మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా మరో వారంలో విడుదలవుతుందనే
తరుణంలో సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందనే
వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మహేష్ బాబు ఇదివరకెన్నడూ ఏ
హీరోయిన్ తో కూడా లిప్ లాక్ సీన్లలో నటించలేదు కాబట్టి తమ అభిమాన హీరో
తెరపై ముద్దు సరసం పండిస్తుంటే చూడాలని ఆశ పడుతున్నారు అభిమానులు. మరి
ముద్దు సీన్ వార్త నిజమా? కాదా?అనే సందేహంలో ఉన్న అభిమానులకు దర్శకుడు పూరి
జగన్నాధ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో
మాట్లాడుతూ...సినిమాలో మహష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ ఉందని కన్ ఫర్మ్
చేశారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ అనుమతి మేరకే ముద్దు సీన్ కు
ఓకే చేశాడని, సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఆ సీన్ పై ఆమె ఎలాంటి అభ్యంతరం
తెలుపకుండా ఓకే చెప్పిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా బిజినెస్ మేన్ జనవరి 13న
గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ బాబు చాలా
ఎక్సైటెడ్ గా ఉన్నారు. సినిమా ఈ సారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంలా
కనిపిస్తోంది ఆయన తన ట్విట్టర్లో రాసిన వ్యాఖ్యలు చూస్తుంటే. బిజినెస్ మేన్
సినిమా ఈ సారి బాక్సాఫీసును దున్నేస్తుందనే రేంజ్ లో మహేష్ బాబు తన
ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా సూపర్
రిలీజ్, అంతా కలిసి త్వరలోనే పండగ చేసుకుంటాం, జగన్ గారికి స్పెషల్
థాంక్స్, ఆయన తీసిని సినిమాల్లోనే ఈ సినిమా టాప్ పొజిషన్ కు వెలుతుంది, ఆయన
సినిమా ఇరగదీశాడు’ అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.పూరి
జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు-కాజల్ జంటగా నటించారు.
ఇందులో ఈ ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్ కూడా ప్లాన్ చేశారు. ఆర్ ఆర్ మూవీ
మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. జనవరి 13న వరల్డ్
వైడ్ గా తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2000 థియేటర్లలో ఈ
చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
బ్యూటీ కాంటెస్టుల్లో విజేతలుగా నిలిచిన చాలా మంది తారలు క్రమక్రమంగా తమ
అడుగులు సినిమా రంగం వైపు వేడయం పరిపాటే. సుష్మితా సేన్, ఐశ్వ్యరాయ్, దియా
మీర్జా, నిన్నటి తరం తార జుహి చావ్లా వీరంతా అందాల లోకం నుంచి
సినిమాలోకంలోకి వచ్చినవారే... మన తెలుగు గడ్డపై నుంచి మిస్ ఇండియాగా
నిలిచిన గద్దె సింధూర కూడా సినిమా రంగంలో తన అదృష్టాన్ని
పరీక్షించుకుంటోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇటీవల
మన రాష్ట్రం నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో టైటిల్ నెగ్గిన వాసుకి
సుంకవల్లి కూడా సినిమాలపై కన్నేసింది. అయితే గద్దె సిందూరలా చిన్న హీరోలతో
కాకుండా.....స్టార్ హీరో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే తన భవిష్యత్
బాగుంటుందనేది ఆమె ఆలోచనట. మహేష్ బాబు సరసన ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలు
సాగిస్తున్నప్పటికీ మహేష్ బాబు భార్య నమ్రత అందుకు సుముఖంగా లేదని ఫిల్మ్
నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు బ్యూటీక్వీన్లతో
నటించాలని కోరుకోవడం లేదని, ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఏ బ్యూటీని
ఆదరించలేదు అంటూ...ఈ ప్రతిపాదన మహేష్ బాబు వరకు రాక ముందే అటు నుంచి అటే
పంపించేస్తుందట.
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో మహేష్ బాబు-నమ్రత ఒకరు. ఇద్దరికీ సినీ
నేపథ్యం ఉండటంతో వీరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా టాలీవుడ్ లో హాట్
టాపిక్ అవుతోంది. ఆ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు కూడా
వినిపించాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి పలు సినిమా ఫంక్షన్లకు
కలిసి హాజరవుతుండటంతో అవన్ని పుకార్లే అని తేలి పోయింది. తాజాగా ఈ జంటకు
సంబంధించిన ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ఈ జంట
బాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించే యోచనలో ఉన్నారని, ఇందు కోసం
ముంబైలో తమకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టారని ఫిల్మ్ నగర్
గుసగుస. బహుషా దీని ద్వారానే మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం
ఉందని అంటున్నారు.
గూఢచారి 116
చిత్రంలో శోభన్ బాబు
గెస్ట్ రోల్ లో కనపడతారు. ఆ పాత్రను పవన్ చేత చేయించాలని ఆలోచన
చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మెహర్ రమేష్ వెళ్లి పనవ్ ని రిక్వెస్ట్
చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ పవన్ గ్రీన్ సిగ్నల్
ఇవ్వలేదని, ప్రాజెక్టు ప్రారంభమయ్యాక చూద్దామని దాటవేసినట్లు చెప్తున్నారు.
అయితే అన్నీ కలిసి వచ్చి ప్రాజెక్టు ప్రారంభమయితే పవన్ చేసే అవకాశముందని
చెప్తున్నారు. ఇక మహేష్ సైతం తాను ఇలాంటి మల్టిస్టారర్ చిత్రాల్లో
చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారు.పవన్ కళ్యాణ్,మహేష్ బాబు మంచి ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే
వీరిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా కాలంగా ఉంటోంది. కానీ ఏ
నిర్మాతకూ వీరిద్దరనీ భరించి తమ సినిమాలో పెట్టుకునే ధైర్యం లేదు. అయితే
అలాంటి విచిత్రమొకటి భవిష్యత్ లో జరిగే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో
వినపడుతోంది. మహేష్ బాబుతో త్వరలో మెహర్ రమేష్ గూఢచారి 116 చిత్రాన్ని
రీమేక్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.
బిజినెస్ మ్యాన్ ఆడియో డిసెంబర్ 23న జరగనుందనే సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి వైయస్ జగన్ వస్తాడని అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ లో ఆయనకు షేర్స్ ఉన్నాయని అందుకే వెంకట్ అతన్ని పిలుస్తున్నారని చెప్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని అలాంటిదేమీ లేదని చెప్తున్నారు.ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి
దూకుడు యాభై రోజులు పూర్తవ్వక ముందే తన కొత్త సినిమా బిజినెస్ మెన్ ట్రైలర్ పూర్తి రిలీజ్ చేసాడు. దీని తరువాత కూడా ఇదే స్పీడ్ లో దూకుడుగా ముందుకెలుతున్నాడు. జనవరిలో బిజినెస్ మెన్ రిలీజ్ అయిన వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో వెంకటేష్ తో కలిసి పాల్గొంటాడు.దీని తరువాత మహేష్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటివరకు మహేష్ సినిమాలలో యువరాజు లో తప్ప అన్ని సినిమాలలోనూ ఒక్కరే హీరోయిన్. అయితే మొదటి సారి మహేష్ తో కలిసి క్రిష్ దర్శకత్వం వచించే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఎవరా హీరోయిన్లు అన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.కాగా ఈ ముగ్గురు కథానాయికలను సెట్ చేయడం డైరెక్టర్ క్రిష్ కి అగ్ని పరీక్షలా తయారయ్యిందని తెలుస్తోంది