మంత్రులు
చెప్పినట్లు చేయడానికి ఐఏఎస్ అధికారులేం చిన్న పిల్లలు కాదని మాజీ మంత్రి,
అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్
రెడ్డి ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. మంత్రులు చెప్పినట్లు తాము చేశామని
చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ బాధ్యత లేదని చెప్పడం
సరికాదన్నారు. మంత్రుల బాధ్యత ఉందని చెబుతున్న ఐఏఎస్ అధికారుల ఏ మంత్రి
అవినీతికి పాల్పడ్డారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆపద వచ్చిందని
మంత్రుల పైకి తప్పు నెట్టేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి
తలెత్తడం దురదృష్టకరమన్నారు. మేం ఎన్నిక ఎలెక్ట్ అయిన వారమని, వారు
సెలెక్ట్ అయిన వారని, ఇరువురం ప్రజా సేవ కోసమే ఉన్నామన్నారు. తాము చిన్న
చేపలమని వారు ఒప్పుకున్నారు కదా అని అన్నారు.
కాగా అంతకుముందు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్
విజయవాడలో ఐఏఎస్‌ల తీరును తప్పు పట్టిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల్లాగే
ఐఏఎస్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే
నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్
అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు.
అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక
సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు.
చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.
Sunday, 5 February 2012
యువరాజ్ సింగ్ కు క్యాన్సర్
భారత క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. భారత జట్టు డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్
సింగ్ అభిమానులకు ఇది మరింత ఆందోళన కలిగించే వార్త. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన అమెరికాలో కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. భారత్ కు మరోసారి ప్రపంచకప్ వచ్చేందుకు కారణమయిన యువరాజ్ సింగ్ ఆ తరువాత క్యాన్సర్ ఉందని తెలిసినట్లు సమాచారం.
మార్చి వరకు ఆయనకు కీమోథెరపి చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ మొదటి దశలోనే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదంలేదని యువీ వ్యక్తిగత వైద్యుడు చెబుతున్నాడు. కీమోథెరపీ చికిత్స మూడుదశల్లో జరుగుతుందని వైద్యుడు జతిన్ చౌదరి చెబుతున్నారు. తన ఆటతీరుతో, అందచందాలతో బాలీవుడ్ భామల మనసులు దోచుకున్న యువరాజ్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ ఉందన్న వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్ లోనే గుండెకు, ఊపిరితిత్తుల మధ్య వైద్యులు కణితిని గుర్తించారు. అయితే అది అంత ప్రమాదకరం కాదని మొదట అనుకున్నారు. క్రమేణా అది ఇబ్బందిగా మారడంతో చికిత్సను ప్రారంభించారు.
దీనికి సంబంధించి నమస్తే రాయలసీమ .కం గతంలోనే ఓ వార్తను ప్రచురించింది. ఆ వార్త లింక్ ఇది ... archive story
Thursday, 2 February 2012
బాలయ్య దేశ వ్యాప్తంగా...!
బాలయ్య నటించిన పౌరాణిక సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం
తెలిసిందే గత నెల ఈ సినిమా 50 రోజుల వేడుక కూడా జరుపుకుంది. ఈ సినిమాను
మలయాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత యలమంచిలి
సాయిబాబు. ఏప్రిల్ 14న మలయాళీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ
సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్
కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంతటితో ఆగకుండా ఈ సినిమాను
హిందీ, ఇంగ్లీష్ లలో కూడా అనువదించి దేశం మొత్తం ఈ సినిమాను మార్కెట్
చేయాలని చూస్తున్నారు నిర్మాత. అదే జరిగితే ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన
బాపు పేరు, బాలకృష్ణ, నయనతారల పేర్లు దేశం మొత్తం మారుమ్రోగనున్నాయి.
పాల ధరలకు రెక్కలొచ్చాయి
ఏడాది కాలంలో మూడు పర్యాయాలు ప్రైవేటు డెయిరీలు
పాల ధరలను పెంచి వినియోగదారుల నెత్తిన భారం మోపాయి. ఏటా ఇతర డెయిరీలకన్నా
రూపాయి అదనంగా పెంచే హెరిటేజ్ కంపెనీ తాజాగా లీటరు పాలుపై రూ.4 పెంచింది.
