తిరుమలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిబంధనలు అతిక్రమించారు.తిరుమలలో ఉదయం శ్రీవారిని దర్శించుకున్న వీరశివారెడ్డి ఆ తర్వాత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.తిరుమలలో సిగరెట్ నిషేధం ఉందని తెలిసి కూడా సిగరెట్ ప్యాకెట్ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఎమ్మెల్యే తీరుపట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధే ఇలా వ్యవహరిస్తే సామాన్య జనం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు... ప్రెస్ మీట్‌లో వీరశివారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు.జగన్ ఓ మాఫియా కింగ్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు
Wednesday, 9 November 2011
కర్నూలు: కొత్త టూరిజం ప్రాజెక్టు ప్లాన్
కర్నూలు జిల్లాలోని వివిధ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. గత జూన్ 23న టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జమేష్ రంజన్ ప్రముఖ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలోని 15 క్షేత్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7.53 కోట్లతో జిల్లా పర్యాటక శాఖ కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపింది.
స్థల సేకరణను బట్టి గెస్ట్‌హౌస్‌లు, నీటి వసతి, పబ్లిక్ టాయ్‌లెట్స్, పార్కులు, స్వాగత తోరణాలు తదితరాలను నిర్మిస్తారు. డార్మెటరీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు. అవసరమున్న చోట రెస్టారెంట్ల నిర్మాణం చేపడతారు.

నాకు డైరెక్టుగా కాల్ చేయండి- చిత్తూరు ఎస్పీ
కాల్‌యువర్ ఎస్పీ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు 08572- 234000 నెంబర్‌కు ఫోన్ చేసి బాధితులను సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 14 కార్యక్రమాల్లో 430 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో భూ తగాదాలు, కోర్టు కేసులను మినహాయించి మిగిలిన సమస్యలను ఆయా స్టేషన్ల ద్వారా పరిష్కరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
తిరుమలలో నో రష్ !
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం అయిదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది
ఓ రైతు రికార్డు: ఎద్దుకు గంతలు కట్టి సాగు
అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన తైదుల ఈశ్వరరెడ్డి పొలంలో బుటారు నాగరాజు మంగళవారం వినూత్న ప్రయోగం చేశారు. ఒంటెద్దుకు గంతలు కట్టి పగ్గాలు, పట్టెండ్లు లేకుం డా 12 ఎకరాల్లో జొన్న సాగుచేశాడు. ఉద యం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు సాగు పూర్తిచేశాడు. సాధారణంగా కాడెద్దులతోనే ఎనిమిది గంటల వ్యవధిలో ఇంత విస్తీర్ణంలో సాగుచేయడం కష్టసాధ్యం. అలాం టిది ఒకే ఎద్దుకు గంతలు కట్టి విత్తడం ఆషామాషీకాదు. ఈ దృశ్యాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు తిలకించి యువరైతు నాగరాజును అభినందించారు.
సత్యసాయి జయంతి వేడుకలు త్వరలో
సత్యసాయి బాబా జయంతి వేడుకలు మరో రెండు వారాల్లో జరగనున్నాయి. వీటి కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రతి జన్మదినం ఒక పర్వదినంలా జరిగేది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, ప్రభుత్వం జన్మదిన ఏర్పాట్లపై మూడునెలల ముందు నుంచే కసరత్తు చేసేవి. వేడుకలకు దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేవారు. ప్రతి జన్మదినాన బాబా వరాలు కురిపించేవారు.
విద్య, వైద్యం, తాగునీరు తదితర కార్యక్రమాలకు చేయూతనిచ్చేవారు. సత్యసాయి దివ్యప్రకాశం వల్ల పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. గుడిసెలు పోయి ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. మాంద్యం సందర్భాలను ఎరుగక ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చింది. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో పుట్టపర్తిలో కోట్ల రూపాయల లావాదేవీలు సాగాయి.
పతినిత్యం వచ్చీ వెళ్లే భక్తులతో పట్టణం కిటకిటలాడేది. బాబా తన దేహాన్ని వదిలి ఇటీవల శివైక్యం చెందారు. బాబా జయంతి వేడుకలపై ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. బాబా పూర్వపు దివ్య వైభవాన్ని సత్యసాయి ట్రస్టు నిర్వాహకులు ఏ విధంగా కొనసాగిస్తారో వేచిచూడాల్సి వుంది. బాబా చివరి కోరికలుగా ప్రచారమవుతున్న వేయి స్తంభాలగుడి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి, సేవలందించే పథకాలను ట్రస్టు ప్రకటించవచ్చని భక్తులు ఎదురుచూస్తున్నారు.

సివిల్స్ కు ఉచిత శిక్షణ
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2012కు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ డాక్టర్ సి.రామాంజినేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
బయోడేటా ఫారం లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంవత్సరాదాయం, కులం, విద్యార్హతలు, వాటి ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, రూ.5 విలువైన స్టాంపులు అతికించిన రెండు సెల్ఫ్ అడ్రస్ కవర్లతో ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్, అనంతపురం అనే చిరునామాకు పంపాలన్నారు.

Subscribe to:
Posts (Atom)