Thursday, 16 February 2012

శ్రీవారి గరుడసేవ ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీనివాసమంగా పురంలోని కల్యాణ వెం కన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి వారికి గరుడ వాహన సేవ జరగనున్నది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కల్యాణ వెంక న్న ఆలయ పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, ఉచిత లడ్డూల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.గరుడ వాహనానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నారు. అలాగే శ్రీవారి ఆలయంతో పాటు పరిసరాల్లో రకరకాల పూలతో తయారు చేసిన దేవదేవుని ప్రతిరూపాలను ఏర్పాటు చేయించి, ముస్తాబు చేస్తున్నారు. వాహన సేవానంతరం భక్తులు స్వామివారి మూలమూర్తిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి గరుడవాహన సేవను పురస్కరించుకుని గతంలో కంటే ఈ ఏడాది అయిదు రెట్లు ఎక్కువగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 10 వేల మందికి తక్కువ లేకుండా జనం స్వామి వారి గరుడవాహనంలో పాల్గొం టారని అంచనా వేస్తున్నారు. టీటీడీ జేఈవో వెంకటరామిరెడ్డి గరుడవాహన ఏర్పాట్లుపై బుధవారం మరోసారి అధికారులతో సమావేశమయ్యారు.ట్రాఫిక్ మళ్లింపు ఇలా...గరుడ వాహన సేవను పురస్కరించుకుని సాయంత్రం 7 నుంచి 12గంటల వరకు తిరుపతి-పీలేరు మార్గంలో నడిచే అన్ని వాహనాలను చంద్రగిరి, ఐతేపల్లి మీదుగా మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. పీలేరు నుంచి వచ్చే వాహనాలు రంగంపేట-ఐతేపల్లి-చంద్రగిరి మీదుగా మళ్లించనున్నారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు చంద్రగిరి-మిట్టపాళెం మీదుగా పంపనున్నట్లు తిరుపతి వెస్ట్ డీఎస్పీ మాల్యాద్రి తెలిపారు. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని వారు కోరారు.

రాలయసీమ జిల్లాలో ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత

ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత ఆ శాఖ పరువు తీస్తోంది. నకిలీ మద్యం ఏరులై పారుతున్నా చోద్యం చూడటం మినహా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్దాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం అధికమైంది. ప్రస్తుతం ఈ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో దాదాపు అందరూ ఏఆర్ విభాగం నుంచి డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నవారే. ఎక్సైజ్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు జిల్లాకు ఐదారుగురికి మించి లేరు. ఏ స్టేషన్లోనూ మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.అనంతపురం జిల్లాలో 15 సీఐ పోస్టులు, 20 ఎస్‌ఐ, 200 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 14 సీఐ, 4 ఎస్‌ఐ , 87 కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో 3 సీఐ పోస్టులు, 62 కానిస్టేబుళ్ల పోస్టులు, చిత్తూరు జిల్లాలో 175 కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాల్సిన అనంతపురం జిల్లా కంబదూరుఎక్సైజ్  స్టేషన్లో కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 10 ఎక్సైజ్ సర్కిళ్లను, రెండు ప్రధాన చెక్‌పోస్టులను పర్యవేక్షించాల్సిన పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఇఎస్) పోస్టును ఏడాదిగా భర్తీ చేయలేదు. అక్రమ మద్యం నివారణ కోసం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో రద్దీని బట్టి ఇద్దరు లేదా ముగ్గురు సీఐలు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాయలసీమలోని ఏ చెక్‌పోస్టులో కూడా సీఐలు విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. అనంతపురం జిల్లాలోని 6 చెక్‌పోస్టుల్లో 13మంది సీఐలు విధులు నిర్వహించాల్సి ఉండగా ఏ చెక్‌పోస్టులోనూ సీఐ లేరు. కర్నూలు జిల్లాలో 6 చెక్‌పోస్టులు ఉండగా అన్ని చెక్‌పోస్టుల్లోనూ 10 మంది సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రతి జిల్లాలో ఒక డిప్యూటి కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు చొప్పున ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు ఆయా ఎక్సైజ్ స్టేషన్లు, చెక్‌పోస్టులను పర్యవేక్షించాల్సి ఉంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లోని సీఐలతోపాటు నకిలీ మద్యం, అక్రమ సారా నివారణకు ఎక్సైజ్ స్టేషన్ల వద్ద ఒక్కొక్క ఇన్‌స్పెక్టర్ చొప్పున ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐలు, గుంతకల్లు లాంటి చోట ట్రైన్ చెకింగ్ పార్టీలు, సరిహద్దుల్లో రెండు మూడు బార్డర్ పెట్రోలింగ్ పార్టీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.

Wednesday, 15 February 2012

అన్ని అంశాలపై చర్చకు సిద్ధం ...సిఎం

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, నిరసనలు, ఆందోళనలు, వాయిదాలతో సభ సమయాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలా అయితే మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయని అనుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు.ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయకుండా, ఏమీ మాట్లాడకపోతే తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు నిర్ధారించుకోవాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు 31 రోజుల పాటు జరుగుతాయని, కావాలంటే సభను ఎక్కువ సమయం పెంచుకుంటూ, సభను నడుపుకుందామని, ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు.

రాజ్యసభకు అవకాశం ఇవ్వండి...వైఎస్ వివేకానందరెడ్డి

దీంతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, వైఎస్ అభిమానుల్లోనూ ఆనందానికి రాజకీయంగా తాను ఎదిగేందుకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఢిల్లీలోని ముఖ్యనేతలను కలిసి మంగళవారం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈమేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డి తదితర ప్రముఖులతో ఆయన సంప్రదించి తెలిసింది. ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న గాలేరు, హంద్రీ నీవా సృజల స్రవంతి ప్రాజెక్టుల పనులు సత్వర పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే రాయలసీమ జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయని, సీమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే పులివెందులలో ప్రస్తుతం గ్యాస్ సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి వెంటనే అదనపు గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాలని కోరారు. ఇక పోతే దివంగత నేత డాక్టర్ వై ఎస్. రాజశేఖర్‌రెడ్డి వేలాది కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టులు, భారీ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారని వాటిలో చాలా వరకు చివరి దశలోనూ, అర్ధాంతరంగా ఉన్నాయని వాటన్నింటినీ పూర్తి చేసినట్లు అయితే ప్రజల్లో మంచిపేరు వస్తుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా పులివెందుల నియోజక వర్గంతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లా నుంచి తనను రాజ్యసభకు పంపినట్లయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఇందుకు హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

జూ ఎన్టీఆర్‌ కి ఎంఎల్.ఏ స్క్రిప్టు ఖరారు

గత మూడేళ్లుగా ఎన్టీఆర్ ..'ఎంఎల్.ఏ'అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్క్రిప్టుకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలై లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి 'షాక్' డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి (ఎం)లక్షణాలు (ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని న్యూస్.జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ...‘బాద్ షా’ అనే మరో టైటిల్ పై కూడా దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బాద్ షా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వైయస్ విజయమ్మ రాజ్యసభకు పోటీ?

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ బరిలోకి తన తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసు పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. వచ్చే నెల మూడో వారంలో ఎన్నికలు జరుగుతాయి. తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసేలా స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెంచడమే వారి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించినప్పుడు తమకు చెందిన 17 స్థానాలకు ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశారు. ఏడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని రచించారని విమర్శిస్తున్న వారు స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడుగా వారు వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. అనర్హత వేటులో స్పీకర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై వైయస్ జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పది మంది శాసనసభ్యులు రాజ్యసభ అభ్యర్థిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 17 మంది మద్దతుతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది కాబట్టే కాంగ్రెసును ఓడించడమే లక్ష్యంగా తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉన్న మరి కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడా కూడగట్టుకోవచ్చుననేది ఆలోచనగా చెబుతున్నారు

హీరో గోపీచంద్ పెళ్లి రద్దు

గత కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఫిబ్రవరి 24న పెళ్లి జరుగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వివాహం రద్దయినట్లు తెలుస్తోంది.హీరో గోపీచంద్ వివాహం కూడా వివాహానికి సిద్దమైనట్లు సమాచారం. గోపిచంద్ వివాహం చాలా రోజులుగా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గోపీచంద్ ..హారిత అనే అమ్మాయిని ఎరేంజెడ్ మ్యారేజ్ చేసుకోనున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ మధ్య న జగపతి బాబు కూతురుని వివాహం అంటూ వార్తలు వచ్చిన తర్వాత మరోసారి అతని వివాహం అంతటా చర్చ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ టైకూన్ కూతురు హారిక అని, ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఆస్ట్రేలియాలో ఎమ్.బి.ఎ చేస్తోందంటూ చెప్తున్నారు. గోపీచంద్ ఈ మధ్యనే ఈ సంభందంని పెళ్లిచూపులు సంప్రదాయబద్దంగా చూసాడని, ఆమె బాగా నచ్చటంతో ఓకే చేసాడని చెప్తున్నారు.తెలుగు హీరో గోపీచంద్ వివాహం హరిత అనే అమ్మాయితో ఖరారైన విషయం తెలిసిందే.  అసలు కారణాలు తెలియరాలేదు కానీ....పర్సనల్ ప్రాబ్లమ్సే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది. సినీ హీరో అయిన గోపీచంద్ కు...ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన హరితతో వివాహం ఫిక్స్ కావడంతో సంతోషంగా ఉన్న గోపీచంద్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ విషయంతో షాక్ అయ్యారు. గోపీచంద్ కు ఓ ప్రముఖ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని గతంలో వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం కూడా కారణం అయి ఉండవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్లో.