Sunday, 18 December 2011

ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ సర్వేలో కాజల్ టాప్

ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ నిర్వహించిన ఓ సర్వేలో కాజల్ అగర్వాల్ టాప్ గా నిలిచింది. మ్యాగజైన్ కవర్స్ లో బాగా గ్లామరస్ గా కనపడ్డ ఫిగర్ ఎవరని ఆ కంటెస్ట్ లో ప్రశ్న. దానికి ఎక్కువగా కాజల్ కి ఓట్లు పడ్డాయి. ఆ ఫోటో ఎఫ్ హెచ్ ఎమ్ కవర్ కవర్ మీద కాజల్ కనపడ్డ స్పైసీ స్టిల్ అది. అప్పట్లో ఆ కవర్ పేజీ మీద పెద్ద వివాదమే చెలరేగింది. తాను స్టిల్ ఇవ్వలేదని అది ఫేక్ అని కాజల్ వాదించింది. దానికి ఆ మ్యాగజైన్ వారు తమ దగ్గర షూటింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయని కొట్టి పారేసారు. ఇక ఆమె ప్రస్తుతం మహేష్‌తో కలిసి 'బిజినెస్‌ మేన్‌'లో నటిస్తోంది.పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జనవరి 1వతేది నుండి ప్రారంభం కానున్న నూతన బ్యాచ్‌లో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, డిసిఏ, పిజిడిసిఏ, డిటిపి, సి, సిప్లెస్, ప్లెస్, విబి అండ్ ఓరాకిల్, జావ, జావ2 ఇఇ, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, మోబైల్ టెక్నాలజి, మల్టీమీడియా, పిజి డిప్లమా ఇన్ అడ్వాన్మ్ మల్టీమీడియా, యానిమేషన్, ఆటోకార్డు, టాలీ తదితర కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.

తిరుపతిని వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి !

తిరుపతికి పెరుగుతున్న రద్దీ నేపథ్యం లో ప్రయాణికులకు సరిపడేలా వసతి, తాగునీరు, సౌకర్యాల కల్పనకు తగు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నా రు. స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిజర్వేష న్ కార్యాలయంలో ఎదురయ్యే ఇబ్బం దులు, విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలో దక్షిణం వైపు ఆర్‌సీరోడ్డులో కొత్త రిజర్వేషన్ కమ్ జనరల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సరైన ప్రచారం లేని కారణంగా అక్కడ సిబ్బంది పనిలేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితులను గమనిం చిన డీఆర్‌ఎం స్థానిక రైల్వే అధికారుల కు తగు ఆదేశాలిచ్చారు. అనంతరం రైలు బోగీలను శుభ్రం చేసే ఫిట్‌లైన్లు, మురికినీటి పంపింగ్, క్లీనింగ్, ఆర్‌వో వాటర్ ప్లాంట్ పనితీరులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు తూర్పు వైపున్న రైల్వేట్రాక్‌లు, ట్రాక్‌లకు మధ్య ఏర్పాటు చేసిన మురికి నీటి కాలువలను పరిశీ లించి నీటి ప్రవాహం సక్రమంగా జరిగే లా చూడాలని రైల్వే హెల్త్ అండ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగం అధికారులను కోరారు. ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఉన్న నాలుగు ఫిట్‌లైన్లు బోగీల శుభ్రతకు సరిపోవడం లేదని, ఆ ప్రభావం డైలీ ట్రైన్ల వేళలపై పడుతోందని స్థానిక అధికారులు డీఆర్‌ఎంకు వివరించారు. ఫిట్‌లైన్ల పెంపుదలకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇస్తే జోనల్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని హా మీ ఇచ్చారు. గత పర్యటనలో చేపట్టిన తనిఖీల్లో చోటు చేసుకున్న అంశాలపై మార్పు వచ్చిందా, లేదా? అని పరిశీలించారు.

నేడు అనంతపురం లో మెగా జాబ్‌మేళా

నగర, పట్టణ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆదివారం అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ మేళాకు ఇరవై కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. ఇందులో తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఉన్నాయని వెల్లడించారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు పథకంలో భాగంగా అనంత నగర పాలక సంస్థ, జిల్లాలోని మున్సిపాలిటీలు, అర్బన్ ఐకేపీ సంయుక్తంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నాయన్నారు. తొమ్మిది ప్రముఖ కంపెనీలు 533 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. మరో 11 సంస్థలు కూడా పలువురిని నియమించుకుంటాయని తెలిపారు. కేప్ కాఫీ డే సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 115, ఫ్యూచర్ రిటైల్స్ సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60, బాటా బిర్లా సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 18, జోయలుక్కాస్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 100, పీటీవీపీ లిమిటెడ్ సంస్థ టోల్ ప్లాజా సపోర్ట్ టీమ్ పోస్టులు 50, పాన్‌టాలూన్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 30, ఆదిత్యా బిర్లా సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 50, అపోలో ఫార్మసీ సంస్థ టీమ్‌మెంబర్ పోస్టులు 50, షాపర్ స్టాప్ సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60 భర్తీ చేస్తాయన్నారు. 18 -35 ఏళ్ల లోపు వారు విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ వెంటనే ఇస్తారన్నారు.

Saturday, 17 December 2011

వెంకటేష్ సినిమాలో.. మహేష్ బాబు తమ్ముడి పాత్రలో!



విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకీ అన్నయ్య పాత్రలో, మహేష్ బాబు తమ్ముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇప్పటికే సమంత ఖరారైంది. అయితే వెంకీకి మాత్రం ఇంకా హీరోయిన్ దొరక లేదు. త్రిషను ఎంపిక చేద్దామకున్నప్పటికీ మహేష్ వదిన పాత్ర చేయాల్సి వస్తుందని ఒప్పుకోలేదు. భూమికను బుక్ చేద్దామన్నా వీలు కాలే. కాల్సీట్లు లేవంటూ అనుష్క కూడా నో చెప్పింది. అయితే ఎట్టకేలకు వెంకీ భార్య పాత్రలో నటించే హీరోయిన్ దొరికినట్లు తెలుస్తోంది. బెజవాడ చిత్రంలో నాగచైతన్య సరసన నటించిన అమలపాల్ ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త బంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే రుసుం వసూలు!

కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే గ్రామ కార్యదర్శి, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తదుపరి తహశీల్దార్ సంతకాలు కావాలి. వీరిలో ఎవరు లేకున్నా వీటి కోసం ఆగాల్సిందే. దీంతో పాటు వారి స్థాయిని బట్టి అక్కడి ప్రాంతాల పరిస్థితులను బట్టి ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. ఇక రిజిస్ట్రేషన్ శాఖకు వెళితే ఇక్కడా ఇదే తంతు. రోజులకు రోజులు వేచి ఉండడంతో పాటు దళారుల బెడద ఉండనే ఉంది. వీటన్నింటికీ త్వరలోనే చరమగీతం పాడనుంది. దాదాపుగా 12 రకాల ధృవీకరణ పత్రాలు 15 నిమిషాల వ్యవధిలోనే నామమాత్రపు రుసం చెల్లించి తీసుకునే వెసులుబాటు రానుంది. ఇందుకుగానూ యూజర్ ఛార్జీల పేరుతో రూ. 30 వరకూ నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితమైన కంప్యూటరీకరణ ఇక పల్లెలకూ విస్తరించనుంది. ముఖ్యంగా అన్ని పంచాయతీలనూ కంప్యూటరీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత కింద జిల్లాలోని 27 మండలాల పరిధిలో 34 గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ ప్రాంరంభమైంది. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీలను కంప్యూటరీకరించున్నారు. పంచాయతీకి సంబంధించిన ఆస్థి పన్ను, నిధుల వ్యయం తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. మీ సేవ పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను కంప్యూటరీకరించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీల సేవలన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆస్థిపన్ను, నిధుల వ్యయం, జనన మరణ ద్రువీకరణ పత్రాలు తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్‌లైన్ చేయనున్నారు.

సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న!

క్రికెట్ అభిమానులూ ఆనందంతో ఊగిపోండి! భారత్ క్రికెట్ ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న సాకారమయ్యే రోజు మరెంతో దూరం లేదు! దేశ అత్యున్నత పౌర పురస్కారం పరిధిని విస్తరిస్తూ ఇక క్రీడాకారులకూ ఈ అవార్డును అందించాలని కేంద్రం నిర ్ణయించింది. అందుకోసం అర్హత నిబంధనలనూ సవరించింది. ఇకనుంచి 'మానవ ప్రమేయం ఉన్న ఏ రంగం'లోనైనా అత్యున్నత ప్రతిభను గుర్తిస్తూ భారతరత్న ఇవ్వనున్నట్టు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ వెల్లడించారు. మాకెన్ తాజా ప్రకటనతో రికార్డుల రారాజు సచిన్‌తో పాటు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇచ్చేందుకూ మార్గం సుగమం అయినటే ్ట. మాస్టర్ 2008లో దేశంలోనే ద్వితీయ అత్యుత్తమ పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందుకున్నాడు.కాగా, 1955లో రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక రంగాలకు చెందిన వ్యక్తులకు మాత్రమే 'భారతరత్న' ఇచ్చేవారు. అంటే కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవకు సంబంధించి అత్యున్నత నైపుణ్యశీలురకు ఈ అరుదైన గౌరవం దక్కేది. తాజా సవరణలతో ఇక నుంచి అన్ని రంగాలూ అవార్డు పరిధిలోకి వస్తాయి. కాగా, క్రీడారంగాన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు పరిగణనలోకి తెచ్చేందుకు మంత్రి మాకెన్ తీవ్రంగా కృషి చేశారు. మాకెన్ ఇదే విషయమై హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాయడంతో, ప్రధానమంత్రి కార్యాలయం నోటిఫికేషన్ ద్వారా నిబంధనల సవరణకు గత నెలలో శ్రీకారం చుట్టింది. ఇక ఈసారి భారతరత్న ఎవర్ని వరించనుందని మాకెన్‌ను ప్రశ్నించగా, 'హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్, రన్ మెషీన్ సచిన్‌లు ప్రధాన పోటీదారుల'ని పేర్కొన్నారు. అంతకుముందు ఓసారి మాకెన్, 'ఏ క్రీడాకారుడికైనా భారతరత్న లభిస్తే ఆ రోజు భారత క్రీడారంగానికి సుదినమ'ని ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.