మెగాస్టార్ చిరంజీవి కుమారుడు సినీ హీరో రాంచరణ్ తేజ్ వివాహ నిశ్చితార్థానికి ధర్మవరం పట్టుచీరను చేనేత
చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ ను కలిసి తన కానుకను అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. రాంచరణ్ తేజ నిశ్చితార్థం విషయం తెలియగానే ఆరుగురు కోల్‌కతా కళాకారులతో కలసి 30రోజులపాటు శ్రమించి పట్టుచీరను తయారు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ చీరకు స్వర్ణహంసల పట్టుచీరగా నామకరణం చేశారు. హంసల బొమ్మలు గల బంగారు పూత డిజైన్లతో, ఎరుపు, పసుపు, తెలుపు రంగులు గల 180 రాళ్లతో ఈచీరను తయారు చేశాడు. చీర బార్డర్ కళాంజలి వర్క్ చేశాడు. చీరతో పాటు జాకెట్ పీసును కూడా ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసి చిరంజీవి కుమారుడికి అందించనున్నారు.