ప్రపంచంలోని ప్రతి నిరుపేద భక్తునికి భగవంతుని సందేశం వినిపించడం ధ్యానం
యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కలుగ జేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,
బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ డైరక్టర్ రతన్‌జీ తెలిపారు.
గోకులంలో గల వారి కార్యాలంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా
130 దేశాల్లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలున్నా, విదేశాలకు
లండన్ ప్రధాన కేంద్రంగా భారత్‌లో వౌంట్ అబు కేంద్రంగా పని
చేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 సేవా కేంద్రాలు వున్నాయని,
భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహుర్తంలో
రోజు 10 లక్షల మంది ధ్యానం చేస్తారని, ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం 6:30
గంటల నుండి 7:30 గంటల మధ్య విశ్వశాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం
నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతినికి కాంక్షించే సంస్థగా
ఐక్యరాజ్య సమితి తల ట్రస్టుకు ఐదు శాంతిదూత అవార్డులను ప్రధానం
చేసిందన్నారు. నైతిక విలువలతో కూడిన బోధనలు, మారసిక ప్రశాంతత చేకూరడం, దుర
అలవాట్లకు గురైన వారిని సన్మార్గంలో మార్చడం యోగా ద్వారా సాధ్యమన్నారు.
పుట్టపర్తిలో ఐదు ఎకరాల్లో 81 అడుగుల ఎత్తుతో లింగాకృతిలో సుమారు 5 కోట్ల
వ్యయంతో మ్యూజియంను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఆడిటోరియం,
ధ్యాన మందిరం వసతి గృహాలు వుంటాయన్నారు. ప్రతి మతం వారు భగవంతుడు ఒక్కడే
అని నమ్ముతున్నారని, అయితే ఆ భగవంతుడు ఎవరనేది తెలుసుకోలేక పోతున్నారని,
రాజయోగం ద్వారా పరమాత్తుని గురించి తెలుసుకోవచ్చన్నారు.
Showing posts with label పుట్టపర్తి. Show all posts
Showing posts with label పుట్టపర్తి. Show all posts
Saturday, 3 March 2012
పుట్టపర్తిలో4 కోట్లతో మ్యూజియం
ప్రపంచంలోని ప్రతి నిరుపేద భక్తునికి భగవంతుని సందేశం వినిపించడం ధ్యానం
యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కలుగ జేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,
బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ డైరక్టర్ రతన్‌జీ తెలిపారు.
గోకులంలో గల వారి కార్యాలంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా
130 దేశాల్లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలున్నా, విదేశాలకు
లండన్ ప్రధాన కేంద్రంగా భారత్‌లో వౌంట్ అబు కేంద్రంగా పని
చేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 సేవా కేంద్రాలు వున్నాయని,
భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహుర్తంలో
రోజు 10 లక్షల మంది ధ్యానం చేస్తారని, ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం 6:30
గంటల నుండి 7:30 గంటల మధ్య విశ్వశాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం
నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతినికి కాంక్షించే సంస్థగా
ఐక్యరాజ్య సమితి తల ట్రస్టుకు ఐదు శాంతిదూత అవార్డులను ప్రధానం
చేసిందన్నారు. నైతిక విలువలతో కూడిన బోధనలు, మారసిక ప్రశాంతత చేకూరడం, దుర
అలవాట్లకు గురైన వారిని సన్మార్గంలో మార్చడం యోగా ద్వారా సాధ్యమన్నారు.
పుట్టపర్తిలో ఐదు ఎకరాల్లో 81 అడుగుల ఎత్తుతో లింగాకృతిలో సుమారు 5 కోట్ల
వ్యయంతో మ్యూజియంను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఆడిటోరియం,
ధ్యాన మందిరం వసతి గృహాలు వుంటాయన్నారు. ప్రతి మతం వారు భగవంతుడు ఒక్కడే
అని నమ్ముతున్నారని, అయితే ఆ భగవంతుడు ఎవరనేది తెలుసుకోలేక పోతున్నారని,
రాజయోగం ద్వారా పరమాత్తుని గురించి తెలుసుకోవచ్చన్నారు.Friday, 25 November 2011
అనంతపురం జిల్లాలో 5 మండలాల్లో సత్యసాయి మొబైల్ వైద్య సేవలు
సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని వెల్లడిచేసిన మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఏడు జిల్లాలకు మొబైల్ వైద్య సేవలు విస్తరిస్తూ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రకటన మేరకు కట్టుబడి సెంట్రల్ ట్రస్టు ఉదయం సాయికుల్వంత్ సభా మండపంలో మొబైల్ వైద్య సేవలను సత్యసాయి సంస్థల దేశీయ అధ్యక్షులు, ట్రస్టు సభ్యులైన మద్రాస్ శ్రీనివాస్, ఆర్‌జె రత్నాకర్ చేతులమీదుగా ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణల అనంతరం ఆధునిక వైద్య వసతులతో కూడిన మొబైల్ వాహనాలను సాయికుల్వంత్ సభా మండపంలో జిల్లాల వారీగా వరుస క్రమంలో వుంచి పూజానంతరం ప్రారంభించారు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదల చెంతకు చేర్చే లక్ష్యంతో ప్రారంభించినట్లుగా ట్రస్టు వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మొబైల్ వైద్య సేవలను అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాలూకాలోని 5 మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలను విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వైఎస్‌ఆర్ కడప జిల్లాకు విస్తరింప జేసి సదరు జిల్లాల్లో 410 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తారు. అత్యాధునిక వైద్య వసతులు కలిగిన మొబైల్ వాహనంలో అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించే సౌకర్యాలను అందుబాటులో వుంచినట్లుగా ప్రారంభనంతరం ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఈ వైద్య సేవలు డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయి. మొబైల్ వైద్య సేవల్లో డాక్టర్లు, పారా మెడికల్ స్ట్ఫా, సేవాదళ్ సభ్యులు పాల్గొని సేవలందిస్తారు. ప్రధానంగా మొబైల్ వై ద్యచికిత్సల తదుపరి రోగ తీవ్రతను బట్టి వైద్య సేవలను, అత్యవసర సేవలను అందించేందుకు సత్యసాయి సేవా సంస్థలకు అనుబంధంగా వున్న నర్సింగ్ హోంలలో చేర్పించి వైద్య సేవలు అందించే విధానాన్ని అమలుపరుస్తున్నారు. సత్యసాయి ప్రేమతత్వపు స్ఫూర్తితో వీటిని నిర్వహిస్తున్నామని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి
Wednesday, 23 November 2011
సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Monday, 14 November 2011
ముగిసిన అఖండ భజన
Subscribe to:
Posts (Atom)