతులతో ము ఖాముఖి
ఏర్పాటు అనంతరం కదిరికి చేరుకుని అక్కడ నుంచి బట్రేపల్లి,
యనుములదొడ్డివారి పల్లి, కటారుపల్లి చేరుకుంటుంది. రెండవ బృందం అనంతపురం
నుంచి గుట్టూరు, అడదాకులపల్లి, చెరుకూరులకు చేరుకుని అక్కడి రైతులతో
మాట్లాడుతుందన్నారు. అనంతరం మడకశిరకు చేరుకుని రాత్రికి అక్కడే బస
చేస్తుందన్నారు. మూడవ బృందం అనంతపురం నుంచి బయలుదేరి చక్రాయపేట,
చీమలవాగుపల్లిలలో రైతులతో సమావేశమవుతుందన్నారు. అనంతరం గుంతకల్లుకు
చేరుకుని రాత్రికి గుంతకల్లులోనే బస చేస్తుందన్నారు. 19న ఒకటవ బృందం
కటారుపల్లి నుంచి బయలుదేరి కమతంపల్లి, పులగంపల్లి, ముక్తాపురం గ్రామాలలో
రైతులతో సమావేశమవుతుందన్నారు. రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. రెండవ
బృందం మడకశిర నుంచి బయలుదేరి హీరేతుర్తి, ములకనూరు, పంపనూరు గ్రామాలలో
రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. మూడవ బృందం
గుంతకల్లు నుంచి బయలుదేరి పందికుంటలో రైతులతో సమావేశమవుతుందన్నారు.
రేణిమాకుల పల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను సందర్శిస్తుందన్నారు. మాళ్యంలో
రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. 19న రాత్రికి మూడు
బృందాలు అనంతపురం చేరుకుని జిల్లా కేంద్రంలోనే బస చేస్తాయన్నారు. 20న ఉదయం
పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెవెన్యూ భవన్‌లో ప్రజలు,
ప్రజాప్రతినిధులు, ఎన్‌జీఓలు, అభ్యుదయ, ఆదర్శ రైతులతో సమావేశమవుతారని
తెలిపారు.
Tuesday, 17 January 2012
బాలయ్యపై పోటీపై పార్టీదే నిర్ణయం, చర్చిస్తాం...చంద్రబాబు నాయుడు
పరిటాల హత్యకు హోంమంత్రి ఫాం హౌస్ లో కుట్ర...మంత్రి శంకరరావు
ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫాం హౌస్ నుండే దివంగత తెలుగుదేశం
పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ చేనేత, జౌళీ
శాఖ మంత్రి శంకరరావు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ
రాశారు. ఆయన సోనియాకు ఎనిమిది పేజీల లేఖ రాసి ఫ్యాక్స్ చేశారు. అందులో ఆయన
పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాల హత్యకు కుట్ర సబితా ఫాం హౌస్
నుండే జరిగిందన్నారు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డి భూఆక్రమణలకు
పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగి నెల రోజులు దాటినా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించక పోవడం బాధాకరమన్నారు. దాడికి
కారకులపై సబితా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై ఇప్పటి వరకు
ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోనియాకు
విజ్ఞప్తి చేశారు.కార్తీక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని
కోరారు. బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవడం పార్టీకి సబబు కాదని లేఖలో
అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ అవినీతి
కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. పాలనపై అధిష్టానం ఐబి రిపోర్టు
తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంగా
తప్పించాలన్నారు.
రాయలసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి
హిందువుల పండుగల్లో మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఎంత దూరంలో
ఉన్నప్పటికీ తప్పనిసరిగా స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో,
గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో
సంక్రాంతి పండుగకు పట్టణాల్లో చదువుతున్న యువకులు, ఉద్యోగాలు చేస్తున్న
ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో
పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఏ పల్లెలో చూసినా వాహనాలతో కొత్త కొత్త
వ్యక్తులతో కనిపించాయి. గ్రామానికి చేరుకున్న కొత్తవ్యక్తులు, పల్లెకు
చెందిన వారు గ్రామంలో ఉండే రైతులను పలకరించడం, కలిసి మెలిసి సంక్రాంతి
పండుగను చేసుకున్నారు. అయితే రైతును ఏమాత్రం కదిలించినా కష్టాలను
దిగమింగుతూ వారికి తమ కష్టం ఎందుకు చెప్పుకోవాలన్న ఆలోచనతో చిరునవ్వుతో
వారిని పలకరించడం, వచ్చిన బంధువులను, స్నేహితులకు, అల్లుళ్లు, ఆడ బిడ్డలకు
ఎక్కడా ఏలోటు రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనపడింది. తమ
కష్టాలు ఎన్నిఉన్నా వారు వచ్చేది సంవత్సరానికి ఒకమారే కదా,
వచ్చినపుడువారికి తమ కష్టాలను చూపడం భావ్యం కాదన్న విధంగా సంతోషంగా పండుగను
జరుపుకోవాలన్న సదుద్దేశంతో కలిసి మెలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.
అయితే పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులు ధరల పోటు ఆకాశాన్ని అంటినా
కొనుగోలుచేయక తప్పలేదు. ఆరేడు సంవత్సరాలుగా వరుస కరవులతో సంక్రాంతి పండుగ
కాలక్రమేణా ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమాలు చేయడం తప్ప పండుగలో పూర్తి
కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పండుగ వచ్చింది ఏదో చేసుకోవాలా, నలుగురితో
నారాయణ అన్న చందంగా చేయడమేతప్ప మనస్ఫూర్తిగా రైతు లు ఈ పండుగను
జరుపుకోలేకపోతున్నారు. కారణం ప్రభుత్వ వైఫల్యం, ప్రకృతి కనికరించకపోవడం
రైతులను ప్రతియేడు నష్టాలలోకి నెట్టేస్తోంది. గతంలో సంక్రాంతి పండుగ అంటే
గ్రామ సీమలు కళకళలాడుతుండేవి. పారుతున్న సెలయేర్లు, పక్షుల రాగాలతో, పచ్చని
పైర్లతో రైతన్న ముఖంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. పండించిన ధాన్యం
రాసులుపోసి ఎటువెళ్లినా రైతన్నకు ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు.
ప్రస్తుతం అదే రైతన్న బజారులోకి అప్పుకోసం వెళితే గతంలో పిలిచి అప్పు ఇచ్చే
ఆసాములు నేడు ముఖం చాటుచేసుకుని వెళ్తున్నారు
రాయలసీమ జిల్లాలో వణికిస్తున్న చలిపులి
బ్యాటింగ్ వైఫల్యమే...కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
Subscribe to:
Posts (Atom)