దీంతో ఇతర డెయిరీలు తామేమీ తక్కువ కాదంటూ హెరిటేజ్ కంపెనీ విధానాన్ని అమలు
చేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే హెరిటేజ్‌తో పాటు
జిల్లాలోని మరో 8 డెయిరీలు కూడా లీటరు రూ.26 ఉన్న పాలధరలను రూ.30కి
పెంచాయి. 3.0 శాతం కొవ్వు, 8.5 వెన్నశాతం ఉన్న లీటర్ పాలను రూ. 30
(రీటైల్ ధర) లకు విక్రయిస్తున్నారు. పాల సేకరణ ధరను పెంచకుండా ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు పబ్బం
గడుపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మార్చి నుంచి మే
నెలాఖరు వరకు పాలసేకరణ ఆశించిన స్థాయిలో ఉండదని ప్రైవేటు డెయిరీలు
భావిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పాలసేకరణ ధర
పెంపును పక్కన బెట్టి ఉత్పత్తుల విక్రయ ధరలను మాత్రం పెంచాశాయి. చాలా
ప్రైవేటు డెయిరీలు లీటర్ నాణ్యమైన పాల సేకరణకు రూ. 14 నుంచి 19 వరకు
మాత్రమే చెల్లిస్తున్నాయి.జిల్లాలో పాలిచ్చే ఆవులు,
గేదెలు 5.80 లక్షలు ఉన్నాయి. 48 ప్రైవేటు డెయిరీలు, 101 బల్క్‌మిల్క్
సెంటర్‌ల ద్వారా రోజుకు దాదాపు 18 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. 3
లక్షల లీటర్లు స్థానిక పాల వ్యాపారులు విక్రయిస్తున్నారు. మిగిలిన 15 లక్షల
లీటర్ల పాలను ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు కొవ్వు(ఫ్యాట్), వెన్నను
తీసివేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ
నిర్వహణలోని డెయిరీలు మినహా మిగిలిన 48 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ
రేటును అనధికారికంగా పెంచేశాయి. సాధారణంగా పాలసేకరణ, విక్రయధరల నిర్ణయం
ప్రభుత్వ సమక్షంలో నిర్ణయించాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండానే
గుట్టుచప్పుడు కాకుండా ధరలను పెంచేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని బాలాజీ, ఏపీ
డెయిరీలు లీటర్ పాలను రూ. 28కు విక్రయిస్తున్నాయి.అనంతపురం జిల్లాలో వజ్రాలపై అంతర్జాతీయ సదస్సు
స్థానిక జియలాజికల్ సర్వే ఆఫ్‌ఇండియా(జీఎస్‌ఐ) వజ్రాల
పరిశోధన కేంద్రంలో
గురువారం నుంచి రెండు రోజుల పాటు వజ్ర పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు జర
గనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.వారి కోసం
వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. వజ్రాలు ఎలా లభిస్తాయి? వజ్రాల
ముడి ఖనిజమైన కింబర్‌లైట్ ఎలా ఉంటుంది ? అందులో ఎన్ని రకాలు ఉంటాయి?
నాణ్యతను గుర్తించడం ఎలా ? వ్యాపారపరంగా సాధ్యమా.. కాదా? తదితర అంశాలపై
శాస్త్రవేత్తలు సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముడిఖనిజాన్ని
ప్లాంట్‌కు తరలించిన తరువాత వజ్రాలు ఎలా వెలికితీస్తారు? అప్పుడు ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను జూనియర్ జియాలజిస్టులకు సీనియర్
శాస్తవేత్తలు వివరించే అవకాశముంది.
రేపట్నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల ఆం దోళనల నేపథ్యంలో.. ఇంటర్ ప్రాక్టికల్
పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి ఈనెల 25వ తేదీ
వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 6,33,571 మంది
విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. అందులో 4,85, 356 మంది
జనరల్, 1,48,215 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వివరాలను ఇంటర్ బోర్డు
సెక్రెటరీ ఒక ప్రకటనలో విడుదల చేశా రు. పరీక్షలకు
ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
రోల్ నెంబర్లు, బ్యాచ్ లు, టైమ్-టేబుల్ సహా హాల్ టికెట్ల ముద్రణ,
అభ్యర్థులకు పంపిణీ పూర్తయ్యాయి. అభ్యర్థులు తమ బ్యాచ్‌ని మార్చుకునేందుకు
అవకాశం లేదు. జాతీయ క్రీడలకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రం ఇందుకు
మినహాయింపు ఉంటుంది. 'సమ్మక్క-సారల మ్మ' జాతర రూట్లలో ఉన్న కాలేజీల్లో
ప్రాక్టికల్ పరీక్షలను జాతర అనంతరం నిర్వహిస్తారు. సెంటర్ల వద్ద
ర్యాండమ్‌గా వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా..
