Showing posts with label నందమూరి బాలకృష్ణ. Show all posts
Showing posts with label నందమూరి బాలకృష్ణ. Show all posts

Friday, 24 February 2012

భద్రాద్రి రాముని పాత్ర అవకాశం వస్తే తప్పక నటిస్తా బాలకృష్ణ

ప్రేక్షకులు కొత్తదనంను కోరుకుంటున్నారు, అందుకు నిదర్శనం శ్రీరామరాజ్యం విజయమేనని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీరామరాజ్యం సినిమా వంద రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించేందుకు ఆయన చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా వచ్చారు.ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం నందమూరి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీరామరాజ్యం ఆడియో వేడుక భద్రాద్రిలోనే నిర్వహించామని, తిరిగి శతదినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి రావడం జరిగిందన్నారు. మంచి చిత్రాలను ప్రజలు ఆదరిస్తారరనడానికి ఈ చిత్ర వజయమే నిదర్శనమన్నారు. ఇందుకు సహకరించిన చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు, సహచర కళాకారులు, సాంతికేక సిబ్బంది, మీడియాకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Friday, 10 February 2012

బాలకృష్ణ హీరోగా ‘శ్రీమన్నారాయణ’

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను మీరోయిన్లుగా ఎంపిక చేశారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు అంటున్నారు దర్శకులు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'టైటిల్ ప్రకటన సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ..కథ వినగానే బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారు.ఈ సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌ని ఎంతో కష్టపడి డీల్ చేశాం. బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం అందించారు అన్నారు. బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయకుడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతోంది.

Thursday, 26 January 2012

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ...నందమూరి బాలకృష్ణ

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు.తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.

Monday, 23 January 2012

నా రెండో రూపం వారికి తెలియదు...బాలకృష్ణ


చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ధ్వజమెత్తారు. తనను ఒకరు బాలుడన్నారని, తమను ఒకవైపే చూశారని, తమ రెండో రూపం వారికి తెలియదని బాలకృష్ణ హెచ్చరించారు. అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని, సీఎం కుర్చీనే వారి జీవిత లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. పార్టీని అమ్ముకున్న వారికి నాన్నగారితో పోలికా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండోరోజైన సోమవారం పర్యటిస్తున్న బాలయ్య పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పార్టీని అమ్ముకున్న వాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ ధ్వజమెత్తారు. నాన్నగారి ఆశయాలే తమను రాజకీయాలకి ఆహ్వానించాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాధనాన్ని కుటుంబానికి దోచిపెట్టిన వారి విగ్రహాలు చూడాల్సివస్తోందని, స్వప్రయోజనాల కోసం కొందరు విగ్రహాలను రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరని అన్నారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్సందించను: చిరంజీవి

 బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు.సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించనని స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. చిత్తశుద్ధితో సేవచేసినంతకాలం ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. తనపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు ఏమీలేవని చెప్పారు. విభేదాలు అన్ని మీడియా కథనాలేనన్నారు.
నీచ రాజకీయాలకు బలి కావద్దు...లక్ష్మీపార్వతి
 
నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు.

Sunday, 22 January 2012

టిడిపి పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేస్తా...బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే .. చిరంజీవిపై పోటి చేయడానికి సిద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణ పాడేరులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా అంతకుముందు తాను ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఆయన విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏ ప్రాంతమైనా తనకు ఫర్వాలేదన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలయ్య పక్షం రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుండి పలుమార్లు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా కాకుండా అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని ఆయన అభిమానులు, టిడిపి క్యాడర్ చెబుతోంది.

Saturday, 7 January 2012

త్వరలో రాజకీయాలలోకి వస్తా:బాలకృష్ణ

తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై పార్టీ వైఖరే తన వైఖరి అని ఆయన తెలిపారు.కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు.అధిష్టానం ఆదేశిస్తే ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేస్తానని అన్నారు. ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరే తమ వైఖరని బాలకృష్ణ తెలిపారు. తమ కుమారుడు మోక్షజ్ఞ మరో నాలుగేళ్ళ తర్వాత సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Friday, 6 January 2012

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు వేడుకలో...సిఎం బాలయ్య అంటూ నినాదాలు

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన అర్ధశత దినోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ మాట్లాడటానికి వస్తుండగా అభిమానులు ఒక్కసారిగా కాబోయే సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. శ్రీ రామ రాజ్యం అర్ధ శతదినోత్సవ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ... లవకుశ, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు యుగానికి ఒక్కసారే వస్తాయని, రికార్డులు కొట్టేశాం అని జబ్బలు చరుచుకునే వారు ఒక్కసారి ఆలోచించాలని, ఒక సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందనేది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నదన్నదే ముఖ్యమన్నారు.నయనతారను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా ద్వారా నయనతార నటించవద్దని నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నానని, దానిని వెనక్కి తీసుకోవాలని దాసరి సూచించారు. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ముందుకెళుతున్నారని ఆయనకు నీలాంటి నటి కావాలన్నారు. సావిత్రి, జయసుధ, జమున వంటి మహానటీమణులు పెళ్లైన తర్వాత కూడా అద్బుతమైన పాత్రలు వేసి మెప్పించారన్నారు.

Wednesday, 30 November 2011

‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణకి బామ్మగా జయసుధ

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అధినాయకుడు’ ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మీరాయ్, ఛార్మీ, సలోని హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బాలకృష్ణ నటిస్తున్న ఓల్డ్ గెటప్ కు జోడీగా సహజనటి జయసుధ నటిస్తోంది. ఈ చిత్రంలో జయసుధ బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు. బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది. చాలా కాలం క్రితం ద్విపాత్రాభినయంతో అలరించిన బాలకృష్ణ ‘అధినాయకుడు’గా ఏకంగా మూడు పాత్రల్లో కనువిందు చేయబోతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచానాలు ఏర్పడ్డాయి. విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన మూడు పాత్రల్లో రెండింటిని రివీల్ చేసిన చిత్రవర్గాలు మూడవ గెటప్ ని చాలా రోజులు గా సీక్రెట్ గా వుంచుతూ వస్తోంది.

Tuesday, 15 November 2011

శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్

నందమూరి బాలకృష్ణకు యుఎస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉందని మరోసారి రుజువైంది.తాజాగా ఆయన చిత్రం శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్ కు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది.కొల్లా అశోక్ బాబు అనే అభిమాని ఆ టిక్కెట్ ని పొంది తన అభిమానాన్ని చాటుకున్నారు.ఇక చిత్రం నవంబర్ 17న విడుదల అవుతుండగా ఈ ప్రీమియర్ షో మాత్రం నవంబర్ 16 న జరుగుతుంది.ఈ విషయాన్ని బ్లూ స్కై సినిమా వారు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియచేసారు.సింహా తర్వాత పుంజుకున్న బాలకృష్ణ ఈ చిత్రంతో మరోసారి ఘన విజయం సాధిస్తాడని అందరూ అంచనాలు వేస్తున్నారు.బాలకృష్ణ శ్రీరాముడిగా,నయనతార సీతగా నటించిన చిత్రం 'శ్రీరామ రాజ్యం. బాపు దర్శకత్వంలో సాయి బాబా మూవీస్‌ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 17న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు