Monday, 13 February 2012

రాయలసీమలో ఎర్రచందనం దొంగల

రాయలసీమలో ఎర్రచందనం దొంగల కార్యకలాపాలు పెచ్చుమీరాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అటవీ అధికారులకు పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తేందుకు కొందరు ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. చిత్తూరు,కడప,  కర్నూలు, నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రబంగారం విస్తరించి ఉంది.ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా మారిన ఈ అడవులు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు నిల యమయ్యాయి.ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను అటవీ పోలీ సులు కాపుకాసి పట్టుకుంటున్నారు. రెండేళ్ల కాలంలో సీమ జిల్లాలతో పాటు నెల్లూరుతో కలిపి 900కు పైగా ఉంటారని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ అటవీ అధికారి స్పష్టం చేశారు. చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే 600 మందికిపైగా అరెస్టు చేసినట్లు సమాచారం. అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న వారిలో 90శాతం మంది కూలీలు, డ్రైవర్లే ఉన్నట్లు సమాచారం. కిలో ఎర్రచందనం దుంగను నరికి స్మగ్లర్ చేతికి ఇస్తే రూ.150 ఇస్తున్నారు. అలా వారానికి ఒకరు సుమారు రూ.2 నుంచి రూ.5వేలకు పైనే కూలి గిట్టుబాటు అవుతుండడంతో అటవీ సమీపంలోని గ్రామాల్లోని కొందరు దీన్నే వృత్తిగా పెట్టుకున్నారు. అలాంటి వారే అధికారులకు దొరుకుతున్నారు.పైరవీలతో తప్పించుకుంటున్న స్మగ్లర్లు ఇటీవల చిత్తూరు,కడప  జిల్లాల పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దొంగ ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి, ఇద్దరు అధికారులకు కొంత మొత్తంలో నగదు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తిపై రెండు జిల్లాల్లో 14 కేసులు ఉన్నట్లు అటవీ శాఖకు చెందిన ఓ అధికారి  వివరించారు.మరోవైపు తిరుపతిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న టెంపోను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. సుమోలో మొత్తం 32 దిమ్మెలు ఉన్నాయని, వాటి విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందని సిఐ నాగరాజ్ తెలిపారు. టెంపో డ్రైవర్ వామనాన్ని వదిలి పారిపోయాడు. వివిధ ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసినా ఎర్రచందనానికి డిమాండ్ ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ జరుగుతోంది. అటవీశాఖలో కొందరు ఇంటి దొంగలు సహకరించడం వల్లనే విలువైన కలప తరలి వెళతున్నదని ఆరోపణలు ఉన్నాయి.వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నామన్నారు.

తిరుపతిలో మెడిసిన్ మాఫియా

తిరుపతిలో ఔషధాల అక్రమ విక్రయాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. అడ్డదారిలో కోటీశ్వరులవుదామని భావిస్తున్న కొందరు ఔషధ వ్యాపారులు అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గతంలో పని చేసిన ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన చనువుతో ఇక్కడ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఔషధ నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించడంతో ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో మందుల అక్రమ అమ్మకాలు సాగిస్తూ వారం తిరక్క ముందే రెండు ప్రాంతాల్లో పట్టుబడడం సంచలనం రేపుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రులకు ఇస్తున్న మందులను సైతం మెడికల్ దుకాణాల్లో, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు వివిధ కంపెనీలు తయారు చేసే శాంపిళ్లను సైతం మెడికల్ రెప్‌లతో కుమ్మక్కై భారీస్థాయిలో విక్రయిస్తున్నారు. నాలుగు రోజులకు ముందు బైరాగిపట్టెడలో ఒక దుకాణంలో ఈఎస్‌ఐ, ప్రభుత్వాస్పత్రుల మందులు విక్రయిస్తుం డగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా  ఒక ఇంట్లో ఏకంగా శాంపిల్ మందులను అమ్ముతుండగా పట్టుకుని రూ.30 లక్షల మందులను స్వాధీనం చేసుకున్నారు.ఇలాంటి తనిఖీలను ముమ్మరం చేస్తాం. అక్రమ మెడికల్ స్థావరాలను గుర్తించి, కేసులు నమోదు చేస్తాం. ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులను గుర్తించే పనిలోనే ఉన్నాం. పట్టుబడ్డ ఈఎస్‌ఐ, సర్కారు, శాంపిల్ మందులపై విచారణ సాగుతోంది. వీటిలో భాగస్వామ్యం ఉన్న వారిపై చర్యలు తప్పవు.