ఎస్పీ వైస్ ఛైర్మన్‌గా.. ఆర్జేడీ, డీవీఈవో ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఒక
సీనియర్ ప్రిన్సిపాల్ మెంబర్‌గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
మాల్ ప్రాక్టీస్ జరిగిన సెంటర్లలో రీఎగ్జామ్ నిర్వహణకు ఆదేశించే అధికారం ఈ
కమిటీకి ఉంటుంది. పనిచేసే కాలేజీల్లో/అదే యాజమాన్య కాలేజీలో ప్రాక్టికల్
పరీక్షల విధులు నిర్వహించకుండా ఎగ్జామినర్లను జంబ్లింగ్ చేస్తున్నారు.
ప్రతి 20 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా
కాలేజీలో 25 శాతం మందికిపైగా విద్యార్థులకు 100శాతం మార్కులు వస్తే.. ఆయా
విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్టును రీవెరిఫికేషన్ చేస్తారు. మూల్యాంకనం
అనంతరం 27 నుంచి 30 మార్కుల మధ్య స్కోర్ సాధిస్తే మిగతా వారి ఆన్సర్
స్క్రిప్టులను కూడా రీవెరిఫికేషన్ చేస్తారు.నాలుగు విడతల్లో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం 2,708 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11,456 మంది ఎగ్జామినర్లను నియమించారు. మొదటి విడత 3వ తేదీ నుంచి నుంచి 8వరకు, రెండో విడత 9 నుంచి 13 వరకు, మూడో విడత 14 నుంచి 18 వరకు, నాలుగో విడత ప్రాక్టికల్స్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. మిలాద్ నబీ కారణంగా ఈ నెల 5న, వీఆర్వో పరీ క్ష కారణంగా 19న, శివరాత్రి కారణంగా 20న పరీక్ష ఉండదు.
Tuesday, 31 January 2012
కెప్టెన్సీ నుండి తోలగించినా నేను సిద్దం...!మహేంద్ర సింగ్ ధోని
తన బరువు బాధ్యతల మీద సంపూర్ణ అవగా హన కలిగిన వ్యక్తి ధోనీ. ఏ
కెప్టెన్‌కైనా కష్టనిష్ఠూ రాలు సహజం. ఆడినా ఆడలేక పోయినా వికెట్లు తీయ
లేకపోయిన సహచరులను పల్లెత్తుమాట అనకుండా తనకు కావాల్సింది ఇతరుల నుంచి
రాబట్టుకోగల నేర్పరి ధోనీ. ఓటమి ఎదురవుతున్న స్థితిలోనూ మహీ నిరాశకులోనైన
సందర్భం ఒక్కటీ నేను చూడలేదు. సంయమనంతో వ్యవహరిం చడమనేది ధోనీకి ఉన్న గొప్ప
లక్షణం.అన్ని విభా గాల్లోనూ ఆటగాళ్లను సక్రమంగా వినియో
గించుకోగలిగాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్, కెప్టెన్ అవతారాల్లో ధోనీ
మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఊహించండి. ధోనీయే అత్యుత్తమ
కెప్టెననేది నా అభిప్రాయం అని అంశు మన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. భారత్
వరుస పరాజయాలకు ఒక్క ధోనీనే నిందించడం తగదు. కానీ ఓటమికి జట్టుతో సహా
జవాబుదారీగా నిలవాలని అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.ఆస్టేలియా టెస్టు సిరిస్‌లలో టీమిండియా ఓటిమికి భాద్యత వహిస్తూ తాను తన
కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.ఇంగ్లాండ్, ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు టీమిండియా జట్టు
కెప్టెన్‌గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ
టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు. ఇంగ్లాండ్, అంతేకాకుండా
ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా
భావించడం లేదు. సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా
ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.
టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్‌ని అందించిన అత్యత్తుమ కెప్టెన్‌గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్‌కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్‌లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్‌లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్‌లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్‌లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్‌గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.
టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్‌ని అందించిన అత్యత్తుమ కెప్టెన్‌గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్‌కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్‌లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్‌లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్‌లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్‌లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్‌గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.
Subscribe to:
Posts (Atom)

