Friday, 17 February 2012

రాలయసీమ జిల్లాలో వీఆర్వో,వీఆర్ఏ పరీక్షా కేంద్రాలు సెంటర్ల వారీగా ఏర్పాటు

ఒకవైపు శివరాత్రి వేడుకలు, మరోవైపు పల్స్‌పోలియో కార్యక్రమం... అదే సమయంలో ఈనెల 19న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో పొరపాట్లకు తావులేకుండా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. 58 వీఆర్వో పోస్టులకు 59,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 పట్టణాల్లో 219 సెంటర్లు ఏర్పాటయ్యాయి. వీఆర్‌ఏ రాత పరీక్ష కోసం 5,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. కర్నూలులో మాత్రమే 16 సెంటర్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులో 55020 మంది అభ్యరులు పరీక్షలు రాయనున్నారు. 15 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.మరో రెండురోజుల్లో జరగనున్న గ్రా మ రెవెన్యూ అధికారులు వీఆర్వో, గ్రామ రెవె న్యూ సహాయకుల వీఆర్ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రా లు జిల్లా కేంద్రానికి చేరాయి. గట్టి పోలీసు బందోబస్తు మధ్య రాష్ట్ర రాజధాని నుంచి ప్రశ్నపత్రాలు బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో  సీల్డ్ ట్రంకు పెట్టెలు,  సీల్డ్ బాక్సులను జిల్లా హుజూరు కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. 19న ఉదయం 6 గంటలకు ప్రశ్న పత్రాలను జిల్లాలోని పరీ క్షా కేంద్రాలకు పోలీసు బందోబస్తు తరలిం చనున్నారు.ఇందుకు తగిన విధంగా కేంద్రాల్లో సీటింగ్ అరెంజ్‌మెంట్లు చేస్తున్నారు. సెంటర్ల వారీగా పరీక్షా కేంద్రాలు, అక్కడ పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. .
.

గోవిందుని ఆంతర్యాలు పై టిటిడి ఉద్యోగులకు శిక్షణ

టిటిడి ఉద్యోగులకు ‘గోవిందుని ఆంతర్యాలు’ అనే అంశంపై శే్వతలో ఆ సంస్థ సంచాలకులు డాక్టర్ కెవి రామకృష్ణ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్నకాలంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా టిటిడి ఉద్యోగులు వారి విధుల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ‘గోవిందుని ఆంతర్యాలు ’అనే కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత యేడాది కాలంలో ఎన్నో కోర్సులను శే్వతాలో ప్రవేశపెట్టామన్నారు. ప్రత్యేక వృత్తికోర్సులనే కాకుండా జనరల్ ప్రోగ్రామ్స్, ఆలయ యాజమాన్యం, శాస్ర్తియ పరివర్తన, ఆరోగ్యం, యోగాథెరపి, పాలనా యాజమాన్యం, వక్తిత్వ వికాసం, క్రమశిక్షణ తదితర అనేక అంశాలపై తాము ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రవర్తనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ కొత్త కోర్సు ప్రవేశపెట్టామన్నారు. ఇందులో ఉద్యోగుల ప్రవర్తనా లోపంపై మరింత స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈకోర్సు ద్వారా సప్తగిరి విశిష్టత, శ్రీవారి గర్భాలయంలోని మూల మూర్తి, పరివారదేవతలు, వెంకటేశ్వరుని మహాత్మ్యం, శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, స్థానిక ఆలయాలు, ఆలయ చరిత్ర, ఆలయ ఆచార సాంప్రదాయాలు, శిల్పశోభ, కల్యాణోత్సవం, ఆలయ నియమాలు, శ్రీవారి సేవలో కళాకారులు, సాంప్రదాయాలు కట్టుబాట్లు, నిత్యార్చన, ఆగమ సాంప్రదాయం లాంటి అనేక అంశాలంటాయన్నారు. త్వరలో వ్యవహారికంగా తిరుమలలో వాడుకభాష అయిన తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో మాట్లాడే విధంగా ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చే విధానాన్ని త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు.

రూ. 1,45,854 కోట్లతో రాష్ట్ర బడ్జెట్


ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఇప్పటికే 1.42 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. 2014 నాటికి 15 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. విపత్తుల ప్రత్యామ్నాయ నిధి కింద రూ. 560.9 కోట్లు కేటాయింపు, రాజీవ్ యువకిణాలకు రూ. 777 కోట్లు కేటాయింపు, ఇందిరా జలప్రభకు రూ. 1800 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ. 1,075 కోట్ల వడ్డీలేని రుణాలు కేటాయిస్తున్నట్లు ఆనం తెలిపారు. ఆర్థిక వృద్ధి మందగించిందని ఆయన అన్నారు. ఉపాధికల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. 2005-2011లో వృద్ధి రేటు 9.26 శాతం ఉన్నట్లు ఆనం పేర్కొన్నారు.ప్రణాళికా వ్యయం రూ. 54.030 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 91.824 కోట్లు, రెవెవ్యూ మిగులు రూ. 4,440 కోట్లు, ద్రవ్య లోటు రూ. 20.008 కోట్లుగా అంచవేయడం జరిగినట్లు మంత్రి తెలిపారు.


  • హోంశాఖ రూ. 4832 కోట్లు
  • రాజీవ్ యువకిరణాలు రూ. 777 కోట్లు
  • మత్స్యకారుల భీమాకు రూ. 234 కోట్లు
  • ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 151 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
  • వ్యవసాయం రూ.2572 కోట్లు
  • ఇంధనం, విద్యుత్ శాఖ రూ. 5937 కోట్లు
  • గ్రామీణ ఉపాథి కల్పన రూ.188 కోట్లు
  • పాల కమిషన్ రూ. 100 కోట్లు
  • పశువుల వ్యాధి నిరోధకానికి రూ.50 కోట్లు
  • కార్మిక ఉపాధి శాఖ రూ.500 కోట్లు
  • రవాణా, రోడ్లు, భవనాలు రూ.5032 కోట్లు
  • పట్టణాభివృద్ధి రూ.6586 కోట్లు
  • సాంఘిక సంక్షేమ శాఖ రూ.2677 కోట్లు
  • సాంకేతిక విద్య రూ.1,087 కోట్లు
  • పట్టు పరిశ్రమ రూ.188 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖ రూ. 2302 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖ రూ. 88 కోట్లు
  • రచ్చబండ కార్యక్రమం రూ.1269 కోట్లు
  • క్రీడాభివృద్ధి రూ.220 కోట్లు
  • గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.3014 కోట్లు
  • మహిళ సంక్షేమ శాఖ రూ.3014 కోట్లు
  • వికలాంగుల సంక్షేమం రూ.66కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.489 కోట్లు
  • ప్రాథమిక విద్య రూ.15510 కోట్లు
  • సాంకేతి విద్య రూ.1087 కోట్లు
  • ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
  • నీటి పారుదల రూ.15010 కోట్లు
  • పరిశ్రమలు రూ.633 కోట్లు
  • వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.5889 కోట్లు
  • ఆర్టీసీకి రాయితీ రూ.710 కోట్లు

Thursday, 16 February 2012

శ్రీవారి పథకాలకు రూ. 12 లక్షల విరాళం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వివిధ పథకాలకు ఓ భక్తురాలు రూ. 12 లక్షల విరాళం సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల విభాగానికి చేరుకుని ఈ విరాళానికి సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ. పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి, నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష చొప్పున వినియోగించాలని అధికారులను కోరారు. శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామివారికి హైదరాబాదుకు చెందిన మహాలక్ష్మి అనే భక్తురాలు రూ.165 లక్షలు విలువచేసే ఆభరణాలను బుధవారం బహూకరించారు. కల్యాణ వెంకన్న ఉత్సవమూర్తికి ఉపయోగించేలా రాగి , నికిల్‌ , బంగారం తాపడంతో చేయించిన కాళంగి మర్ధనమ్‌ , వీణ , విల్లు , వేణువు , చర్నాకోలు , గద , ఖడ్గం తదితర 10 రకాల వస్తువులను ఆలయ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తాము ఈ వస్తువులను కానుకగా సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల విభాగానికి చేరుకుని ఈ విరాళానికి సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ. పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి, నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష చొప్పున వినియోగించాలని అధికారులను కోరారు.

తొలి దశ చికిత్స విజయవంతం ట్విట్టర్‌లో సందేశం... యువరాజ్

ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కణితిని తన శరీరం నుంచి తొలగించారని భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్‌కు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌లో కెమోథెరఫీ చికిత్స జరుగుతోంది. తొలి దశ చికిత్సలోనే కణితిని శరీరం నుంచి వేరు చేసినట్టు డాక్టర్ లారెన్స్ శుభవార్త తెలిపారని ట్విట్టర్‌లో వెల్లడించారు. చికిత్సలో రెండవ దశ ప్రారంభమైందన్నారు. తొలి దశ చికిత్సలోనే కణితిని శరీరం నుండి వేరు చేసినట్లు డాక్టర్ లారెన్స్ తనకు శుభవార్తను తెలిపారని ట్వీట్ చేశాడు. ఇక్కడ నుండి కెమోథెరపీ‌లో రెండవ చికిత్సను ప్రారంభిస్తారని అన్నాడు. ఇది ఇలా ఉంటే ఊపిరితిత్తుల బీణ కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ సందేశం పంపాడు. ప్రస్తుతం యువీ అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే. లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ పంపిన సందేశాన్ని యువరాజ్ తన ట్విట్టర్ పేజిలో లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఫోటోతో సహా అభిమానులకు తెలిసేలా పెట్టాడు.లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ యువీకి పంపిన సందేశం ఏమిటంటే 'నీ కోసం మా 'లివ్‌స్టాంగ్' టీమ్ మొత్తం ఉందనే విషయం నీకు తెలియాలని కోరుకుంటున్నాం. విజ్ఞానం శక్తి వంతమైనది, ఐకమత్యమే మహాబలం, మన దృక్పధం అన్నింటికన్నా కీలకం అని నేను తరచూ చెబుతుంటాను.. నమ్ముతాను కూడా' అని సందేశాన్ని పంపాడు. సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా లివ్‌స్టాంగ్ ఫౌండేషన్‌ని స్ధాపించి తగిన సహాయాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు లాన్స్ సందేశంపై యువీ కృతజ్ఞతలు తెలిపాడు. లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ నుండి వచ్చిన సందేశం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ లాన్స్.. త్వరలోనే మనం కలుసుకోవాలని కోరుకుంటున్నా.. అని యువరాజ్ ట్వీట్ చేశాడు.

జగన్ రాజకీయ శత్రువే...కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ తమకు శత్రువేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు. టిడిపి ఎంతటి శత్రువో, జగన్ కూడా అంతటి శత్రువేనని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ శాసనభ్యులకు గురువారం సాయంత్రం మార్గనిర్దేశం చేశారు. వైయస్ జగన్‌పై ఎందుకు మెతగ్గా వ్యవహరిస్తున్నారని కొంత మంది శాసనసభ్యులు కిరణ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను నిలదీశారు. పార్టీని వదిలి వెళ్లిన తర్వాత జగన్‌ను రాజకీయ శత్రువుగానే చూడాలని, ఇందులో ఎవరికీ ఏ విధమైన సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు రాజకీయ ప్రత్యర్థేనని ఆయన అన్నారు. పార్టీని బలహీనపరిచేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దీనిపై మూడు నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తమకు మద్దతు పలికే మీడియా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను ఖండించడానికి నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు విధిగా సభకు హాజరు కావాలని ఆయన సూచించారు. సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, మంత్రులను అడిగి విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.

కడప - బెంగళూరు రైల్వే లైను

ఎంతో కాలంగా రైల్వే ప్రయాణికులు ఎదురు చూస్తున్న కడప - రైల్వే లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి రైల్వే బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎ. సాయిప్రతాప్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన రైల్వే బడ్జెట్ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఫోన్‌లో ఆయన మాట్లాడారు. కడప - బెంగళూరు రైల్వేలైన్ పనులు వెంటనే చేపట్టేందుకు రాష్ట్రం 100 కోట్లు, కేంద్రం 100 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నందలూరులోని లోకో షెడ్ 200 ఎకరాల భూమి, 150 గృహాలున్నాయని, ఒకప్పుడు రైల్వేకు నందలూరు కీలక కేంద్రంగా ఉండేదని ఇప్పుడు నిరాధరణకు గురైందన్నారు. నందలూరు లోకో షెడ్‌పై ప్రత్యేక దృష్టితో రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలపారు. ప్రస్తుతం కడప మీదుగా వారంలో రెండు రోజులు రాకపోకలు సాగించే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు రాకపోకలు ఉండేలా క్రమబద్ధం చేసి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే కడప ఎర్రముక్కపల్లె రైల్వే రోడ్డు ఓవర్ 6 బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే బడ్జెట్‌లో 15 కోట్లు ఇవ్వాలని కోరారు