Friday, 11 November 2011

తిరుమలలో టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతి

తిరుపతి: తిరుమలలో దళారులకు చెక్‌ పెట్టేందుకు అధికారులు రోజుకో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకు ఫొటో మెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టారు. దీంతో దళారులనే కాదు భక్తుల్ని క్యూ లైన్లలో తోస్తున్న కొంత మంది అధికారులను కూడా నియంత్రించే వీలు కలిగింది. అన్ని దర్శన టికెట్లకు ఫొటో విధానం ప్రవేశపెట్టేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దళారులకు తోడు కొందరు టిటిడి అధికారుల ఇష్ట్యా రాజ్యం కూడా శ్రీవారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు దేవస్థానం ఉన్నతాధికారులు కొత్తకొత్త విధానాల్ని వెతుకుతున్నారు ఆర్జిత సేవా టికెట్లలో దళారుల మోసాల్ని నియంత్రించేందుకు కొత్తగా ఫొటో మెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దీంతో భక్తులు ఇతరుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసిన ఫొటో లేని టికెట్లు చెల్లుబాటు కావు. ఫొటో లేని భక్తుల్ని క్యూ లైన్ల నుంచి తప్పిస్తారు. వేలిముద్రలు మాత్రమే అమలులో ఉన్న విధానంలో దళారులకు తోడు కొందరు అధికారులు కూడా మధ్యలో భక్తుల్ని క్యూ లైన్లలోనికి తోసేవారు. ఫొటో పద్దతి అమలులోకి వచ్చినందున దళారుల నుంచి కష్టాలు తప్పినట్లేనని భక్తులు సంతోషపడుతున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో ఫొటో విధానాన్ని ప్రవేశపెట్టినట్లే ఇతర టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని టిటిడి యోచిస్తోంది.

కర్నూలు వైద్య కళాశాలలో సీట్ల పెంపు

కర్నూలు: కర్నూలు వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెంచడానికి నిధులు మంజూరు అయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. భవాని ప్రసాద్ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెంచుతున్నారు. కర్నూలు కళాశాల కు 46 సీట్లు  పెంచారు. దీనికి మొదట విడత కింద 10 కోట్లు విడుదల చేయనున్నారు.

Thursday, 10 November 2011

రేపు మమతా మోహన్ దాస్ నిశ్చితార్దం

మళయాళ ముద్దు గుమ్మ మమతా మోహన్ దాస్ రేపు (11-11-11)నిశ్చితార్దం చేసుకుంటోంది.ఆమె చేసుకోబోయే వ్యక్తి ఆమె  చిన్ననాటి స్నేహితుడు, మరియు ఓ బిజినెస్ మ్యాన్. 2012 లో వివాహం జరుగనుంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...గత కొన్నేళ్లుగా నేను ఓ బిజినెస్‌మాన్‌ని డేటింగ్ చేస్తున్నాను. మా స్నేహం ప్రేమగా మారింది. అసలు మేము స్నేహితులమనే అనుకున్నాం. అయితే ఏళ్లు గడిచే కొద్దీ మా మధ్య స్నేహంకన్నా ఎక్కువ ఇంకేదో ఉందని, అదే ప్రేమ అని తెలుసుకున్నాం. మా ప్రేమను మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. వాస్తవానికి తను బహ్రెయిన్‌లో ఉంటాడు. షూటింగ్స్ నుంచి ఖాళీ దొరికితే చాలు మా నాన్నతో స్పెండ్ చేయడానికి నేను బహ్రెయిన్ వెళుతుంటాను.మా నాన్న అక్కడ ఒక అమెరికా బేస్డ్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. మా అమ్మ ఎక్కువగా నాతో షూటింగ్స్‌కు హాజరయ్యేవారు.ఖాళీ దొరికినప్పుడు నేను, మా అమ్మ బహ్రెయిన్ వెళ్లేవాళ్లం. ఆ సమయంలో అతన్ని కలుసుకునేదాన్ని. మా మధ్య బాగా అవగాహన కుదిరింది. తనే నా మిస్టర్ రైట్ అనిపించింది" అన్నారు.

ది బిజినెస్ మాన్

హైదరాబాద్: దూకుడు మీదున్న మహేశ్ బాబు తన కొత్త సినిమా "ది బిజినెస్ మాన్" ను శరవేగంగా రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా టీసర్(క్లిప్పింగ్) ఒకటి ఇవాళ విడుదల చేసారు. మహేశ్ బాబు డైలాగ్ డెలివరీలో విబిన్నత కి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది.  ఈ వీడియో లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. . మహేష్ బాబు లుక్ గురించి ఇంకా వేరే రాయాలా చెప్పండి. వీడియో చూసి ఆనందించండి.

యూనివెర్సిటీ లకు కళ

రాయలసీమ: రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సెలర్లను నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ వర్సిటీ వీసీగా కృష్ణా నాయక్ ను , శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ గా రామకృష్ణారెడ్డిని నియమించారు. 

ఒక్కరోజులో ద్వాదశ జ్యోతిర్లంగాల దర్శనం!



దేశ నలుమూలల విస్తరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడాలంటే వేల రూపాయలు కావాలి. అనేక రోజులు తిరగాలి. కానీ... ఒక్కరోజులో వీటన్నింటిని దర్శించే అవకాశం వస్తే వదులుకోరు కదా. అయితే, హిందూపురం రండి. బెంగుళూరుకు కేవలం వంద కి.మీ. దూరంలో ఉన్న  ఈ పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ సంస్థ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని హిందూపురంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇండోర్ స్టేడియంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఏర్పాటుచేశారు. శివ పరమాత్ముని దివ్య అవతరణ గురించి ఈ జ్యోతిర్లింగాలను ప్రదర్శిస్తున్నారు. దేవభూమియైన భారతదేశంలోని 12 తీర్థ స్థానాల్లో స్థాపించిన జ్యోతిర్లింగాలు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రజలకు తెలియచేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జ్యోతిర్లింగాల అన్ని రూపాలను ఒకేస్థానంలో ప్రజలు చూసి తరలించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సుగంధ చెప్పారు. గుజరాత్, శ్రీశైలం, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాంచల్ వంటి ప్రాంతాల్లో కొలువైన విశే్వశ్వరుడు, మల్లికార్జునుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, సోమనాథుడు, రామేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు వంటి శివ లింగాలుప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 
దర్శన వేళలు
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలకు జ్యోతిర్లింగాలు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు సైన్స్, స్పిరిచ్వుల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రాజయోగ శిక్షణ, ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో భక్తిపరవశం గావించు దేవతల దృశ్య రూపం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగాల దర్శనానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే సైన్స్, స్పిరిచ్వుల్ ఎగ్జిబిషన్‌లోని అంశాలను తెలుసుకొనేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా వస్తున్నారు.

అనంతపురంలో ఉద్యోగాలు

అనంతపురం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ వి.దుర్గాదాస్ చెప్పారు. 2016లో దోహాలో జరిగే ఒలింపిక్స్‌కు అవసరమైన భవనాలు, స్టేడియాల నిర్మాణం కోసం 25 వేల మంది కార్మికుల అవసరం ఉందని, జిల్లా నుంచి అత్యధిక శాతం మందిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.


రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గార్మెంట్స్ పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన టైలర్లు అవసరమన్నారు. పారిశ్రామిక శిక్షణ సంస్థలతో పాటు పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.