Wednesday, 29 February 2012

ఏప్రిల్ నుంచి సచిన్‌కు మంచిరోజులు

సచిన్ టెండూల్కర్‌కు 39వ పడిలోకి అడుగుపెడితే అతనికిక అన్నీ మంచిరోజులేనని కేరళకు చెందిన ఎంకే దామోదరన్ అనే ఓ జ్యోతిష్కుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజని, ఆ రోజు తర్వాత అతను వందో శతకం సాధించేస్తాడని అన్నాడు. రాబోయే ఏడాదికాలంలో సచిన్ శతకాల సంఖ్య 102కు చేరుతుందని కూడా చెబుతున్నాడు. కాబట్టి సచిన్ తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించకూడదన్నాడు. భారత జ ట్టు 2011 వరల్డ్‌కప్ గెలుస్తుందని ముందే చెప్పానన్నాడు.

అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగం...వైయస్ విజయమ్మ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏమైనా కక్ష ఉంటే తమపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అసెంబ్లీలో అన్నారు. ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. వైయస్ కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి పైన కక్ష ఉంటే మాపై తీసుకోండి కానీ ఆయన పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కాదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఎందుకు నడపలేక పోతుందన్నారు. పెట్రోలు, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో అందరికీ తెలుసన్నారు.దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం బాధకరమని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా నడిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంను ఆమె గుర్తు చేసుకున్నారు. బరువైన హృదయంతో.. ఉద్వేగంగా పదిహేను నిమిషాలపాటు మాట్లాడిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులు శ్రద్దగా విన్నారు. ప్రజా సమస్యలపై విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశంసించారు.
 

వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేయను... జేసీ దివాకర్‌రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీని చూస్తుంటే భరించలేకపోతున్నానని, శాసనసభకంటే రాజ్యసభే బాగుందని, అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని జేసీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుండి పోటీ చేయనని దివాకర్‌రెడ్డి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభకు తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల వేటు విషయమై స్పీకర్ చూసుకుంటారని జేసీ పేర్కొన్నారు.

Tuesday, 28 February 2012

ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తాం....జెసి దివాకర్ రెడ్డి

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తున్నట్టు తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం మాత్రం సబబేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిర్ణయం ఎప్పుడో చెప్పలేమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగుంటుంది ఆయన అభిప్రాయపడ్డారు.కాగా తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మండలి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే దిశలో ఆలోచిస్తుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణవాదులు మాత్రం తమకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లు అవసరం లేదని తెలంగాణ రాష్ట్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలకు తాము ఆమోదించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.


 

బాలయ్యతో సినిమా చేయడం లేదు...వైవిఎస్ చౌదరి

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ‘కామన్ మ్యాన్’ చిత్రం రూపొంద బోతోందని, దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి బ్యానర్‌పై నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పలు టీవీ ఛానళ్లలో కూడా జోరుగా ప్రచారం మొదలైంది. రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందని, త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్సవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు అభిమానులను కూడా ఊత్సాహ పరిచాయి.అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ వార్తలను వైవిఎస్ చౌదరి ఖండించారు. తాను బాలకృష్ణతో గానీ, కృష్ణ వంశీతో గానీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదని....‘సీఎం(కామన్ మ్యాన్)’ సినిమా తాను నిర్మిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ సినిమాతో తనకు గానీ, బొమ్మరిల్లు బ్యానర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వైవిఎస్ చౌదరి స్పష్టం చేశారు.


 

అనంతపురం జిల్లాకు జాతీయ అవార్డు

ఓటరు గుర్తింపుకార్డుల జారీలో మొదటిసారి వందశాతం పూర్తీచేసినందుకు భారత ఎన్నికల కమిషన్ జిల్లాకు జాతీయ అవార్డు ప్రకటించింది. ఈమేర కు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 2011 లో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాప్రప్రథమంగా వందశాతం ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తీ చే సింది.దీంతో రాష్ట్రంలో మొదటిసారి అనంతపురం జిల్లాలో వందశాతం ఓ టరు గుర్తింపు కార్డుల జారీ జరిగింది. ఈ ఘనత సాధించినందుకు ప్రస్తుత రాష్ట్ర పురపాలక సంఘం డైరెక్టర్ జనార్థన్‌రెడ్డిని ఎన్నికల కమిషన్ ప్రశంసించింది. తాను పనిచేసిన సమయంలో జిల్లాకు జాతీయ అవార్డు రావటం గర్వకారణంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సర్వీసు రికార్డులో ఈ విషయాన్ని చేర్చామని ఎన్నికల కమిషన్ సూచించటం ఆనందం కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపే తం చేయటంతో పాటు ఎన్నికల సక్ర మ నిర్వాహణకు దోహదపడే గుర్తింపు కార్డుల జారీని సమర్థవంతంగా నిర్వహించగలిగింది. 2011లో అప్పటి కలెక్టర్ జనార్థన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వందశాతం గుర్తింపుకార్డులు జారీచేయాలని యంత్రాంగంతో ప్రణాళిక రూపొందించి పని చేయించా రు.

కోహ్లీని యువరాజ్ సింగ్ అభినందించారు.

భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌పై యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అమెరికాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న యువరాజ్.. 86 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీని అభినందించారు. చీకూ(సపోటా పండు) కోహ్లీది గ్రేట్ ఇన్నింగ్స్ అని.. నిద్రకు ముందు సపోటా జ్యూస్‌ను తీసుకో అంటూ ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. బొస్టన్‌లో చికిత్స పొందుతున్న యువరాజ్‌ను గతవారంలో అలాగే తన స్నేహితుడు, నటుడు రణ్‌విజయ్ సింగ్ కూడా ఈ విధంగానే యువీ దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఇద్దరూ కలిసి 'అందాజ్‌ అప్నా అప్నా' మూవీ చూశామని యువీ అన్నాడు. క్యాన్సర్‌ కణితికి కీమోతెరపీ తీసుకుంటున్న యువీ ఆరోగ్యం రోజురోజుకూ కుదుటపడుతోంది. తొలి దశ కీమోతెరపీ తర్వాత కణితి దాదాపు పోయిందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్‌ లారెన్స్‌ రిపోర్టు ఇచ్చాడు. ఇప్పుడు రెండో దశ కీమోతెరపీ జరుగుతోంది. మార్చి చివరి కల్లా యువీ కీమోతెరపీ ముగుస్తుందని మే నెల లోపు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని అన్నారు.