చేనేత కార్మికుల నేనున్నానంటూ భరోసా...జగన్‌మోహన్‌రెడ్డి

చేనే త కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులు పట్టించుకున్న పా పానపోలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల కళ్లు తెరిపించడానికే తాను 48 గం టలపాటు నిరాహారదీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నా రు.చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు కార్మికులు పోటెత్తారు. వేలాదిగా నేతన్నలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. అనంతపురం నుండే కాక పొరుగున వున్న కర్నాటక నుండి కూడ భారీగా ఇక్కడకు చేరుకున్నారు.ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబ సభ్యులు తమ సమస్యలను జగన్ వద్ద విన్నవించుకుంటున్నారు. వారి సాధకబాధకాలను అవగతం చేసుకున్న ఆత్మీయనేత చేనేతల కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమం త్రి అయ్యాక చేనేతల రుణాల మాఫీ కోసం రూ.312కోట్లు మంజూరు చేశారన్నారు. చేనేతల కోసం బడ్జెట్‌లో కే టాయించిన రూ.312 కోట్లు నిధులు ఆయన మృతి చెందిన తరువాత కూ డా విడుదల చేయలేదన్నారు. రేపోమాపో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని ఈ తరుణంలో తాను చేపట్టనున్న దీక్ష కారణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అవుతుందన్నారు.వీటితోపాటు విద్యార్థుల ఫీజు రీ యింబర్స్‌మెంటు పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు, చేనేతల సమస్యలపైనే ప్రధాన అజెండాలుగా 48 గంటలపాటు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Sunday, 12 February 2012

కర్నూలు ఘంటసాలకు సాటిలేరు...: టీజీ వెంకటేష్

కర్నూలు ఘంటసాలకు ఎవరూ సాటిరారని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం రాత్రి కలెక్టర్‌లోని సునయన ఆ డిటోరియంలో ఉపాధ్యాయుడు చం ద్రకంటి మద్దయ్య ఆధ్వర్యంలో డ్రీ మ్స్ ఇండియా సంస్థ ఘంటసాల వ ర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ఆయన 1943 ప్రాంతం లో ఆలూరుకు వచ్చి తన దేశ భక్తిని చాటారని వివరించారు. పేద కుటుంబంలో పుట్టిన ఘంటసాల తండ్రి ఆ శయం కోసం ఎంతగానో పరితపించారన్నారు. మహానుభావుల వర్ధంతి స భలను నిర్వహించేందుకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఉపాధ్యాయుడైన చంద్రకంటి చేస్తున్న ప్రజా జాగృతి కార్యక్రమాలను ఆ యన ప్రశంసించారు. ఘంటసాలకు సంబంధించి అయిదు వేల పాట కచేరిలు నిర్వహించిన డీఏ మిత్ర, గా యని పద్మావతి, సుధారాణి, ఇబ్ర హీం తదితరులు తమ గీతాలతో ఆ హూతులను అలరించారు. ప్రముఖ నాయకుడు లక్క సాగరం లక్ష్మీరెడ్డి కా ర్యక్రమానికి హాజరై ఘంటసాల గు రించి మాట్లాడారు. అనంతరం కళాకారులను, కళా పోషకులను జ్ఞాపికల తో సత్కరించారు. రాత్రి ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఘంటసాల మధుర గీతాలాపన అర్ధరాత్రి వరకు సాగింది. ఘంటసాల విగ్రహావిష్కరణ : నగరంలోని చిల్డ్రన్స్ పార్కు దగ్గర ప్రముఖ సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘంటసాల భగద్గీతను పాడి ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు.

చంద్రబాబుకు యువత గురించి మాట్లాడే అర్హత లేదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

యువ నాయకత్వం గూర్చి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు  విమర్శించారు. తిరుపతిలో బైక్ నడిపినంత మాత్రాన యువకుడైపోతాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 శాతం మద్యం షాపులు టీడీపీ నాయకులవేనని స్పష్టం చేశారు. కడప వైఎస్ఆర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. .ఈ సందర్భంగా  మాట్లాడుతూ చంద్రబాబు నోట యువతరం, యువనాయకత్వం అనే మాటలు రావడం హాస్యాస్పదంగా వుందన్నారు. టీడీపీలో వారసత్వం లేదని ప్రకటించిన చంద్రబాబుకు యువతతో ఏమి పని అని ప్రశ్నించారు. యువత గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వుందని చెప్పారు. వై అన్న పదంలోనే యువత వుందని స్పష్టం చేశారు.తమ నాయకులకు 38 సంవత్సరాల వయసులోనే పార్టీకి సారధిగా వున్నారని తెలిపారు. టీడీపీలో 33 శాతం యువతకు అర్హత కల్పిస్తామని 1990 నుంచి బాబు చెబుతునే వున్నారన్నారు. ప్రతి సమావేశంలో బాబు తనను నమ్మండి నమ్మండి అని చెబుతుంటారు అంటే ఆయనను ప్రజలు నమ్మడం లేదని ఆయనకు స్పష్టమైనట్లు వుందని విమర్శించారు. ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ప్రజలు నమ్మె స్థితిలో లేరని చెప్పారు. ఎన్‌టిఆర్ కిలో రూ.2 బియ్యం పథకాన్ని పెడితే బాబు అధికారంలోకి రాగానే అదిఎత్తేశారన్నారు. అలాగడే మద్యం నిషేదం కూడా అని చెప్పారు. ప్రస్తుతం మద్యం సిండికేట్లపై మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50శాతం మద్యం షాపులు టిడిపి నాయకులవేనని చెప్పారు. కుప్పంలో 16వుంటే అన్నీ టిడిపి వారివే అని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మే స్థాయిలో యువత లేదని చెప్పారు.

