Thursday, 22 December 2011

ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండదు...జెసి దివాకర్ రెడ్డి స్పష్టీకరణ

మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండబోదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండవచ్చునని ఆ పార్టీ శానససభ్యుడు శ్రీధర్ కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. తెలిసో తెలియకో కొంత మంది ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సందర్భాన్ని బట్టి చిరంజీవి వర్గానికి పదవులు ఉంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బట్టే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో జిల్లా మంత్రులే ప్రచారం చేయాలని, ఇతర మంత్రులు ప్రచారం చేయడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దాదాపు 26 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. ఇది మినీ సాధారణ ఎన్నికలను తలపించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment