Showing posts with label వివిఎస్ లక్ష్మణ్. Show all posts
Showing posts with label వివిఎస్ లక్ష్మణ్. Show all posts

Thursday, 19 January 2012

రిటైర్‌మెంట్ ఆలోచన లేదు.... వివిఎస్ లక్ష్మణ్



ఆస్టేలియా టూర్‌లో పేలవ ఫామ్‌ తో సతమతమౌతూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎట్టకేలకు నోరు విప్పాడు. తన రిటైర్మెంట్‌ పై వస్తున్న విమర్శలకు, ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. నాలుగో టెస్టు కోసం బుధవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం ఓ భారత విలేఖరితో తన రిటైర్మెంట్‌ ఇప్పట్లో ఉండదని చెప్పినట్లు ది ఏజ్‌ పత్రిక ప్రచురించింది. ఆసీస్‌ పై మూడు టెస్టుల్లో కేవలం 17 సగటుతో 102పరుగులు చేసిన లక్ష్మణ్‌, ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి విషయం తెలిసిందే.నాలుగు టెస్టుల ఆస్టేలియా సిరిస్‌లో వివిఎస్ లక్ష్మణ్ రెండు సార్లు డకౌట్‌ అయ్యాడు. ఒకే ఒక్క అర్థసెంచరీ చేశాడు. దీంతో అతడిని టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వాలంటూ మాజీలు ఒత్తిడి చేయడం జరిగింది. దీంతో మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుతం ఆస్టేలియాలో జరగుతున్న నాలుగు టెస్టు సిరిస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన వివిఎస్ లక్ష్మణ్ 17 సగటుతో కేవలం 102 పరుగులు సాధించి విమర్శకులకు తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మూడు టెస్టుల్లో పరాజయాన్ని మూట గట్టుకోని సిరిస్‌ని కోల్పోయిన టీమిండియా విమర్శకుల మాటలకు సమాధానాన్ని చెప్పలేక పోయినప్పటికీ, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ను తప్పించాల్సిందేనని భారత్‌లో మాజీ క్రికెటర్లు, సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నా, టీమిండియా సభ్యులు ఆయనకు బాసటగా నిలిచారు.మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు. దానికి వీవీఎస్‌ కూడా ఇప్పట్లోనే తన రిటైర్మెంట్‌ ఉండదంటూ సూచనలు పంపించాడు. ఈనెల 24నుంచి అడిలైడ్‌లో జరుగనున్న నాలుగో టెస్టులో ఎలా అయినా రాణించాలని వీవీఎస్‌ తపిస్తున్నాడు.

Saturday, 24 December 2011

సచిన్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ ?

యావత్ క్రికెట్ ప్రపంచానికే తమ అనితర సాధ్యమైన ప్రతిభతో వనె్నతెచ్చిన భారత ‘సీనియర్‌త్రయం’ సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు బహుశా తమ కెరీర్‌లో ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ కావచ్చు. దాదాపు ముగ్గురూ రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నారు. చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత సచిన్‌ది. అత్యధిక పరుగుల్లోనూ అతనే నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతని వెన్నంటే ద్రవిడ్ మొత్తం పరుగుల విషయంలో రెండో స్థానంలో నిలుస్తున్నాడు. భారీ భాగస్వామ్యాలు... కీలక విజయాలు.. కళాత్మక ఆట.. కడవరకూ పోరాడే తత్వం..వివాదాలకు దూరంగా ఉండడం.. అత్యున్నత క్రీడా ప్రమాణాలను పాటించడం వంటి అనేకానేక అంశాల్లో ఈ ముగ్గురికీ సారూప్యం ఉంది. గణాంకాల విషయం ఎలావున్నా, సామర్థ్యంలో ముగ్గురూ ముగ్గురే. జాతీయ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించడంలో మొనగాళ్లే. ఆస్ట్రేలియాలో టీమిండియా నాలుగు టెస్టులు ఆడుతుంది.తిరిగి 2014 డిసెంబర్‌లో మరోసారి ఆసీస్ టూర్‌కు వెళుతుంది.అప్పటికి ఈ ముగ్గురూ టెస్టు క్రికెట్‌లో ఉంటారనేది అనుమానమే.ఒకవేళ ఎవరైనా రిటైర్‌కాకుండా కెరీర్‌ను కొనసాగించినా, ముగ్గురూ కలిసి ఆడడం అసాధ్యంగానే కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే, ఇదే ఆసీస్‌లో తమ చివరి టెస్టు సిరీస్ అన్నది స్వదేశం నుంచి బయలుదేరే సమయంలోనే ఈ ముగ్గురు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చివుంటారు. అందుకే ఈ సిరీస్‌ను ముగ్గురూ ఆఖరి పోరాటంగా భావించి, గొప్ప ముగింపును ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి మెల్బోర్న్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టులో మిగతా ఇద్దరి విషయం ఎలావున్నా, అందరి దృష్టీ సచిన్‌పైనే కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘సెంచరీల సెంచరీ’కి కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్న సచిన్ ఈ టెస్టులోనే దానిని సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బ్యాటింగ్ విభాగంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్ మరో మైలురాయిని చేరుకోవడానికి తహతహలాడుతున్నాడు. వందో సెంచరీకి తొందర లేదని ప్రకటిస్తున్నప్పటికీ, సచిన్ ధ్యాస మొత్తం దీనిపైనే ఉంటుందనేది వాస్తవం. ఇంగ్లాండ్ టూర్‌లో అద్భుతంగా రాణించిన ద్రవిడ్,ఎన్నోసార్లు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన లక్ష్మణ్ కూడా తమతమ వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరి సామర్థ్యం యువ క్రికెటర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జట్టులోని జూనియర్ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం.సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లతో కలిసి ఆడడం, వారి నుంచి కళాత్మక బ్యాటింగ్‌లోని సొగసును ఆస్వాదించడం యువకులకు ఓ వరం. ముగ్గురు అతిరథ మహారథులు చెలరేగితే, వారిని కట్టడి చేయడానికి ఆసీస్ బౌలర్లు ఎంత కష్టపడాలో?.