తిరుమల శ్రీవేంకటేశ్వరునికి రెండు వేల సంవత్సరాల తర్వాత ఓ బంగారు కత్తిని
బహుకరించారు. పీఠాధిపతి త్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ శ్రీవారికి
యజ్ఞాయాగాదులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కానుకలతో
స్వామివారికి సూర్య ఖఠారిని బహుకరించారు. తిరుమల శ్రీవారికి బీమవరం
మఠాధిపతి శ్రీత్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి 75 లక్షలు విలువ చేసే
బంగారు కత్తిని బహుకరించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ కటాక్షయజ్ఞం నిర్వహించగా
వచ్చిన కానుకలతో శ్రీవేంకటేశ్వరునికి బంగారు కత్తిని తయారు చేయించి
ఇచ్చారు. నిన్న రాత్రి ఆలయంలో తోమలసేవ కార్యక్రమంలో స్వామి వారి పాదాల
ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి బహుకరించిన కత్తికి
ప్రత్యేక పూజలు చేసారు. అటు తర్వాత భక్తులు, టీటీడీ చైర్మెన్ బాపిరాజు,
పూజారులు పూజలందుకున్నారు. స్వామి వారికి బహుకరించిన కత్తిని చూసేందుకు
భక్తులు పోటీ పడ్డారు. వచ్చే శుక్రవారం జరిగే అభిషేకం అనంతరం శ్రీవారికి అలంకరించాలని టీటీడీ
అధికారులను పీఠాధిపతి కోరారు. ఆయన వినతిని టీటీడీ అధికారులు అంగీకరించారు.
వాయిస్. రెండు వేల సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్నకు మొదటి సారిగా అప్పటి
రాజులు బహుకరించారు. తిరిగి స్వామి వారికి సూర్య కఠారిని బహుకరించడంతో
ప్రాధాన్యత సంతరించుకుంది.
No comments:
Post a Comment