'అనంత'లో వైఎస్ జగన్ చేనేత దీక్ష

చేనేత సమస్యలపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ సంసిద్ధులయ్యారు. అందుకు పట్టుకేంద్రమైన ధర్మవరం పట్టణాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈనె ల 12వతేదీన నిరాహార దీక్ష ప్రారంభమై 14వతేదీతో ము గియనుంది.'అనంత'లో పట్టుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రత్యేకదృష్టి సారించారన్న వాదనలు వ్యక్తం అవుతున్నా యి. ప్రత్యేకించి బీసీ వర్గాల్లో తన ము ద్రవేసుకునేందుకు ఆయన తహతహలాడుతున్నాడన్న అభిప్రా యం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోం ది. బీసీ వర్గా ల్లో పట్టు సాధించడం ద్వారానే అనంతలో పార్టీ పుంజుకోవడానికి దోహదపడుతుందన్న అభిప్రాయంతో వైఎస్ఆర్‌సీపీ అడుగులేస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి జిల్లాలో నా యకత్వ లోపం ఉన్నద న్న భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. అయితే ఈ దీక్ష వల్ల వై ఎస్ఆర్ కాం గ్రెస్ తన రాజకీయ భవితవ్యాన్ని కూ డా పరీక్షించుకోనుంది. ము ఖ్యంగా ధర్మవరంపై జగన్ ప్రత్యేక దృ ష్టి సారించారని చెప్పవచ్చు.ఇప్పటికే రెండుమార్లు ధర్మవరం పట్టణానికి జ గన్ విచ్చేశారు. మొదటి సారి చేనేతలు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా ఆయన పట్టణానికి విచ్చేసి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఓదార్పు యాత్రలో భాగం గా ధ ర్మవరం విచ్చేసిన జగన్ అప్ప ట్లో కూ డా చేనేతల సమస్యలపై తన వాణి వినిపించారు. వైఎస్ఆర్ హ యాంలోనే చేనేతలకు న్యాయం జరిగిందంటూ తరువాత వారిని పట్టించుకునే నాథుడే లే రంటూ ఆందోళన వ్యక్తం చేశారు.చేనేతల్లో పట్టుకోసం... చేనేత వర్గాల్లో పట్టు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ప్రధానంగా దృష్టి సారించారని చెప్పవచ్చు. చేనేతలకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఇక్కడ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనికితోడు పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుందన్న భావనను చెరిపి వేయడం కోసం కూ డా చేనేతల దీక్ష ఒక కారణమవుతోంద న్న వాదనలు వినిపిస్తున్నాయి

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఉక్కుపాదం

జిల్లాలో ఫ్యాక్షన్‌ను నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా ఎస్పీ షహనవాజ్‌ఖాసీం పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధానంగా ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి,ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఎస్పీలు,సీఐలు,ఎస్ఐలతో ఎస్పీ సమీక్షించారు.ఫ్యాక్షన్ గ్రామాల్లో తాజా పరిస్థితులు,తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫ్యాక్షన్ నాయకులు,వారి అనుచరుల కదలికలపై గ్రామాల వారీగా పోలీసుల అధికారులతో ఆరాతీశారు. ఆ గ్రామాల్లో పరిస్థితి, ఇరువర్గాలు ప్రశాంతంగా జీవిస్తున్నారా..?లేదా వైరివర్గాలు ఒకరినొకర అంతమొందించే వ్యూహాలకు పూనుకుంటున్నారా..? దాడులకు దిగే అవకాశం ఉందా..? వారి ఆర్థిక పరిస్థితి, ప్రవర్తన తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు ఫ్యాక్షన్ తీవ్రతను బట్టి క్రమం తప్పకుండా పల్లె నిద్రలు చేయాలన్నారు. మొక్కుబడిగా పల్లె నిద్రలు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. వీటితోపాటు పలు కేసులపై ఆయన చర్చించారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ముఖ్యపట్టణాల్లో రౌడీయిజం, దందాలను తీవ్రంగా పరిగణించాలన్నారు