Friday, 4 November 2011

నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం

పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే నిమిత్తం ఆర్టీసీ యాజమాన్యం తెల్లరేషన్ కార్డుదారులకు 100 రూపాయలకే వనితా కార్డు పేరిట క్యాట్ కార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కార్డు ద్వారా కుటుంబంలోని మొత్తం సభ్యులందరికీ 10 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. ప్రజలకెంతో ఉపయోగకరంగా వుండటంతో పాటు ఆర్టీసీకి కూడా వనితా క్యాట్ కార్డు ఎంతో లాభదాయకంగా ఉంది. కానీ ఇటీవల కొంత మంది అసలైన వనితా కార్డులను కలర్ జిరాక్స్ చేసి ప్రయాణికులకు అమ్మారు. నకిలీ వనితా కార్డులపైన కడప డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతకం కూడా చేసినట్లుంది
                                                                    .
ఫలితంగా నకిలీ కార్డుల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుంది. ముందుగా కార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన డిపో అసిస్టెంట్ మేనేజర్లు తమ విధులను సక్రమంగా చేయకపోవడం వల్లే నకిలీ వనితా కార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ వనితా కార్డుల అవినీతిలో డిపో అసిస్టెంట్ మేనేజర్లకు భాగస్వామ్యం ఉంటుందనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. వనితా క్యాట్ కార్డులోని ఫొటోలను, కార్డులపై ఆర్టీసీ అధికారులు పెట్టిన సంతకాలు, వేసిన సీలును మాత్రమే కండక్టర్ పరిశీలిస్తారు. అంతేగాని డ్యూటీలో ఉన్న కండక్టర్ ఆ కార్డు ఒరిజినల్, లేక నకిలీ అని పరిశీలించే పరిస్థితి ఉండదు. కొంతమంది అవినీతి సీఐలు చేసిన మోసాల తప్పిదాలకు కండక్టర్లపై అక్రమ కేసులు బనాయించి బాధ్యులను చేస్తున్నారు

తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు

                                        
తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు. కండలేరు నుంచి తిరుపతికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెస్తానన్నారు. తిరుపతిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జంగాలపల్లి శ్రీనివాసులు కుమారుడు మదనమోహన్, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కుమార్తె మాధురి వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం న్యూ ఇందిరా నగర్, బా లాజీ కాలనీ, ఉప్పంగి దళితవాడ, అయ్యప్ప కాలనీ, చింతలచేనుల్లో రూ.1.8కోట్లతో చేపట్టే డ్రైన్లు, సీసీ రోడ్లు, పాఠశాల భవనానికి ఆయన భూమిపూజ చేశారు. వివిధ ప్రాం తాల్లో మాట్లాడారు. అందరిలా తాను హామీలిచ్చి మరచిపోయే వాడిని కాదని, మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు. నగరంలో కాలువలు, రోడ్ల నిర్మాణానికి ప్రా ధాన్యమిస్తామన్నారు.
అయ్యప్ప కాలనీలో తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు, మహిళల కు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే 330 బోర్లను మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ టిప్పర్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తవర్వలను జారీ చేసినట్లు కమిషనర్ ప్రసాద్ తెలిపారు. చింతలచేను చౌకదుకాణంలో కిలో రూపాయి బియ్యం పథకాన్ని చిరంజీవి ప్రారంభించారు

చంద్రబాబునాయుడుకు తిరుపతిలడ్డూను అందజేశారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తిరుపతి తెలుగుదేశంనాయకులు తిరుపతిలడ్డూను అందజేశారు. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా రైతులకు అండగా టీడీపీ అధినేతచంద్రబాబునాయుడు పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ తిరుపతికి చెందిన తెలుగుదేశంపార్టీ బృందం వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందజేశారు. చంద్రబాబునాయుడు బుధవారం ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం సీసీ.కొత్తకోట నుంచి రైతన్నలకు ఆత్మస్థైర్యం కల్పించడంలో భాగంగా 20 కి.మీ పాదయాత్ర చేపట్టారు

Thursday, 3 November 2011

2296 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసుల్లో 2296 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది

మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను- చిరంజీవి

పార్టీ అధిష్టానం తనకు ఏ పదవి ఎక్కడ ఇచ్చినా స్వీకరిస్తానని తిరుపతి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
తిరుపతిలో రూ.20 కోట్లతో శాశ్వతంగా తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చిరంజీవి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తమ సమస్యలను ఆయనకు విన్నవించుకుందామని వస్తే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు

రామ్ చరణ్‌ బాలకృష్ణ వార్

శ్రీరామరాజ్యం ఆడియో కార్యక్రమంలో తాను రామ్ చరణ్‌ను ఉద్దేశించి అనలేదని వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ విరవరణ ఇచ్చారు. తాను చిరింజీవి అన్యోన్యంగా ఉంటామని, తాను ఎవరి గురించి వ్యాఖ్యానించానో చిరంజీవి, మోహబాబులకు తెలుసునని బాలకృష్ణ తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే తట్టుకోలేనని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై తెలంగాణ వ్యతిరేక ముద్రవేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తపరిచారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తానని బాలకృష్ణ చెప్పారు.

Wednesday, 2 November 2011

అనంతపురం జిల్లా లో చంద్రబాబు పాదయాత్ర

                                                          
ని త్యం కరువుతో సతమతమవుతున్న రై తులకు అండగా టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్రకు శ్రీ కారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరు వు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు తలపెట్టిన ఈ పాదయాత్రకు అనంతపురం జిల్లానుంచి బుధవారం ప్రారం భం కానుంది. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంత రైతులకు బా సటగా ఈ యాత్ర సాగనుందని టీడీ పీ శ్రేణులు వెల్లడించాయి. అనంతపు రం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని సీసీ కొత్తకోట గ్రామం నుంచి( ధర్మవరం- పుట్టపర్తి రహదారిపై) చంద్రబాబు పాదయాత్ర సాగుతుం ద ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కా ల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీ కే పార్థసార«థి తెలిపారు.


సీసీకొత్తకోట గ్రామం నుంచి మొదలయ్యే చంద్రబాబు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని బసంపల్లి, కనముక్కల, వె ల్దుర్తి, ఆముదాలకుంట క్రాస్, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొడపగానిపల్లి, మైలేపల్లి, కొత్తచెరువు వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కరువు అనగానే గుర్తుకు వచ్చే అనంతపురం జి ల్లానుంచి ఈ యాత్రకు శ్రీకారం చు ట్టాలని టీడీపీ శ్రేణులు భావించాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధం గా ఆరు సంవత్సరాలు వరుస కరువులు వచ్చాయని, దీంతో వ్యవసా యం చేయడం అలా ఉంచితే బతుకే భారమైన పరిస్థితి రైతాంగంలో నెలకొంది.

దీంతో రైతులకు అండగా ని లిచి వారి కష్టాలు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రై తు సమస్యలపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకు ని టీడీపీ నేతలు జనసమీకరణలో ము నిగిపోయారు. చంద్రబాబు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లులో టీ డీపీ నేతలు తలమునకలయ్యారు