Showing posts with label పాలడైరీ. Show all posts
Showing posts with label పాలడైరీ. Show all posts

Thursday, 13 October 2011

అనంతపురానికి 500 మినీ డైరీలు

రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) కింద 25 శాతం సబ్సీడీతో ఇస్తున్న మినీ డెయిరీలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్‌చార్జి జేడీ డాక్టర్ జయకుమార్ కోరారు. 2011-12 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 500 మినీ డెయిరీలు మంజూరయ్యాయని.. వాటికి సంబంధించి దరఖాస్తులు, ఇతరత్రా వివరాలు సమీపంలోని పశువైద్యశాలలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.

500 మినీ డెయిరీలతో పాటు 630 పొట్టేళ్లపిల్లల పెంపకం యూనిట్ల కోసం సబ్సిడీ కల్పిస్తున్నామన్నారు. మండలాల వారీగా, బ్యాంకుల వారీగా లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం పెంపకానికి రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.  ప్రతి బుధవారం సాయంత్రం వేళ 08554-275161 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీతో పాటు ఏడీ డాక్టర్ సుధాకర్, పశువైద్యులు డాక్టర్ పెద్దన్న, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 



source: sakshi