Showing posts with label ఎన్టీఆర్. Show all posts
Showing posts with label ఎన్టీఆర్. Show all posts

Saturday, 25 February 2012

జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘బాద్ షా’ 12 కోట్ల ఆఫర్ !

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు ‘బాద్ షా’ అనే టైటిల్ ఖారారు చేశారు. తాజాగా ఈచిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. మార్చి 18 పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నిర్మాత కెఎస్. రామారావు నిర్మించే చిత్రంలోనటిస్తున్నారని, ఈ సినిమాకు సదరు నిర్మాత జూ ఎన్టీఆర్‌కు రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆది, అదుర్స్ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన వివి వినాయక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

Friday, 30 December 2011

సౌత్ టాప్ హీరో సర్వేలో జూ ఎన్టీఆర్

ప్రముఖ తమిళ పత్రిక కండక్టు చేసిన సర్వే ప్రకారం సౌత్ టాప్ హీరోల లిస్ట్ అంటూ ఓ లిస్ట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆన్ లైన్ సర్వే చేసి ప్రకటించామంటున్న వారి లెక్కలు ప్రకారం...

1.రజనీకాంత్ --95%

2.జూ.ఎన్టీఆర్ --85%

3.చిరంజీవి---82%

4.అజిత్--76%

5.విజయ్---74%

6.పవన్ కళ్యాణ్-72%

7.మోహన్ లాల్--63%

8.సూర్య--63%

9.మహేష్ బాబు--57%

10.ప్రభాస్--56%

అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.

Wednesday, 14 December 2011

తారక రత్న తన పేరును ‘ఎన్టీఆర్’గా మార్పు

అయితే తారక రత్న తన పేరును ‘ఎన్టీఆర్’గా మార్చుకోవడానికి ముందు నందమూరి కుటుంబంలో పెద్ద చర్చే జరిగినట్లు సమాచారం. ఇద్దురు ఒకే విధమైన పేర్లు పెట్టుకోవడం వల్ల అభిమానులు అయోమయానికి గురవుతారని కుటుంబంలోని కొందరు పెద్దలు ఎంత మొత్తుకున్నా తారకరత్న వినలేదని తెలుస్తోంది. పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లయినా సరైన ఫేత్ రాలేదు, ఒక్క పెద్ద హిట్టూ లేదు, తాత పేరు వాడుకుంటే తప్ప పరిశ్రమలో ఉనికి కాపాడుకునే పరిస్థితి లేదు అంటూ గొడవ చేసి మరీ తారక రత్న తన పేరును ‘ఎన్టీఆర్’ గా మార్చకున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మనవడు అనే ఇమేజ్ మెల్లి మెల్లిగా తొలగించుకుని తన కంటూ సొంత బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్న జూ.ఎన్టీఆర్ తారక రత్న పేరు మార్పు విషయంలో కావాలనే సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది
నిన్నమొన్నటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ అంటే....స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి, అదుర్స్ చిత్రాల్లో నటించిన నందమూరి యువ హీరోనే. కానీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్టీఆర్ తయారయ్యాడు. అతడు కూడా నందమూరి చిన్నోడే. గతంలో అతగాడిని నందమూరి తారక రత్న అని పిలచే వారు. కానీ తారక్ ఇప్పడు తన పేరును కూడా షార్ట్ కట్‍‌గా ఎన్టీఆర్ అని మార్చుకున్నాడు. ఇకపై ఎన్టీఆర్ అంటే నేనే అంటూ ప్రకటించుకున్నాడు. పరిశ్రమలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉండటంతో నందమూరి అభిమానులు......గందరగోళానికి గురవుతున్నాడు. అందులోనూ ఇద్దరూ నందమూరి కుటుంబానికి చెందిన వారే కావడంతో తికమక పడుతున్నారు.

Friday, 11 November 2011

ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న:ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తిక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై కార్తీక ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆమె దగ్గరకు వెళ్లి.. నాకు మీ అమ్మగారు రాధ అంటే చాలా గౌరవం, ఇష్టం. ఆమెతో చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు.కానీ ఆవిడ కూతురైన మీతో చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెతో చెప్పాడు. దాంతో కార్తిక షాక్ కి గురైంది. ఆమె కెరిర్ లో ఎప్పుడూ హీరో నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. ఇంత గౌరవంగా తనను రిసీవ్ చేసుకుంటాడని భావించని ఆమె తన సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, అతని ప్రెడ్లీ నేచర్ ఎలాంటిదో చెప్తోంది. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తోంది. ఈ చిత్రం ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి అభివర్ణిస్తున్నారు