Showing posts with label పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ. Show all posts
Showing posts with label పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ. Show all posts

Wednesday, 29 February 2012

అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగం...వైయస్ విజయమ్మ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏమైనా కక్ష ఉంటే తమపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అసెంబ్లీలో అన్నారు. ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. వైయస్ కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి పైన కక్ష ఉంటే మాపై తీసుకోండి కానీ ఆయన పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కాదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఎందుకు నడపలేక పోతుందన్నారు. పెట్రోలు, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో అందరికీ తెలుసన్నారు.దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం బాధకరమని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా నడిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంను ఆమె గుర్తు చేసుకున్నారు. బరువైన హృదయంతో.. ఉద్వేగంగా పదిహేను నిమిషాలపాటు మాట్లాడిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులు శ్రద్దగా విన్నారు. ప్రజా సమస్యలపై విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశంసించారు.
 

Wednesday, 15 February 2012

వైయస్ విజయమ్మ రాజ్యసభకు పోటీ?

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ బరిలోకి తన తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసు పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. వచ్చే నెల మూడో వారంలో ఎన్నికలు జరుగుతాయి. తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసేలా స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెంచడమే వారి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించినప్పుడు తమకు చెందిన 17 స్థానాలకు ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశారు. ఏడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని రచించారని విమర్శిస్తున్న వారు స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడుగా వారు వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. అనర్హత వేటులో స్పీకర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై వైయస్ జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పది మంది శాసనసభ్యులు రాజ్యసభ అభ్యర్థిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 17 మంది మద్దతుతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది కాబట్టే కాంగ్రెసును ఓడించడమే లక్ష్యంగా తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉన్న మరి కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడా కూడగట్టుకోవచ్చుననేది ఆలోచనగా చెబుతున్నారు

Monday, 5 December 2011

వైఎస్ విజయమ్మ వెంట 19 మంది ఎమ్మెలు

కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా ఆమె సభకు హాజరయ్యారు. ఆమె వెంట జగన్ వర్గం ఎమ్మెలు 19 మంది సభకు చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు సుచరిత, కొండ సురేఖ దగ్గరుండి వైఎస్ విజయమ్మను సభలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జోహార్‌ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం తమ పార్టీ  ఎమ్మెల్యే లను బెదిరిస్తుందని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డబ్బును, పదవుల్ని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఎరగా చూపుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు