Friday, 6 January 2012
శ్రీ రామ రాజ్యం యాభై రోజులు వేడుకలో...సిఎం బాలయ్య అంటూ నినాదాలు
డీఎస్సీ అభ్యర్థులకు రాలయసీమ జిల్లాలకు అన్యాయమే
డీఎస్సీ-12లో
జిల్లాకు అతి తక్కువ పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష
నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు,డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాకు
దాదాపు 500 నుంచి 600 వరకు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాల్సి ఉండగా,
కేవలం 97 మాత్రమే మంజూరు చేశారని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను
సంప్రదించకుండా ప్రభుత్వం తక్కువ పోస్టులను కేటాయించడాన్ని ఉపాధ్యాయ
సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పస్తుత డీఎస్సీలో అనంతపురం జిల్లాకు
గణితం-77, భౌతికశాస్త్రం-52, సామాన్యశాస్త్రం-17, ఆంగ్లం-30,
సాంఘికశాస్త్రం-66, కర్నూలు జిల్లాకు గణితం-69,
భౌతికశాస్త్రం-115,సామాన్యశాస్త్రం-58, ఆంగ్లం-82, సాంఘికశాస్త్రం-84,
చిత్తూరుకు గణితం- 94, భౌతికశాస్త్రం-105, సామాన్యశాస్త్రం-18, ఆంగ్లం-68,
సాంఘికశాస్త్రం-85 కేటాయించారు. వైఎస్సార్ జిల్లాకు కేటాయించిన 97
పోస్టుల్లో గణితం-21, భౌతికశాస్త్రం-32, సామాన్యశాస్త్రం-2, ఆంగ్లం-20,
సాంఘికశాస్త్రం-14 ఉండగా, మిగిలినవి భాషకు సంబంధించినవి. ఈ 97 పోస్టుల్లో
కూడా 70 శాతం ప్రమోషన్లు ఇస్తారు. గత నుంచీ అన్యాయమే గత
డీఎస్సీల నుంచి కూడా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు
ఉద్యమాలు చేస్తేనే మరికొన్ని పోస్టులను కలుపుతున్నారు. 1994 డీఎస్సీలో
అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ రంగారావు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కడపకు
182 పోస్టులు మంజూరు చేశారు. దీన్ని నిరసిస్తూఉద్యమిస్తే అదనంగా 417 ఖాళీలు
చూపించారు. డీఎస్సీ-94 రాసిన అభ్యర్థులకు 1997జనవరి 12న అప్పటి కలెక్టర్
బిఆర్ మీనా 198 మందికి పోస్టులిచ్చారు. డీఎస్సీ-2008లో కూడా దాదాపు 596
పోస్టులు ఇచ్చారు. ఇవి తక్కువని పోరాటాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డి దాదాపు 90 పోస్టులు పెంచారు. దీంతో ఎస్జీటీ పోస్టులు 646కు
పెరిగాయి. వీరిలో ఇంకా 52మందికి ఉద్యాగాలివ్వాల్సి ఉంది. వీరికి హామీ
పత్రాలు కూడా ఇచ్చారు.
ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదు..టెట్ డైరెక్టర్
ఈ నెల 8వ తేదీ ఆదివారం నుంచి జరిగే టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు
హాజరయ్యే అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదని టెట్
డైరెక్టర్ శేషుకుమారి చెప్పారు. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా
2100 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా చేపట్టాలని
అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్ చెన్నకేశవరావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూభవన్‌లో టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్‌లు,
డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు జాయింట్ కలెక్టర్
మాట్లాడుతూ టెట్‌కు విద్యాశాఖ తప్ప ఇతర శాఖల అధికారులను నియమించాలని
ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొరపాట్లకు తావీయకుండా పరీక్షలు
నిర్వహించాలన్నారు. పరీక్షల కోసం ఇచ్చే ప్యాకేజ్ మెటిరీయల్స్‌ను అధికారులు
సరిచూసుకోవాలని అన్నారు. ఏడో తేదీనే మెటీరియల్ మొత్తం అందిందా,
సెంటర్ లో ఫర్నీచర్స్, తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా
చూసుకోవాలన్నారు. ఏమైనా లేకపోతే రూట్ అధికారులకు, డీఈఓకు ఫిర్యాదు
చేయాలన్నారు పేపర్1 కంటే పేపర్2కు ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవుతున్నారని
పేర్కొన్నారు. 1 నుంచి 16 సెంటర్ల అధికారులు ఉదయాన్నే రావాలని, మిగిలిన 89
సెంటర్స్ అధికారులకు మధ్యాహ్నం ఉంటుందని తెలిపారు పోలీస్‌బందోబస్తు కోసం
పోలీసుఅధికారులకు లేఖ రాయాలని డీఈఓ ప్రేమానందంను ఆదేశించారు. బుక్‌లెట్లు
పరీక్షా సమయానికి గంటముందే కేంద్రానికి అందుతాయని, వాటిని మొత్తం ప్రత్యేక
సూపరింటెండెంట్స్ సమక్షంలో తెరవాలని సూచించారు. ఎవరి బాధ్యతలను వారు
నిర్వర్తించి టెట్ పరీక్షలను విజయవంతం చేయాలని కోరారు.ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు డీఎడ్ అభ్యర్థులకు పేపర్-1, మధ్యాహ్నం 2.30
నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎడ్ అభ్యర్థులకు పేపర్-2 పరీక్షలను
నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.
ఆటగాళ్లందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి...కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
అనంతపురం జిల్లా కరువుతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి విముక్తి
Thursday, 5 January 2012
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఆఫర్ చేసిన ఓ అధికారి
ఒక్కసారే వైకుంఠ దర్శనం : మంత్రి టీ జీ వెంకటేష్
ముస్లింలు మక్కా మసీదుకు ఎలా వెళతారో.. ఆ విధంగా తిరుమల స్వామివారిని కూడా
ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్
సూచించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో
మాట్లాడారు.తాను మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల
వచ్చానన్నారు. తాను క్యూలైన్లో వెళ్లేటప్పుడు చాలామంది భక్తులు పలుసార్లు
వచ్చామని చెప్పారన్నారు. అందుకని భక్తులు తమ జీవితంలో ఒకసారి మాత్రమే
వైకుంఠ ఏకాదశికి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి
చేశారు. ఇక భక్తులు త్వరితగతిన ఆలయం వెలుపలకు వచ్చేలా గర్భగుడి
తప్ప మిగిలిన ప్రాంతాల్లోని క్యూలైన్లను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో
ఏర్పాటు చేయాలన్నారు. మఠ, పీఠాధిపతుల సలహాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తెలా
ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన క్యూలైను
ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులను మంత్రి కోరారు.
Subscribe to:
Posts (Atom)