దేశంలో విస్తరించిన అవినీతి ఎయిడ్స్ కన్నా ఎంతో ప్రమాదకరమని సినీ నటుడు, కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు నరేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బాలుర కళాశాలలో అవినీతి వ్యతిరేక పొరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేటి విద్యార్థులు, రాజకీయం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి ప్రాచీనకాలం నుండే ఉందన్నారు. అయితే ప్రజల్లో స్వతహాగా చైతన్యం వస్తే అవినీతిని అంతం చేయవచ్చన్నారు. ముఖ్యంగా అవినీతి అంతానికి ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్థాయి నుండే అవినీతిని పారద్రోలాలన్నారు. విద్యార్థి దశ నుండే అవినీతిని అంతమొందించడానికే కదిరి నుండి ఈ మహత్తర ఉద్యమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఒక నీటి బొట్టులా ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర మంతా పెద్ద ఉద్యమంగా మారుతుందన్నారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారే దీక్ష అందరికి ఆదర్శమన్నారు. అనంతపురం జిల్లా కరవుకాటకాల్లో అల్లాడుతోందని, తాను అదిలాబాద్ జిల్లా అడవుల్లో పని చేసినప్పటికి అనంత జిల్లాకు తన వంతు సహాయ సహకారాలందించి ఆదుకోవానే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం అనంతపురం జిల్లాలోనే తన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో జన్మంటూ వుంటే అనంతపురం జిల్లాలోనే పుడతానన్నారు. అనంతరం అనంత విద్య, వైద్య అవినీతి వ్యతిరేక పోరాట సమితికి తన వంతు సాయంగా రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. జాకీర్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సమాజంలో జరుగుతున్న అవినీతి విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ చెన్నకేశవులు, అధ్యాపకులు ప్రశాంత్, సూర్యనారాయణ, సనావుల్లా, అనంత విద్యా, వైద్య అవినీతి వ్యతిరేక పొరాట సమితి జిల్లా కార్యదర్శి వెంకటేష్, బిసి మహాజన సమితి రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Showing posts with label అనంతపురం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. Show all posts
Showing posts with label అనంతపురం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. Show all posts
Tuesday, 18 October 2011
Saturday, 15 October 2011
ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు
విభజన పేర రాయలసీమను అడ్డంగా నరకొద్దని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన పేర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాయలసీమను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ లబ్దికోసం, సీట్లసంఖ్య పేర ప్రభుత్వం సీమను విడదీయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే పూర్తిగా నష్టపోయేది సీమవాసులేనన్నారు. ఇప్పటికే ప్రతేకవాదులు సీమవారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సీమలోని మేథావులు, విద్యార్థుల, రైతులు సీమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు.
సీమలో తాగు, సాగునీటి సమస్య, కరవు, ఫ్యాక్షన్ నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీమను విడదీస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారడం ఖాయమన్నారు. సీమ అభివృద్ధికి ప్రభుత్వం 30 టిసింఎంల నీరు కేటాయించాలని, రూ.50 వేల కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నరేష్ డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తిరుపతి రాజధానిగా విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తాను గతంలో బిజెపిలో ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానన్నారు. విశాల రాయలసీమ కోసం త్వరలో రాజకీయాలకు అతీతంగా వేదిక ఏర్పాటుచేసి మేథావులు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఉద్యమాన్ని మందుకు తీసుకువెళ్తామన్నారు. బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ విభజన పేర సీమను విడదీస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతామన్నారు. విశాల రాయలసీమ కోసం రథయాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పెనుకొండ కాంగ్రెస్ నాయకులు రమేష్, జాకీర్‌హుసేన్, సరోజమ్మ, సుధాకర్, అమర్, కబీరయాదవ్ తదితరులు పాల్గొన్నారు

Subscribe to:
Posts (Atom)