Monday, 14 November 2011

ముగిసిన అఖండ భజన

సత్యసాయిబాబా 86వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన అఖండభజన  ముగిసింది. ప్రతి ఏటా ప్రపంచశాంతిని కాంక్షిస్తూ అఖండ భజన నిర్వహించడం ప్రశాంతినిలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా   6గంటలకు జ్యోతిప్రజల్వనతో ప్రారంభమైన అఖండభజన 24 గంటల పాటు కొనసాగి ఆదివారం సాయంత్రం మంగళహారతితో ముగిసింది. అఖండ భజనను పురస్కరించుకొని వేదపారాయణంతో పాటు రుద్రహోమాలు నిర్వహించారు. 24 గంటల పాటు కొనసాగిన ఈ అఖండ భజన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులతో పాటు విద్యార్థులు పాల్గొని భక్తిగేయాలను ఆలపించారు. మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.అయితే సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన అఖండభజనల్లో వేలాదిమంది భక్తులు పాల్గొనడంతో ప్రశాంతినిలయం నూతనశోభను సంతరించుకుంది. గత కొంతకాలంగా నిర్లిప్తతగా వున్న పట్టణ ప్రజల్లో కూడ అఖండభజనకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసి నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఇప్పటిదాకా పుట్టపర్తి భవిష్యత్తుపై సందేహం వ్యక్తం చేస్తున్న వ్యాపారవర్గాల్లో కూడా అఖండభజన కార్యక్రమాలను తిలకించిన పిదప వారిలో ధీమావ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు కార్యదర్శి ప్రసాద్‌రావు, ట్రస్టుసభ్యులు రత్నాకర్, ఎస్‌విగిరి, నాగానంద, వైస్‌చాన్స్‌లర్ శశిధర్‌ప్రసాద్,రిజిస్ట్రార్ నరేన్‌రాంజీ, ప్రిన్సిపాల్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment