Showing posts with label సచిన్ టెండూల్కర్. Show all posts
Showing posts with label సచిన్ టెండూల్కర్. Show all posts
Sunday, 26 February 2012
సచిన్ టెండూల్కర్‌కు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం
Monday, 20 February 2012
సచిన్ టెండుల్కర్ కు ఎమ్మారై స్కాన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు వైద్యులు ఎమ్మారై స్కాన్
తీశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్రెట్ లీ బౌలింగ్‌లో ఓ బంతి సచిన్
హెల్మెట్‌కు బలంగా తాకింది. మాస్టర్ కుడి కన్నుపై తగలడంతో ముందు
జాగ్రత్తగా స్కాన్ తీస్తే మంచిదని వైద్యులు సూచించారు. బంతి తగిలిన తర్వాత
కూడా అలాగే బ్యాటింగ్ చేసిన మాస్టర్ కాసేపటికే ఔటయ్యాడు. పెవిలియన్‌లో
అతనికి ఐస్ ట్రీట్‌మెంట్ చేశారు. బ్రెట్‌లీ వేసిన బంతికి తగిన సమయంలో అతను జవాబు
చెప్పలేకపోయాడు. దీంతో బంతి ముందు జాగ్రత్తగా ఎంఆర్ఐ స్కాన్ తీయించుకునే
పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. బ్రెట్‌లీ రెండో ఓవరు చివరి బంతి పేస్‌ను
అంచనా వేయలేకపోవడంతో అది అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలింది. దానివల్ల సచిన్
టెండూల్కర్ నుదటికి దెబ్బ తగిలినట్లు అనుమానిస్తున్నారు. అతను
బ్యాటింగును కొనసాగించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే అతను
అవుటయ్యాడు. డ్రెసింగ్ రూంలో సచిన్ టెండూల్కర్‌కు ఐస్ ట్రీట్‌మెంట్
ఇచ్చారు. నుదురు ఉబ్బినట్లు చెబుతున్నారు. పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ
ఎంఆర్ఐ స్కాన్‌కు వైద్యులు సలహా ఇచ్చారు. భారత జట్టులోని రాజకీయాలు,
రోటేషన్ పద్ధతి వల్ల పక్కన కూర్చోవాల్సి రావడం, వందో శతకం చేయాలనే ఒత్తిడి
సచిన్ టెండూల్కర్‌ను ఈ స్థితికి తెచ్చినట్లు చెబుతున్నారు.
Tuesday, 7 February 2012
సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ వన్...మాజీ కెప్టెన్ స్టీవ్ వా
వందో సెంచరీ చేయనంతమాత్రాన సచిన్ గొ ప్పతనం ఏమాత్రం తగ్గదని
ఆస్ట్రేలియా
మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. సచిన్ వం దో సెంచరీ చేయాలని దేశమంతా
ఎదురుచూస్తున్నందునే అతనిపై అనవసర ఒత్తిడి పెరుగుతోందని చెప్పాడు. భారత్‌లో
అభిమానులు గణాంకాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారని వా అన్నాడు.
'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. ఒకవేళ అతను సాధించలేకపోయినా గొప్ప
ఆటగాడిగా అతనికున్న ఖ్యాతి ఇసుమంతైనా తరిగిపోదు. ప్రస్తుతం 99 సెంచరీల
సచిన్‌ను చూస్తుం టే..99.94 సగటుతో రిటైరైపోయిన డాన్ బ్రాడ్‌మన్ గు
ర్తుకొస్తున్నాడని' స్టీవ్ వా అన్నాడు. గతేడాది ఏప్రిల్‌నుంచి వందో శతకం
కోసం సచిన్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
భారత్ అభిమానులు గతంలో సచిన్ రికార్డులని చూసి.. చూసి తన వందో సెంచరీ కోసం
ఎదురు చూస్తున్నారని.. ఐతే వందో సెంచరీ అనేది కేవలం సచిన్‌కు ఓ అంకె
మాత్రమేనని అన్నాడు. 'సచిన్ వందో సెంచ రీ చేస్తే మంచిదే. మరోవైపు మాస్టర్
బ్లాస్టర్ సచిన్ టెంటూల్కర్‌ను ఆసీస్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్‌తో
స్టీవ్ వా పోల్చాడు. బ్రాడ్మన్ 99 యావరేజ్‌తో కెరీర్ ముగించినపుడు అందరూ
బాధపడ్డారని తెలిపాడు. ఇప్పుడు సచిన్ విషయంలోనూ 99 ఆడుకుంటుందని
అన్నాడు.ఐతే సచిన్ అతి త్వరలోనే వందో సెంచరీ సాధించితీరతాడని వా ఆశాభావం
వ్యక్తం
చే శాడు. ఐతే గత ఏప్రిల్‌నుంచి సచిన్ వందో సెంచరీ కోసం వెయిట్ చేస్తూనే
ఉన్నా ఇప్పటికీ ఆ రికార్డు ఊరిస్తూనే ఉంది. ఇంగ్లండ్, విండీస్, ఆసీస్‌లతో
జరిగిన సిరీస్‌లలో దగ్గరకు వచ్చినా మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయాడు.
Saturday, 17 December 2011
సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న!
Subscribe to:
Posts (Atom)

