Showing posts with label అనంతపురం. Show all posts
Showing posts with label అనంతపురం. Show all posts

Friday, 25 November 2011

అనంతపురం జిల్లాలో 5 మండలాల్లో సత్యసాయి మొబైల్ వైద్య సేవలు

సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని వెల్లడిచేసిన మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఏడు జిల్లాలకు మొబైల్ వైద్య సేవలు విస్తరిస్తూ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రకటన మేరకు కట్టుబడి సెంట్రల్ ట్రస్టు ఉదయం సాయికుల్వంత్ సభా మండపంలో మొబైల్ వైద్య సేవలను సత్యసాయి సంస్థల దేశీయ అధ్యక్షులు, ట్రస్టు సభ్యులైన మద్రాస్ శ్రీనివాస్, ఆర్‌జె రత్నాకర్ చేతులమీదుగా ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణల అనంతరం ఆధునిక వైద్య వసతులతో కూడిన మొబైల్ వాహనాలను సాయికుల్వంత్ సభా మండపంలో జిల్లాల వారీగా వరుస క్రమంలో వుంచి పూజానంతరం ప్రారంభించారు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదల చెంతకు చేర్చే లక్ష్యంతో ప్రారంభించినట్లుగా ట్రస్టు వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మొబైల్ వైద్య సేవలను అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాలూకాలోని 5 మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలను విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వైఎస్‌ఆర్ కడప జిల్లాకు విస్తరింప జేసి సదరు జిల్లాల్లో 410 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తారు. అత్యాధునిక వైద్య వసతులు కలిగిన మొబైల్ వాహనంలో అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించే సౌకర్యాలను అందుబాటులో వుంచినట్లుగా ప్రారంభనంతరం ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఈ వైద్య సేవలు డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయి. మొబైల్ వైద్య సేవల్లో డాక్టర్లు, పారా మెడికల్ స్ట్ఫా, సేవాదళ్ సభ్యులు పాల్గొని సేవలందిస్తారు. ప్రధానంగా మొబైల్ వై ద్యచికిత్సల తదుపరి రోగ తీవ్రతను బట్టి వైద్య సేవలను, అత్యవసర సేవలను అందించేందుకు సత్యసాయి సేవా సంస్థలకు అనుబంధంగా వున్న నర్సింగ్ హోంలలో చేర్పించి వైద్య సేవలు అందించే విధానాన్ని అమలుపరుస్తున్నారు. సత్యసాయి ప్రేమతత్వపు స్ఫూర్తితో వీటిని నిర్వహిస్తున్నామని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి

Monday, 14 November 2011

హాకి టోర్నీ సీమ జట్లదే హవా

 మదనపల్లెలో జరిగిన అండ ర్-14 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంటు లో కడప, అనంతపురం జట్లు విజేత లుగా నిలిచాయి. రాష్ట్ర స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్వంలో మదనపల్లె గోల్డెన్‌వ్యాలీ స్కూల్ మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. బాలుర విభాగంలో కడప జట్టు, బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయం సాధించాయి. తొలుత బాలుర విభాగంలో చిత్తూరు-అనంత పురం, కడప-కృష్ణా, హైదరాబాద్-వై జాగ్, మహబూబ్‌నగర్- గుంటూరు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. అనంతపురం, కడప, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.సెమీఫైనల్స్‌లో అనంత పురం జట్టు మహబూబ్‌నగర్‌పై 4-1 గోల్స్ తేడాతోనూ, కడప జట్టు హైదరా బాద్‌పై 5-1 గోల్స్ తేడాతోనూ విజ యం సాధించాయి. ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన కడప, అనంతపురం జట్లు ఆట సమయం పూర్తయ్యేసరికి 1-1 స్కోరుతో సమవుజ్జీలుగా నిలబడ్డాయి. దీంతో ఇరు జట్లు సడెన్‌డెత్ గోల్స్‌లో పోటీపడ్డాయి.ఇందులో కడప జట్టు 5 గోల్స్ చేయగా, అనంతపురం జట్టు నాలుగు గోల్స్ మాత్రమే చేసి అపజ యం పాలైంది.బాలికల విభాగంలో క్వార్టర్‌ఫైనల్ ్సలో వైజాగ్ జట్టుపై కడప జట్టు, ప్రకాశం జట్టుపై అనంతపురం జట్టు, తూర్పుగోదావరిపై చిత్తూరు జట్టు, వరంగల్‌పై కర్నూలు జట్టు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చిత్తూ రుపై అనంతపురం జట్టు, కర్నూలుపై కడప జట్టు విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్నాయి.ఫైనల్స్‌లో కడప జట్టుపై అనంతపురం జట్టు 2-0గోల్స్ తేడాతో అవలీలగా విజయం సాధిం చింది. విజేతలకు గోల్డెన్‌వ్యాలీ కర స్పాండెంట్ రమణారెడ్డి, ఆదిత్య కళా శాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శకుంతల బహు మతులను ప్రదానం చేశారు.జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామచంద్ర, వాల్మీకిపురం సీఐ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Saturday, 12 November 2011

