ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసుల్లో 2296 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది
Thursday, 3 November 2011
2296 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసుల్లో 2296 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది
మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను- చిరంజీవి
పార్టీ అధిష్టానం తనకు ఏ పదవి ఎక్కడ ఇచ్చినా స్వీకరిస్తానని తిరుపతి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం అన్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. మంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
తిరుపతిలో రూ.20 కోట్లతో శాశ్వతంగా తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చిరంజీవి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తమ సమస్యలను ఆయనకు విన్నవించుకుందామని వస్తే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు

రామ్ చరణ్ బాలకృష్ణ వార్
శ్రీరామరాజ్యం ఆడియో కార్యక్రమంలో తాను రామ్ చరణ్‌ను ఉద్దేశించి అనలేదని వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో బాలకృష్ణ విరవరణ ఇచ్చారు. తాను చిరింజీవి అన్యోన్యంగా ఉంటామని, తాను ఎవరి గురించి వ్యాఖ్యానించానో చిరంజీవి, మోహబాబులకు తెలుసునని బాలకృష్ణ తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే తట్టుకోలేనని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై తెలంగాణ వ్యతిరేక ముద్రవేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తపరిచారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తానని బాలకృష్ణ చెప్పారు.

Wednesday, 2 November 2011
అనంతపురం జిల్లా లో చంద్రబాబు పాదయాత్ర
ని త్యం కరువుతో సతమతమవుతున్న రై తులకు అండగా టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్రకు శ్రీ కారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరు వు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు తలపెట్టిన ఈ పాదయాత్రకు అనంతపురం జిల్లానుంచి బుధవారం ప్రారం భం కానుంది. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంత రైతులకు బా సటగా ఈ యాత్ర సాగనుందని టీడీ పీ శ్రేణులు వెల్లడించాయి. అనంతపు రం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని సీసీ కొత్తకోట గ్రామం నుంచి( ధర్మవరం- పుట్టపర్తి రహదారిపై) చంద్రబాబు పాదయాత్ర సాగుతుం ద ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కా ల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీ కే పార్థసార«థి తెలిపారు.
సీసీకొత్తకోట గ్రామం నుంచి మొదలయ్యే చంద్రబాబు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని బసంపల్లి, కనముక్కల, వె ల్దుర్తి, ఆముదాలకుంట క్రాస్, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొడపగానిపల్లి, మైలేపల్లి, కొత్తచెరువు వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కరువు అనగానే గుర్తుకు వచ్చే అనంతపురం జి ల్లానుంచి ఈ యాత్రకు శ్రీకారం చు ట్టాలని టీడీపీ శ్రేణులు భావించాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధం గా ఆరు సంవత్సరాలు వరుస కరువులు వచ్చాయని, దీంతో వ్యవసా యం చేయడం అలా ఉంచితే బతుకే భారమైన పరిస్థితి రైతాంగంలో నెలకొంది.
దీంతో రైతులకు అండగా ని లిచి వారి కష్టాలు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రై తు సమస్యలపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకు ని టీడీపీ నేతలు జనసమీకరణలో ము నిగిపోయారు. చంద్రబాబు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లులో టీ డీపీ నేతలు తలమునకలయ్యారు
Tuesday, 1 November 2011
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గోల్డ్ మెడల్ గ్రహిత
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలంపిక్ గోల్డ్ మెడల్ గ్రహిత అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం దక్కింది. ధోని, బింద్రాలకు టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అందజేశారు. సౌత్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమానికి ధోని, బింద్రాలు హాజరయ్యారు.
బాలయ్య కొన్ని విమర్శలు
నందమూరి హీరో బాలయ్య నటించిన ‘శ్రీరామ రాజ్యం’ ఆడియో అభినందన సభ సోమవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య కొన్ని విమర్శలు సంధించారు. "చరిత్ర తెలియని వారు తెలుగు సినిమాల గురించి చాలా చిన్నతనంగా మాట్లాడారు. ఒకాయన మాట్లాడుతూ.. తెలుగులో ఏమున్నాయండి.. సరైన సినిమాలు.. సరైన డైరెక్టర్లే లేరు... అంటూ ఏదోదే వాగాడు. నేను వెంటనే... చరిత్ర తెలియకుండా మాట్లాడకు. మాట్లాడేముందు నోరు కంట్రోల్ చేసుకో! మీకు తెలుగు దర్శకుల గురించి మాట్లాడే హక్కులేదు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు తీసింది తెలుగువారు కాదా?" అని అన్నారు
.
ఈ వాఖ్యలు మెగా వాసరుడు రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నవే అనే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో..., సూర్య, మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'సెవెన్త్ సెన్స్' సినిమా ప్రమోషన్‌లో మురుగదాస్‌ను, సూర్యను పొగడ్తల్తో ముంచెత్తాడు రామ్ చరణ్. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు కూడా ఇటువంటి పాత్రలు చేయడం సూర్యకే సాధ్యం. మాకు సాధ్యం కాదంటూనే... మురుగదాస్ వంటి గొప్ప దర్శకుడు తెలుగులో లేరు అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడు బాలయ్య రామ్ చరణ్, అల్లు అర్జున్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నిన్న రాత్రి బాలయ్య ఇదే విషయాన్ని లేవనెత్తడంతో.....సర్వత్రా
చర్చనీయాంశమైంది

శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు
వెండితెరపై రాముడంటే ఎన్టీవోడే. మరి, బాలయ్య ఎలా ఉంటాడు? ఇప్పటికే కృష్ణుడిగా మెప్పించిన బాలకృష్ణ శ్రీరాముడి గెటప్‌లో వెలిగిపోతున్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తోంది. వెండితెర అందగాడు బాలకృష్ణ రాముడి వేషమిది. శ్రీరామరాజ్యం స్టిల్స్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య కేక పెట్టిస్తున్నాడు. రామాయణ ఘట్టాల్ని తెరకెక్కించడంలో తనదైన స్టైల్‌ని కనబరిచే అగ్రశ్రేణి దర్శకుడు బాపు నిర్దేశకత్వంలో బాలయ్య అలరిస్తున్నాడు

ఆహార్యంలో..., వేషధారణలో... నఖశిఖ పర్యంతం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. రొటీన్ సినిమాల నుంచి భిన్నంగా శ్రీరామరాజ్యం నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. నవ్యతకు కొదవలేని సృజనాత్మక సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని, గతాన్ని ఓసారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని బాలయ్య అన్నారు. బాలయ్యతో పాటు లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార పాత్రల్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించారని చిత్ర యూనిట్ చెప్తోంది. శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది

Subscribe to:
Posts (Atom)