ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఇప్పటికే 1.42 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. 2014 నాటికి 15 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. విపత్తుల ప్రత్యామ్నాయ నిధి కింద రూ. 560.9 కోట్లు కేటాయింపు, రాజీవ్ యువకిణాలకు రూ. 777 కోట్లు కేటాయింపు, ఇందిరా జలప్రభకు రూ. 1800 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ. 1,075 కోట్ల వడ్డీలేని రుణాలు కేటాయిస్తున్నట్లు ఆనం తెలిపారు. ఆర్థిక వృద్ధి మందగించిందని ఆయన అన్నారు. ఉపాధికల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. 2005-2011లో వృద్ధి రేటు 9.26 శాతం ఉన్నట్లు ఆనం పేర్కొన్నారు.ప్రణాళికా వ్యయం రూ. 54.030 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 91.824 కోట్లు, రెవెవ్యూ మిగులు రూ. 4,440 కోట్లు, ద్రవ్య లోటు రూ. 20.008 కోట్లుగా అంచవేయడం జరిగినట్లు మంత్రి తెలిపారు.
- హోంశాఖ రూ. 4832 కోట్లు
- రాజీవ్ యువకిరణాలు రూ. 777 కోట్లు
- మత్స్యకారుల భీమాకు రూ. 234 కోట్లు
- ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 151 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
- వ్యవసాయం రూ.2572 కోట్లు
- ఇంధనం, విద్యుత్ శాఖ రూ. 5937 కోట్లు
- గ్రామీణ ఉపాథి కల్పన రూ.188 కోట్లు
- పాల కమిషన్ రూ. 100 కోట్లు
- పశువుల వ్యాధి నిరోధకానికి రూ.50 కోట్లు
- కార్మిక ఉపాధి శాఖ రూ.500 కోట్లు
- రవాణా, రోడ్లు, భవనాలు రూ.5032 కోట్లు
- పట్టణాభివృద్ధి రూ.6586 కోట్లు
- సాంఘిక సంక్షేమ శాఖ రూ.2677 కోట్లు
- సాంకేతిక విద్య రూ.1,087 కోట్లు
- పట్టు పరిశ్రమ రూ.188 కోట్లు
- గృహ నిర్మాణ శాఖ రూ. 2302 కోట్లు
- సాధారణ పరిపాలన శాఖ రూ. 88 కోట్లు
- రచ్చబండ కార్యక్రమం రూ.1269 కోట్లు
- క్రీడాభివృద్ధి రూ.220 కోట్లు
- గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.3014 కోట్లు
- మహిళ సంక్షేమ శాఖ రూ.3014 కోట్లు
- వికలాంగుల సంక్షేమం రూ.66కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.489 కోట్లు
- ప్రాథమిక విద్య రూ.15510 కోట్లు
- సాంకేతి విద్య రూ.1087 కోట్లు
- ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
- నీటి పారుదల రూ.15010 కోట్లు
- పరిశ్రమలు రూ.633 కోట్లు
- వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.5889 కోట్లు
- ఆర్టీసీకి రాయితీ రూ.710 కోట్లు
No comments:
Post a Comment