సత్యసాయి భక్తుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

 యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన సత్యసాయి భక్తుడు ఐశాక్ టైగ్రేట్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23వ తేదీలోగా బాబా తనతో చర్చించిన విషయాలను బయటకు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐశాక్ తెల్ల కాగితాలపై బాబా స్వయంగా గీసిన స్కెచ్ లను బయటపెట్టారు. అనేకమార్లు ప్రత్యేకంగా సంభాషించే అవకాశం సత్యసాయి తనకు కల్పించారని, ఈ క్రమంలో సత్యసాయి సంస్థల భవిష్యత్ ప్రణాళిక అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఐశాక్ ఈమెయిల్ ద్వారా ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.వెయ్యికాళ్ల మండపం తరహాలో ప్రశాంతి నిలయంలో ఆలయాలు నిర్మించాలని తనతో బాబా చెప్పారన్నారు. అటువంటి స్కెచ్ లను బాబా వేసి చూపించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ప్రశాంతి నిలయం ఉండాలని, అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తన సందేశాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని బాబా తనతో చెప్పినట్లు ఐశాక్ టైగ్రేట్ వెల్లడించారు

Wednesday, 9 November 2011

ఓ రైతు రికార్డు: ఎద్దుకు గంతలు కట్టి సాగు

అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన తైదుల ఈశ్వరరెడ్డి పొలంలో బుటారు నాగరాజు  మంగళవారం  వినూత్న ప్రయోగం చేశారు. ఒంటెద్దుకు గంతలు కట్టి పగ్గాలు, పట్టెండ్లు లేకుం డా 12 ఎకరాల్లో జొన్న సాగుచేశాడు. ఉద యం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు సాగు పూర్తిచేశాడు. సాధారణంగా కాడెద్దులతోనే ఎనిమిది గంటల వ్యవధిలో ఇంత విస్తీర్ణంలో సాగుచేయడం కష్టసాధ్యం. అలాం టిది ఒకే ఎద్దుకు గంతలు కట్టి విత్తడం ఆషామాషీకాదు. ఈ దృశ్యాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు తిలకించి యువరైతు నాగరాజును అభినందించారు.

సత్యసాయి జయంతి వేడుకలు త్వరలో

సత్యసాయి బాబా జయంతి వేడుకలు మరో రెండు వారాల్లో జరగనున్నాయి. వీటి కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రతి జన్మదినం ఒక పర్వదినంలా జరిగేది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, ప్రభుత్వం జన్మదిన ఏర్పాట్లపై మూడునెలల ముందు నుంచే కసరత్తు చేసేవి. వేడుకలకు దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేవారు. ప్రతి జన్మదినాన బాబా వరాలు కురిపించేవారు. 

విద్య, వైద్యం, తాగునీరు తదితర కార్యక్రమాలకు చేయూతనిచ్చేవారు. సత్యసాయి దివ్యప్రకాశం వల్ల పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. గుడిసెలు పోయి ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. మాంద్యం సందర్భాలను ఎరుగక ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చింది. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో పుట్టపర్తిలో కోట్ల రూపాయల లావాదేవీలు సాగాయి. 

పతినిత్యం వచ్చీ వెళ్లే భక్తులతో పట్టణం కిటకిటలాడేది. బాబా తన దేహాన్ని వదిలి ఇటీవల శివైక్యం చెందారు. బాబా జయంతి వేడుకలపై ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. బాబా పూర్వపు దివ్య వైభవాన్ని సత్యసాయి ట్రస్టు నిర్వాహకులు ఏ విధంగా కొనసాగిస్తారో వేచిచూడాల్సి వుంది. బాబా చివరి కోరికలుగా ప్రచారమవుతున్న వేయి స్తంభాలగుడి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి, సేవలందించే పథకాలను ట్రస్టు ప్రకటించవచ్చని భక్తులు ఎదురుచూస్తున్నారు. 

సివిల్స్ కు ఉచిత శిక్షణ

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2012కు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ డాక్టర్ సి.రామాంజినేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

బయోడేటా ఫారం లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంవత్సరాదాయం, కులం, విద్యార్హతలు, వాటి ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, రూ.5 విలువైన స్టాంపులు అతికించిన రెండు సెల్ఫ్ అడ్రస్ కవర్లతో ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్, అనంతపురం అనే చిరునామాకు పంపాలన్నారు.

Monday, 7 November 2011

అనంతకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.259 కోట్లు నిధులు మంజూరు

                                        
 జిల్లా లో గత ఏడాది పంట నష్టపోయిన రై తులకు ఇన్‌పుట్ సబ్సీడీ అందించనున్నట్టు ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. 2010- 11కి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.259 కోట్లు నిధులు మంజూరు చేయనున్న ట్టు ఆయన వెల్లడించారు. ధర్మవరం మార్కెట్‌యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శై లజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అ ధ్యక్షత వహించారు. మంత్రి ఆనం రా మనారాయణరెడ్డి మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ హాయంలోనే రైతులకు న్యా యం జరుగుతుందన్నారు

Wednesday, 2 November 2011

అనంతపురం జిల్లా లో చంద్రబాబు పాదయాత్ర

                                                          
ని త్యం కరువుతో సతమతమవుతున్న రై తులకు అండగా టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్రకు శ్రీ కారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరు వు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు తలపెట్టిన ఈ పాదయాత్రకు అనంతపురం జిల్లానుంచి బుధవారం ప్రారం భం కానుంది. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంత రైతులకు బా సటగా ఈ యాత్ర సాగనుందని టీడీ పీ శ్రేణులు వెల్లడించాయి. అనంతపు రం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని సీసీ కొత్తకోట గ్రామం నుంచి( ధర్మవరం- పుట్టపర్తి రహదారిపై) చంద్రబాబు పాదయాత్ర సాగుతుం ద ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కా ల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీ కే పార్థసార«థి తెలిపారు.


సీసీకొత్తకోట గ్రామం నుంచి మొదలయ్యే చంద్రబాబు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని బసంపల్లి, కనముక్కల, వె ల్దుర్తి, ఆముదాలకుంట క్రాస్, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొడపగానిపల్లి, మైలేపల్లి, కొత్తచెరువు వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కరువు అనగానే గుర్తుకు వచ్చే అనంతపురం జి ల్లానుంచి ఈ యాత్రకు శ్రీకారం చు ట్టాలని టీడీపీ శ్రేణులు భావించాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధం గా ఆరు సంవత్సరాలు వరుస కరువులు వచ్చాయని, దీంతో వ్యవసా యం చేయడం అలా ఉంచితే బతుకే భారమైన పరిస్థితి రైతాంగంలో నెలకొంది.

