Showing posts with label సత్యసాయి. Show all posts
Showing posts with label సత్యసాయి. Show all posts

Monday, 19 December 2011

పాతికేళ్ల తర్వాత సత్యసాయి ప్రశాంతి నిలయంలో విద్యుత్ కోత

ప్రశాంతి నిలయంలో పాతికేళ్ళుగా అమలుకాని విద్యుత్ కోతను ఆదివారం పట్టణ ప్రజలు చవిచూశారు. సత్యసాయి భౌతికంగా వున్న రోజుల్లో ప్రశాంతి ని లయంలో విద్యుత్ అంతరాయం, కోత అనే రెండు పదాలు చవిచూసిన దా ఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యు త్ కోత అమలుచేసినప్పటికీ ప్రశాంతి నిలయం ఫీడర్‌కు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అయ్యేది. అయితే సత్యసాయి శివైక్యానంతరం పరిస్థితులు మారిపోయాయి. ప్రప్రథమంగా 8 గంటల పాటు పాతికేళ్ళ విరామానంతరం విద్యుత్ కోతను విధించడం పట్టణ ప్రజలను, వ్యాపార వర్గాలను ఇబ్బందులకు గురిచేసింది. ఆదివారం నుండి అమలులోకి వచ్చిన విద్యుత్ కోతల మేరకు ఉదయం 6 నుండి 10 దాకా, తిరిగి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల దాకా విద్యుత్ కోత అమలులో వుంటుంది. పగటివేళ రోజు మొత్తం కలిపి 4 గంటలు మా త్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో పుట్టపర్తిని సందర్శించే పర్యాటకులు విద్యుత్ కోత మూలంగా వసతి గృహాల్లో వేడి నీరు దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బహుళ అంతస్థుల్లో నివసిస్తున్న వయసు పైబడిన భక్తులు విద్యుత్ కోతతో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో సమాధి దర్శనానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇదిలా వుండగా పట్టణంలో వ్యా పార సముదాయాలు విద్యుత్ కోతతో స్తంభించాయి. ఇదిలా వుండగా ట్రాన్స్ కో అధికారులు సైతం వరి పంటను సాగు చేయవద్దని కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని కోరడం చూస్తే రానున్న రోజుల్లో విద్యుత్ కోత ప్రభావం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శీతాకాలంలోనే పరిస్థితి ఈ విధంగా వుంటే వేసవికాలంలో విద్యుత్ సరఫరా వుంటుం దా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నా యి. ఏది ఏమైనా పుట్టపర్తిలో అంతర్జాతీయ పర్యాటకుల తాకిడితోపాటు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌లో వైద్య సేవలు కొనసాగుతున్న దృష్ట్యా రోగులకు అసౌకర్యం కలిగే పరిస్థితి నెలకొంటుంది. కావున ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పుట్టపర్తిని దృష్టిలో వుంచుకొని విద్యుత్ కోతను అమలుచేయకుండా ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని స్థానికులు కోరుతున్నారు.

Wednesday, 23 November 2011

సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమైంది. బాబా శివైక్యం పొందిన తరువాత మొదటి సారి జరుగుతున్న వేడుకలకు సత్యసాయి ట్రస్టు చర్యలు చేపట్టింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి భక్తులు చేరుకున్నారు. మరోవైపు సత్యసాయిడీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సం ఇవాళ జరుగనుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాబా భౌతికంగా దూరమైన తరువాత నిర్వహించే మొదటి జన్మదిన వేడుక ఇది. ప్రతిసారి సాయిపుట్టిన రోజున బాబాను దర్శించుకొని భక్తులు పులకించిపోయేవారు. బాబా ప్రకటించే సేవాకార్యక్రమాలకోసం ఉత్కంఠంగా ఎదురు చూసేవారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక రథంలో ఊరేగి అందరిని దీవించే వారు. భక్తులు బాబా పాదాలను తాకి పరవశించిపోయేవారు. ఈ సారి బాబా భౌతికంగా లేకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాబా పుట్టిన రోజు వేడుకలను చూసి తరచేందుకు దేశ, విదేశాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆయన తమతో లేకపోయిన సాయి దివ్యసమాధిని దర్శించుకునేందుకే ఇక్కడికి వచ్చామంటున్నారు. సత్యసాయిబాబా డీమ్డ్ యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం వేడుక ఇవాళ జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరంలో చాన్స్‌లర్ జస్టిస్ భగవతి అధ్యక్షతన ఈ వేడుకలు జరుగనున్నాయి. ముఖ్యఅతిధిగా బెంగుళూరుకు చెందిన పరిశోధనా శాఖ డైరెక్టర్ బలరాం పాల్గొంటారు. ప్రతిభకనబరిచిన విద్యార్ధులకు బంగారు పతకాలను బహూకరిస్తారు.

Monday, 14 November 2011

ముగిసిన అఖండ భజన

సత్యసాయిబాబా 86వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన అఖండభజన  ముగిసింది. ప్రతి ఏటా ప్రపంచశాంతిని కాంక్షిస్తూ అఖండ భజన నిర్వహించడం ప్రశాంతినిలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా   6గంటలకు జ్యోతిప్రజల్వనతో ప్రారంభమైన అఖండభజన 24 గంటల పాటు కొనసాగి ఆదివారం సాయంత్రం మంగళహారతితో ముగిసింది. అఖండ భజనను పురస్కరించుకొని వేదపారాయణంతో పాటు రుద్రహోమాలు నిర్వహించారు. 24 గంటల పాటు కొనసాగిన ఈ అఖండ భజన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులతో పాటు విద్యార్థులు పాల్గొని భక్తిగేయాలను ఆలపించారు. మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.అయితే సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన అఖండభజనల్లో వేలాదిమంది భక్తులు పాల్గొనడంతో ప్రశాంతినిలయం నూతనశోభను సంతరించుకుంది. గత కొంతకాలంగా నిర్లిప్తతగా వున్న పట్టణ ప్రజల్లో కూడ అఖండభజనకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసి నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఇప్పటిదాకా పుట్టపర్తి భవిష్యత్తుపై సందేహం వ్యక్తం చేస్తున్న వ్యాపారవర్గాల్లో కూడా అఖండభజన కార్యక్రమాలను తిలకించిన పిదప వారిలో ధీమావ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు కార్యదర్శి ప్రసాద్‌రావు, ట్రస్టుసభ్యులు రత్నాకర్, ఎస్‌విగిరి, నాగానంద, వైస్‌చాన్స్‌లర్ శశిధర్‌ప్రసాద్,రిజిస్ట్రార్ నరేన్‌రాంజీ, ప్రిన్సిపాల్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు