Showing posts with label హీరోయిన్ కాజల్. Show all posts
Showing posts with label హీరోయిన్ కాజల్. Show all posts

Wednesday, 18 January 2012

మహేష్ బాబు బుల్లెట్ లాంటోడు....హీరోయిన్ కాజల్



మహేష్ బాబును బుల్లెట్ లాంటోడు అంటోంది ‘తుపాకి’ హీరోయిన్ కాజల్. మహేష్ బాబుతో కలిసి బిజినెస్ మేన్ చిత్రంలో నటించిన కాజల్ ఈ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తుపాకి’ పేరుతో విడుదల చేయనున్నారు. బిజినెస్ మేన్ భారీ విజయం సాధించడంతో బుధవారం కాజల్ ప్రెస్ మీట్ లో మాట్లాడింది. బిజినెస్ మేన్ సినిమా అనుభవాలను వివరించింది. మహేష్ బాబు బుల్లెట్ లాంటోడు. నేను ఇప్పటి వరకు నటించిన వారిలో డైనమిక్ హీరో అంటే అతడే. తొలిసారి అతనితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అంటూ కాజల్ మహేష్ బాబును తెగపొగిడేసింది. మహేష్ బాబు యాక్షన్ సీన్లు, ఆయన డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడే నేను ఆయన అభిమానిని అయిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. పూరి జగన్నాథ్ అద్భతమైన దర్శకుడు అంటూ ఆయనపైకి రెండు ప్రశంసలు వదిలింది. పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో ‘బిజినెస్ మేన్’కు సీక్వెల్ తీస్తానని ప్రకటించడంతో అందులోనూ అవకాశం దక్కించుకోవడానికే కాజల్ ప్రయత్నిస్తుందని, అందుకే బిజినెస్ మేన్ సినిమా ప్రమోషన్ పేరుతో మహేష్ బాబు, పూరి జగన్నాధ్ లను పొగుడుతూ కాకా పడుతోందని కొందరు అంటున్నారు. సినిమా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టడంతో సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి దర్శక నిర్మాతలు వేసిన ప్లాన్ లో భాగంగానే కాజల్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందని మరికొందరు అంటున్నారు