దీంతో రైతులకు అండగా ని లిచి వారి కష్టాలు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రై తు సమస్యలపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకు ని టీడీపీ నేతలు జనసమీకరణలో ము నిగిపోయారు. చంద్రబాబు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లులో టీ డీపీ నేతలు తలమునకలయ్యారు

Sunday, 30 October 2011

కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు

                             
కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకువచ్చిన ఆయన ప్రభుత్వాస్పత్రి, వివాదాస్పద మిస్సమ్మ కాంపౌండ్ స్థలాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది తాము అడిగిన దానికంటే ఎక్కువగానే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నప్పటికీ...ఆచరణలో మాత్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్భాటంగా కరువు మండలాలను ప్రకటించడం... ఆ తర్వాత చేతులెత్తేయడం రివాజుగా మా రుతోందని విమర్శించారు. పక్షం రోజుల్లో కరువు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించి సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడమే కాకుండా... ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు

అనంతపురం జిల్లా లో 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు

జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రభుత్వం శనివారం అధికారిక ంగా ప్రకటించింది. మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం ఈ విషయాన్ని మంత్రి డీకే అరుణ అధికారికంగా విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అ యితే కరువు మండలాలుగా ప్రకటించడంతోటే సరిపెడతారా...? లేక కరువు మ్యాన్యువల్‌ను అమలు చేస్తారా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కరువు ప్రాంతంగా జిల్లా పేరుగాంచింది. అతివృష్టి...అనావృష్టితో కొన్ని సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు                                                    

గత ఏడాది ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మొదట 57 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో... ఆ తర్వాత మిగిలిన ఆరు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించా రు. జిల్లాలో గత నాలుగేళ్లుగా వరుసగా కరువు కరాళనత్యం చే స్తూనే ఉంది. గత ఏడాది జిల్లాలోని మండలాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ... ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది కేవలం రూ.84 కోట్ల వడ్డీ మాఫీని ప్రకటించారు. అయితే నేటికీ కేవలం 50 శాతం వడ్డీమాఫీ మాత్రమే అమలయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటనష్ట పరిహారానికే దిక్కులేదు ..? గత ఏడాది 8,14,077 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు... పంట కోత సమయంలో జల్ తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 202 రెవెన్యూగ్రామాల పరిధిలో 2.53లక్షల హెక్టార్ల సాగులో 1,05,648 మంది రైతులకు రూ.127.93 కోట్ల పంటల బీమాను అందించారు. ఇందులో 50వేల మందికిపైగా రైతులకు ప్రీమియం కంటే తక్కువగానే పరిహారం అందింది. మిగిలిన 758 రెవెన్యూ గ్రామాల్లో 5.61 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసిన 5.02 లక్షల మంది రైతులకు బీమా అందలేదు. పంట నష్టపోయిన రైతులకు రూ.255 కోట్లకుపైగా పంటనష్ట పరిహారం మంజూరు చేస్తామని జిల్లాకు చెందిన మంత్రులు ,ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. ఆ దిశగా పంట నష్ట పరిహారం అందించడంలో విఫలమయ్యారు

Saturday, 29 October 2011

తాగునీటి కష్టాలు పెరగనున్నాయి

అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. గతేడాదితో పోలిస్తే గ్రౌండ్‌వాటర్ లెవల్స్ నాలుగు మీటర్ల మైనస్‌కు పడిపోయాయి. భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతలో భూగర్భ జలనిధి కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం.^నీటి మట్టం పెంచేందుకు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో సాగు, తాగునీటి కష్టాలు పెరగనున్నాయి.

అలాగే నీటిలో ఫ్లోరైడ్ శాతంపెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. భూగర్భ జలవనరుల శాఖ^సేకరించిన గణాంకాల మేరకు 15.53 మటరల్ లోతుకు జలాలు పడిపోయాయి. నీటిమట్టం పడిపోవడంతో బోర్లకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులకు అదనపు కరెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షపునీటిని నిల్వ చేయడం, చెరువులు, చెక్‌డ్యామ్‌లను సంరంక్షించడంలో అధికారుల విఫలం కావడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది.

