Saturday, 5 November 2011

క్రికెట్ కి దేవుడయ్యాడు సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే కాబొలు క్రికెట్ కి దేవుడయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 సంవత్సరాలు కెరియర్‌ని ముగిసినప్పటికీ సీనియర్లు పాఠాలు తనని ఎంతగానో ప్రోత్సహించాయని ఇటీవల 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ అలా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు తన క్రికెట్ జీవితంలో మొత్తం 33 రంజీ మ్యాచ్‌లలో పాల్గోనడం జరిగింది.

                                  
ఈ సందర్బంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ భారత్‌లో ఏ క్రికెటర్‌కైనా రంజీ ట్రోఫీ అతి ముఖ్యమైన టోర్నీ అని అన్నాడు. 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ గురించి చెబుతూ, ‘484 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం విజయానికి దగ్గరగా వచ్చాం. ఇంకా 42 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్ర మే ఉన్నాయి. ఆ 42 పరుగుల్నీ నేనే చేశాను. పది, పదకొండో స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు. విచిత్రమేమంటే వీరిద్దరు ఒక్క పరుగు కూడా చేయలేదని నాకు ఆట అయిపోయేంత వరకు తెలియదు. రంజీ మ్యాచ్‌లలో ఇది నాకు ఇష్టమైన సంఘటన’ అని అన్నారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ (234 బంతుల్లో 233, ఆరు సిక్స్‌లు, 21 ఫోర్లు) సాధించాడు.
ఇప్పుడు ఇక్కడ నేను రంజీ మ్యాచ్ ల గురించి ప్రస్తావించడానికి కారణం.. రంజీల్లో ఆడటం వల్ల సీనియర్ ఆటగాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుందని... తద్వారా వారి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని సచిన్ తెలిపారు. ‘నేను రంజీలు ఆడే రోజుల్లో ఏడెనిమింది టెస్టు ఆటగాళ్లు మాజట్టులో ఉండేవారు. వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, మంజ్రేకర్, చంద్రకాంత్ పండిట్... వీరందరితో ఆడే అవకాశం నాకు లభించింది. అప్పటికి నా వయసు 15 ఏళ్లే’ అని సచిన్ తన అనుభవాలను నెమర వేసుకున్నాడు

కడప జిల్లా ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది

                                         
ముస్లీంలు పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్‌ పండుగ దగ్గర పడటంతో ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాజస్థానం నుంచి ఒంటెలను ప్రత్యేకంగా తెప్పించారు. వివిధప్రాంతాలనుంచి తెప్పించిన వందలాది ఒంటెలు కడప జిల్లా రాయచోటికి చేరుకున్నాయి. ముస్లీంలు జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజస్థాన్ నుంచి ఒంటెలను కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో పాతికేళ్లనుంచి ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. బక్రీద్ పండుగ నెలముందునుంచే ఈ వ్యాపారం జోరందుకుంటోంది. ఇందుకోసం రాజస్థాన్‌నుంచి సుమారు 6వందల ఒంటెలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఒంటెలను కొనేందుకుమన రాష్ట్రంవాల్లేకాకుండా తమిళనాడు,కేరళనుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆందోళన

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ ఉద్యోగాల భర్తీలో సిఇ కుమార్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి జెన్‌కో నుంచి ఆదేశాలు వచ్చినా జాబితా ప్రకటించడం లేదన్నారు. ఈ మేరకు వారు సిఈ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జాబితాను తనవద్దే ఉంచుకుని తనకు అనుకూలురైన వారికి మాత్రమే నియమిస్తున్నారని వారు ఆరోపించారు

Friday, 4 November 2011

తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయరథానికి ఘోర ప్రమాదం

తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారితిరుచానూరులో వెలసిన ఆలయరథానికి  కొన్ని మరమ్మతులు చేసి, శుక్రవారం ట్రయల్‌రన్ నిర్వహిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథ చక్రాలకింద కాళ్లు నలిగిపోయి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 21న ప్రారంభం కానున్నాయి. ఆలయ బ్రహ్మరథం చక్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని మార్చి హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన చక్రాలను అమర్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.ఈ చక్రాల మార్పిడి కార్యక్రమాన్ని ప్రముఖ ఇంజీనింగ్ కంపెనీ 'భెల్'కు అప్పగించింది.ఇందుకు అయ్యే ఖర్చులో రూ.18 లక్షల రూపాయలు టీటీడీ అందించగా మిగతా రూ.22 లక్షలు భెల్ కంపెనీ భరించే విధంగా టీటీడీ ఒప్పందం చేసుకుంది. మూడు రోజులుగా రిపేర్ల నిర్వహించి భెల్ ఇంజనీరింగ్ సిబ్బంది రథ చక్రాలను మార్పిడి చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తిరుమాడవీధుల్లో శుక్రవారం ట్రయిల్ రన్ నిర్వహించారు. ఒక పరిభ్రమణం పూర్తయి తిరిగి యధాస్థానానికి చేర్చేందుకు తీసుకువస్తుండగా ఆస్థాన మండపం వద్ద అదుపుతప్పిన రథం పక్కనే ఉన్న అన్నదానం క్యూలైన్‌పైకి దూసుకుపోయింది

ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు ముఖ్యమంత్రి

మహతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో అవినీతిని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇక నుండి ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మీ కోసంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ కోసం ద్వారా ప్రజలు ఇక నుండి సులభంగా పది రకాల ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చునని చెప్పారు. ఇంతకుముందు మాదిరి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం చట్టాన్ని మార్చి దీనిని తీసుకు వచ్చామన్నారు. ప్రస్తుతం కృష్ణా, చిత్తూరు జిల్లాలో దీనిని ప్రవేశ పెడుతున్నామని, వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పెడతామని చెప్పారు
                                       .

ఈ సందర్భంగా మాట్లాడిన తిరుపతి కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి లోగో విషయంలో ఓ సలహా ఇచ్చారు. లోగో చాలా అద్భుతంగా కనిపిస్తోందని అయితే లోగో కింద ఉన్న త్వరగా తేలిగ్గా అనే పదాల కంటే సులభంగా వేగంగా అని ఉంచితే బాగుండేదని సూచించారు. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందనే తాను ఈ సలహా ఇస్తున్నానని ఈ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. అన్నీ ప్రింట్ అయిపోయినందున ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు

పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ నవంబర్ 19కు వాయిదా వేసారు

                                               
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాన్ 'పంజా' సినిమాకు సంగీత దర్శకుడుయువన్ శంకర్‌రాజా. యువన్ శంకర్‌రాజా మదర్ జీవా (58) గత సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. టి నగర్ స్వగృహంలో ఉండగా రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కనుక ఈ సమయంలో ఆడియో వేడుకను జరపాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుకను ఆపొద్దని యువన్ శంకర్ రాజా ఈ యూనిట్ కి చెప్పాడని సమాచారం. యువన్ శంకర్‌ రాజా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు.మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ చాలా వుంటుంది కాబట్టిపై కారణం వలన నవంబర్ 19కు వాయిదా వేసారు

చంద్రబాబును విచారించండి:వైఎస్ జగన్ సీబీఐకి విజ్ఞప్తి చేశారు


   ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు.అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 
                                       
 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు