Friday, 24 February 2012

ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలి..చంద్రబాబు డిమాండ్

 రిమాండ్ రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నున్న వెంకట రమణ ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.

No comments:

Post a Comment