ఇసుక అక్రమ రవాణా కూడా నీటి నిల్వలు పడిపోవడానికి కారణం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు యుద్ద ప్రాతిపదికన వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. చెరువులు, కుంటలను రక్షించకుంటే భవిష్యత్ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంది

Monday, 24 October 2011

చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు సిపిఐ

                                 
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాలపై ఆధారాలు ఉంటే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం అనంతపురం జిల్లాలో అన్నారు. ఆయనపై ఆధారాలు ఉంటే కాంగ్రెసు ప్రభుత్వం విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గత సాధారణ ఎన్నికల్లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గతంలో చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు. బాబు అవినీతిపై విచారణ జరిపితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అక్రమాలు ఎవరు చేశారని తెలిసినా విచారణ జరపాల్సిందేనన్నారు

Sunday, 23 October 2011

అనంత క్రీడా గ్రామంలో 57వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హాకీ పోటీలు

కృషితో రాణించాలని కలెక్టర్ దుర్గాదాస్ పిలుపునిచ్చారు. శనివారం అనంత క్రీడా గ్రామంలో 57వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హాకీ పోటీలు ఘనంగా ప్రా రంభమ య్యాయి. ముఖ్య అతిథుగా కలెక్టర్‌తో పాటు, ఏజేసీ చెన్నకేశవరావు, డీఎస్‌డీఓ సీఎల్‌న్‌రెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చాలన్నారు

Friday, 21 October 2011

కిరణ్ అనంత పర్యటన జెసి దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు

 అనంతపురం సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు డుమ్మా కొట్టారు. కిరణ్ శుక్రవారం ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయారు. జిల్లా మంత్రి రఘువీరా రెడ్డితో సహా మిగిలిన నేతలతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇటీవల పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రజారాజ్యం పార్టీ జిల్లా విలీన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. అయితే ఆయన వర్గం నేతలు మాత్రం హాజరై హంగామా చేస్తారు!

కిరణ్ అనంత పర్యటన, తన గైర్హాజరీపై హైదరాబాదులో ఉన్న ఆయనను మీడియా కదిలించగా తాను కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని, ఆప్తుడిని అయినందు వల్లే పర్యటనలో పాల్గొనలేదని చెప్పారు. తనకు హైదరాబాదులో వేరే కార్యక్రమం ఉన్నందున సమయం చిక్కలేదని చెప్పారు. కాగా కిరణ్ మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్నప్పటికీ జెసికి చోటు దక్కక పోవడం గమనార్హం

రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు

                         
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా నష్టపోయింది తెలంగాణ వాళ్లే.. రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కోదండరాం రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి' అని మంత్రి శైలజానాథ్ పేర్కొ న్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి కేసీఆర్ వర్గానికి చెందిన కొందరికి పోలవరం ప్రా జెక్టు పనులు ఇచ్చారనే ఆరోపణలపై మంత్రిని విలేఖరులు ప్రశ్నించగా అదంతా సోనియమ్మ చూసుకుంటారని బదులిచ్చారు. కేసీఆర్, కోదండరాం లాంటి వాళ్లు సొంత లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టి శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. రైల్‌రోకోలు.. బస్సుల బంద్ లాంటివాటిని సకల జనుల సమ్మె పేరుతో నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు

