రా ష్ట్ర విభజన జరిగితే రాయలసీమ జి ల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటుచేస్తే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ వికాస సమితి వ్యవస్థాపకుడు, సినీ నటుడు నరేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆదర్శసొసై టీ భవనంలో రాయలసీమ వికాససమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమనీ, ఒకవేళ విడిపో తే గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలన్నారు.రాయలసీమ వెనుకబడిన విషయాన్ని శ్రీకృష్ణకమిటీ సై తం స్పష్టంచేసిన విషయం గుర్తు చే శారు. రాయలసీమ జిల్లాలను విడదీసి తెలంగాణ, కోస్తాంధ్రల్లో కలపాలనే చూస్తే సహించేది లేదన్నారు. ప్ర జలలో చైతన్యం తీసుకురావడానికి త మ సమితి పర్యటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సమితి సభ్యులు రమేష్‌బాబు, లక్ష్మీనారాయ ణ, పార్వతమ్మ, చంద్రశేఖర్‌యాదవ్, రఘునాథరెడ్డి, రమేష్‌గౌడ్, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు
Showing posts with label సినీ నటుడు నరేష్. Show all posts
Showing posts with label సినీ నటుడు నరేష్. Show all posts
Sunday, 20 November 2011
Saturday, 15 October 2011
ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు
విభజన పేర రాయలసీమను అడ్డంగా నరకొద్దని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన పేర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాయలసీమను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ లబ్దికోసం, సీట్లసంఖ్య పేర ప్రభుత్వం సీమను విడదీయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే పూర్తిగా నష్టపోయేది సీమవాసులేనన్నారు. ఇప్పటికే ప్రతేకవాదులు సీమవారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సీమలోని మేథావులు, విద్యార్థుల, రైతులు సీమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు.
సీమలో తాగు, సాగునీటి సమస్య, కరవు, ఫ్యాక్షన్ నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీమను విడదీస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారడం ఖాయమన్నారు. సీమ అభివృద్ధికి ప్రభుత్వం 30 టిసింఎంల నీరు కేటాయించాలని, రూ.50 వేల కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నరేష్ డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తిరుపతి రాజధానిగా విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తాను గతంలో బిజెపిలో ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానన్నారు. విశాల రాయలసీమ కోసం త్వరలో రాజకీయాలకు అతీతంగా వేదిక ఏర్పాటుచేసి మేథావులు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఉద్యమాన్ని మందుకు తీసుకువెళ్తామన్నారు. బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ విభజన పేర సీమను విడదీస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతామన్నారు. విశాల రాయలసీమ కోసం రథయాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పెనుకొండ కాంగ్రెస్ నాయకులు రమేష్, జాకీర్‌హుసేన్, సరోజమ్మ, సుధాకర్, అమర్, కబీరయాదవ్ తదితరులు పాల్గొన్నారు

Subscribe to:
Posts (Atom)