Showing posts with label ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts
Showing posts with label ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts

Saturday, 11 February 2012

చంద్రబాబు పై సెటైర్లు... ఎమ్మెల్యే చిరంజీవి

బైక్‌రైస్ చేసినంత మాత్రాన యువత వారి వెంట వెళ్లరని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే చిరంజీవి పరోక్ష విమర్శలు చేశారు.చంద్రబాబు బైక్ ర్యాలీలపై ఆయన విసుర్లు విసిరారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పేర్లు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలు చేశారు. బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన యువకులు విశ్వసించబోరని, వారికి ఏమైనా చేస్తేనే వారు విశ్వసిస్తారని ఆయన అన్నారు.  గుంటూరులో 2009లో యువగర్జన సదస్సు నిర్వహించారని, యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, అలా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పుడు 40 శాతం సీట్లు యవతకు ఇస్తామంటున్నారని, అంత మాత్రాన యువత నమ్మబోదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తనతో పాటు తన అభిమానులందరూ కాంగ్రెసు పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు.శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తన తో అనుబంధం ఉన్న అభిమానులందరూ నేడు కాంగ్రెస్ వైపు రావడం సంతోషకరంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.

Thursday, 5 January 2012

సంక్రాంతి తర్వాత మాకు పదవులు ఖాయం : చిరంజీవి

సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, అందులో తమ వారికి బెర్త్‌లు ఖాయమని కాంగ్రెస్ నేత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సినిమా చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా కథ నచ్చితే సినిమా చేస్తానని చిరు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి అనంతరం మీడియాతో పై విధంగా మాట్లాడారు.ఎట్టకేలకు చిరంజీవి నోరు విప్పడంతో రాష్ట్ర కేబినేట్‌లో పీఆర్పీకి చెందిన వారికి పదవులు వచ్చే విషయంపై కొనసాగుతున్న ఊహాగాలకు తెరపడింది. చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు భావించాలి.

Wednesday, 23 November 2011

తాను రక్తం అమ్ముకునే రకం కాదని:మెగాస్టార్ చిరంజీవి

 
తాను రక్తం అమ్ముకునే రకం కాదని కాంగ్రెసు శానససభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా రక్త దాన శిబిరాన్ని ఆనయ బుధవారం ప్రారంభించారు. తన బ్లడ్ బ్యాంకుపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. తన బ్లడ్ బ్యాంకులో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చేసిందని, తాను రక్తం అమ్ముకోవడం లేదని ఈ రోజు తేలిపోయిందని ఆయన అన్నారు. తన సొంత డబ్బులతో చిరంజీవి రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు తాను ఎవరి నుంచి కూడా విరాళాలు వసూలు చేయలేదని అన్నారు. ఇతర బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ ధరకే తమ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని ఇస్తోందని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. తాను బ్ల్డడ్ బ్యాంక్ నిర్వహణకు ఇతరుల నుంచి నయాపైసా తీసుకోలేదని చెప్పారు. తనకు నటన కన్నా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ముఖ్యమని ఆయన అన్నారు

Friday, 4 November 2011

తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు

                                        
తిరుపతి నగరంలో రూ.20 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే చిరంజీవి ప్రకటించారు. కండలేరు నుంచి తిరుపతికి తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెస్తానన్నారు. తిరుపతిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జంగాలపల్లి శ్రీనివాసులు కుమారుడు మదనమోహన్, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కుమార్తె మాధురి వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం న్యూ ఇందిరా నగర్, బా లాజీ కాలనీ, ఉప్పంగి దళితవాడ, అయ్యప్ప కాలనీ, చింతలచేనుల్లో రూ.1.8కోట్లతో చేపట్టే డ్రైన్లు, సీసీ రోడ్లు, పాఠశాల భవనానికి ఆయన భూమిపూజ చేశారు. వివిధ ప్రాం తాల్లో మాట్లాడారు. అందరిలా తాను హామీలిచ్చి మరచిపోయే వాడిని కాదని, మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు. నగరంలో కాలువలు, రోడ్ల నిర్మాణానికి ప్రా ధాన్యమిస్తామన్నారు.
అయ్యప్ప కాలనీలో తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు, మహిళల కు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే 330 బోర్లను మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కార్పొరేషన్ టిప్పర్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తవర్వలను జారీ చేసినట్లు కమిషనర్ ప్రసాద్ తెలిపారు. చింతలచేను చౌకదుకాణంలో కిలో రూపాయి బియ్యం పథకాన్ని చిరంజీవి ప్రారంభించారు