Tuesday, 18 October 2011

గురుకులాలకు నాంది పలికిన ఘనత నందమూరిదే

రాష్ట్రంలో దారిద్య్రం, పేదరికంతో వెనుకబడిన కులాల వారి సంక్షేమం కోసం గురుకులాల వ్యవస్థకు నాంది పలికిన ఘనత నందమూరి తారక రామారావుదేనని ఆర్డీటి విద్యాశాఖ డైరెక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కాళసముద్రంలో రాయలసీమ స్థాయి జోనల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా తిప్పేస్వామి మాట్లాడుతూ రామారావ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టి లక్షలాది మందికి క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేశారన్నారు. ఆయన కృషి ఫలితమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఉపాధి, విద్యావకాశాలు పెరిగాయన్నారు. గెలుపు ఓటములు అనేవి పక్కన పెట్టి క్రీడా స్పూర్తితో వ్యవహరించి ముందుకెళ్లాలన్నారు. ప్రిన్సిపల్ గిరిజా కుమారి అద్యక్షతన జరిగిన సభలో ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ సంస్థ అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత రమేష్, కణేకల్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, సీనియర్ అధ్యాపకులు శ్రీనివాస్ చౌదరి, ఆదినారాయణ, పిడిలు జనార్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు. రాయలసీమ స్థాయి గురుకుల జోనల్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత వైఎస్ రమేష్, కణేకల్ ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. నాలుగవ జోని విభాగం కింద ప్రారంభమైన పోటీలకు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతజిల్లాలకు చెందిన 16 సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలకు చెందిన 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు

Sunday, 16 October 2011

వాటర్ షెడ్లలో అనంతపురం 1st

వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.

గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల

                                          
పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల (మినీ డెయిరీ యూనిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర మిల్క్ మిషన్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజూ 3కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, దీనిని 5 కోట్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

రాబోయే ఐదేళ్లలో పాడి పశువులు, దూడల పెంపకం, వట్టిపోయిన పశువుల పోషణ, పాలశీతల కేంద్రాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపట్టి గణనీయమైన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ‘రాష్ట్ర మిల్క్‌మిషన్’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సభ్యులందరికీ అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వర్క్‌షాపు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలోనూ సంచార పశు వైద్యశాలలను (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలు పితకడంతో పరిశుభ్రత ముఖ్యమన్నారు

అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది వాటర్‌షెడ్ల పథకంలో

 వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.
ఎస్సీ, ఎస్టీల భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను ఉపాధిహామీ ద్వారా సాగులోకి తీసుకురావాల్సిందిగా ఆ పథకం కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 47 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీల బీడు భూములు ఉన్నాయని డ్వామా పీడీ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 20 వేల ఎకరాలను ఈ ఏడాది సాగులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. బలహీన వర్గాలకు చెందిన 1,48,044.45 యూనిట్‌లలో రూ.532.96 కోట్లు వ్యయం చేసి ఉపాధి పనులు నిర్వహించారు

Friday, 14 October 2011

తిమ్మమ్మమర్రిమాను చరిత్ర

                                              
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ఒక చరిత్రగా నిలిచిపోయింది. మహాశివరాత్రి పండుగ వస్తూనే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ప్రాంత ప్రజలకు ఒక్కసారిగా తిమ్మమ్మమర్రిమాను చరిత్రను గుర్తు చేసుకుంటారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలంలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో కదిరి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న తిమ్మమ్మమర్రిమాను గూటిబైలు పరిసరాలలో మర్రిమాను 1100 ఊడలతో 6.20 ఎకరాలు విస్తరించి ఉన్నది. మద్రాసులో ఉన్న అడియార్‌ మర్రిచెట్టు, కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రిచెట్టుకన్నా తిమ్మమ్మమర్రిమాను పెద్దచెట్టుగా ప్రసిద్ధి చెందింది.

ఈ మర్రిచెట్టును తిమ్మమ్మమర్రిమానుగా గిన్నీస్‌బుక్క్‌ ఆఫ్‌ వరల్డ్‌లో తన స్థానం సుస్థిర పరుచుకుంది. ప్రస్తుతం ఈ మర్రిచెట్టుకు దాదాపు 562 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఆ ప్రాంత మంతా దైవసంభూతంగా పేరు ఉన్న పతీవ్రత తిమ్మమాంబ పేరు మీద తిమ్మమ్మమర్రిమానుగా ఈ మహావృక్షం ప్రసిద్ది గాంచినది. ఈ మహావృక్షం వెనుక ఆసక్తి గల కథ కూడా ఉన్నది. అనంతపురం జిల్లా, పెనుకొండ తాలుక, బుక్కపట్నం గ్రామంలో చెన్నక్క, వెంకటప్ప అనే దంపతులకు తిమ్మమాంబ జన్మించింది. ఈమెకు పెళ్ళి వయస్సు వస్తూనే నంబులపూలకుంట మండలానికి చెందిన గూటిబైలు గ్రామంలో నివాసం ఉన్న బాలవీరయ్యతో వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే ఆమె భర్తకు అంటువ్యాధి సోకి అనారోగ్యంతో క్షీణిచారు.

గ్రామంలో ఉన్న వారు వారిని చూసి అసహించుకుంటుంటే ఈ బాధను పడలేక గ్రామానికి ఒక కిలోమీటరు సమీపంలో తిమ్మమాంబ ఒక రాతి కోటను నిర్మించుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కోటలోకి తీసుకెళ్ళి ఆయనకు సేవలు చేసింది. అయినా అతను ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అప్పట్లో ఆమె తన భర్త మరణించడంతో తానుకూడా అతనితో పాటు సతీసహగమణం చేసుకోవాలని చితిపేర్చుకుంది, చితిలోపల పచ్చని మర్రికొమ్మతో పాటు, మామిడి తోరణాలు కట్టారు. గ్రామ స్తులు అందరు చూస్తుండగానే భర్తను చితిలో దహనం చేస్తున్న సమయంలో ఆమెకూడా చితిలోకి దూకి సతీసహగమణం చేసుకున్నది. తర్వాత కొంత కాలానికి ఆ చితి వద్ద మర్రికొమ్మ మొక్క చిగురించింది.

ఆ మొక్క నేడు ప్రపంచంలోకెల్లా పెద్ద వృక్ష్యంగా మారింది. నాటి నుంచి మర్రిమాను తిమ్మమ్మమర్రిమానుగా ప్రఖ్యాతి గాంచినది. వారి సమాధి వద్ద చిన్న గుడి నిర్మించారు. అందులో బాలవీరయ్య, తిమ్మమాంబ విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి. అప్పటి విగ్రహాలకు నేటి వరకు మహాశివరాత్రి పండుగ రాగానే మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్మించిన తిమ్మమాంబ సమాధిఘాట్‌, తిమ్మమాంబ, బాలవీరయ్యల విగ్రహాలు, వన్యప్రాణుల షెడ్‌, శివఘాట్‌, కళ్యాణమండపం, గెస్ట్‌ హౌస్‌, ఓబుళేసుని గుట్ట తదితర వంటివి అక్కడ సందర్శించదగ్గ విషయాలుగా నెలకొల్పారు. ఈ మహాశివరాత్రి పండుగ రాగానే కర్నాటక ప్రాంతం బెంగుళూరు, కోలార్‌, చెనై్న, చిత్తూరు, కడప, అనంతపురం వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

ప్రయాణికులకు మహాశివరాత్రి ఉత్సవాలకు గాను తిమ్మమ్మమర్రిమాను వద్దకు కదిరి డిపో నుంచి స్పెషల్‌ సర్వీసులు బస్సులు కూడా నడుపుతున్నారు. అయితే అక్కడ పర్యాటకులకు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మర్రిమాను వద్దకు వస్తున్న యాత్రికులు, పర్యాటకులకు అక్కడ బసచేయాలన్న గధులు లేక వచ్చిన వారు పూజలు నిర్వహించుకుని వెళ్లుతున్నారే తప్ప బసచేయడానికి కష్టంగా మారిందని పర్యాటకులు పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటకులకు స్నానం గదులు, లేక పోవడంతో వచ్చిన పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రయాణం చేసి వచ్చిన వారికి సకాలంలో తాగునీటి కుళాయిలు లేక పోవడంతో ఎక్కువ సమయం మర్రిమాను వద్ద గడపలేక పోతున్నారు