Sunday, 1 January 2012
2014 ఎన్నికలలోపు జగన్ తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదు..జెసి దివాకర్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి రెండేళ్లు పెంపు
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక
ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు
పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం,
ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి
పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం
కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం
తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు
చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.
Friday, 30 December 2011
సౌత్ టాప్ హీరో సర్వేలో జూ ఎన్టీఆర్
ప్రముఖ తమిళ పత్రిక కండక్టు చేసిన సర్వే ప్రకారం సౌత్ టాప్ హీరోల లిస్ట్
అంటూ ఓ లిస్ట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆన్ లైన్ సర్వే చేసి
ప్రకటించామంటున్న వారి లెక్కలు ప్రకారం...

1.రజనీకాంత్ --95%
2.జూ.ఎన్టీఆర్ --85%
3.చిరంజీవి---82%
4.అజిత్--76%
5.విజయ్---74%
6.పవన్ కళ్యాణ్-72%
7.మోహన్ లాల్--63%
8.సూర్య--63%
9.మహేష్ బాబు--57%
10.ప్రభాస్--56%
అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.
1.రజనీకాంత్ --95%
2.జూ.ఎన్టీఆర్ --85%
3.చిరంజీవి---82%
4.అజిత్--76%
5.విజయ్---74%
6.పవన్ కళ్యాణ్-72%
7.మోహన్ లాల్--63%
8.సూర్య--63%
9.మహేష్ బాబు--57%
10.ప్రభాస్--56%
అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.
అక్కినేని అన్నపూర్ణమ్మ నాకు తల్లిలాంటివారు... బాలకృష్ణ
ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ నిన్న కన్నుమూశారు.
తెలుగు పరిశ్రమ మొత్తం చూసి వచ్చి సంతాపం ప్రకటించారు. వారిలో...బాలకృష్ణ
మాట్లాడుతూ..‘‘నాకు తల్లిలాంటివారు. నాకెంతో ఇష్టమైనవారు. నేనీ మధ్య
‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో రాముని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో
వాల్మీకిగా నటించాలని నాగేశ్వరరావుగారిని అడిగితే... అన్నపూర్ణగారు చాలా
ప్రోత్సహించారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నాను’’అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ
మాట్లాడుతూ..‘‘నాగేశ్వరరావుగారికి ఇది నిజంగా పూడ్చలేని లోటు. నా సినీ
కెరీర్ మొదలైన నాటినుంచి అక్కినేని కుటుంబంతో నాకు అనుబంధం ఉంది.
ఇంటికెళ్లినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారామె. అన్నపూర్ణమ్మగారి
మరణం అక్కినేని కుటుంబానికే కాదు... చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఈ బాధ
నుంచి నాగేశ్వరరావుగారు త్వరగా బయటపడాలని ఆ దేవుడ్ని
వేడుకుంటున్నాను’’అన్నారు ఇక ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు
మాట్లాడుతూ...‘‘అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆదిదంపతులు.
అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెడుతుంటే శివపార్వతుల విగ్రహం కనిపి స్తుంది.
ఆ విగ్రహం చూడగానే నాకు ఈ ఇద్దరే గుర్తొస్తారు. అన్నపూర్ణ స్టూడియో
పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కళ్యాణి’కి నేను దర్శ కత్వం వహించాను. ఆ
తర్వాత బుచ్చిబాబు, ప్రేమాభిషేకం, యువ రాజుతో కలిపి ఆరు సినిమాలు ఈ సంస్థలో
చేశాను. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ షూటింగ్‌కి వచ్చేవారు కాదు. కానీ షూటింగ్
పూర్తయ్యే సమయానికి ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చేవారు. ఆ రకంగా
‘అన్నపూర్ణ’ అనిపించుకున్నారు’’ అన్నారు. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ..‘‘ఆ
మహాతల్లి మరణవార్త ఓ ‘షాక్’లా నా మనసంతా కదిలించి వేసింది. ఆ కుటుంబంతో నా
అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ‘కురుక్షేత్రం’లో నా డైలాగులు ఎంతో
నచ్చాయని, ఎన్టీఆర్ తర్వాత అలా డైలాగ్స్ నేను మాత్రమే చెప్పగలనని ఆమె నా
గురించి అన్న మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఆ స్త్రీమూర్తికివే నా
కన్నీటి వీడ్కోలు’’ అన్నారు.
యమదొంగ,సింహాద్రి తరహాలో...ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో
ముఖ్యంగా చెప్పుకోదగినవి..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్
లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో
ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో
పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి
ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్
సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు
చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై
నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని
చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి
తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు
బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి
శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో
మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్
హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం
ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని
చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక
నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా
కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా
రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని
సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.
న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు
Subscribe to:
Posts (Atom)