
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేది వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీయేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె
సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ను మరో రెండేళ్లు
అధికారంలో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానంపై
ఇతర ప్రతిపక్షాల మద్దతు కోరలేదన్నారు.రైతుల పేరు చెప్పి అవిశ్వాసం
పెట్టిన చంద్రబాబు సమస్యల గురించి చర్చించకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిని
తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని శోభా నాగిరెడ్డి
వ్యాఖ్యానించారు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేయకుండా
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment