Showing posts with label హీరో నిఖిల్. Show all posts
Showing posts with label హీరో నిఖిల్. Show all posts

Tuesday, 15 November 2011

హీరో నిఖిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు

మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కు నాంపల్లి కోర్టు మంగళవారం శిక్ష విధించింది. సంవత్సం పాటు అతని డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంతో పాటు, రూ. 2600 జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై నిఖిల్ స్పందిస్తూ....తాను తప్పు చేశానని, కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తానని, సంవత్సరం పాటు డ్రైవింగ్ కు దూరంగా శిక్షను అనుభవిస్తానని తెలిపారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నేను ఇలా చేసినందుకు సిగ్గు పడుతున్నానని నిఖిల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి తాను మద్యం సేవించడం మానేస్తానని చెప్పిన నిఖిల్...యువతను మంచి మార్గంలో నడిపించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని, మద్యం మాన్పించేందుకు తన వంతు ప్రయత్నం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు

Saturday, 12 November 2011

హీరో నిఖిల్ ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.


                                                          
యువత, కలావర్ కింగ్, వీడు తేడా చిత్రాల్లో హీరోగా నటించిన నిఖిల్ ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. అతిగా మధ్యం సేవించి కారు నడుపుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ సీజ్ చేశారని, శనివారం మధ్యాహ్నం వరకు నిఖిల్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతనికి భారీ జరిమానా విధించడం లేదా కోర్టులో హాజరు పరిచే అవాకాశాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను నిఖిల్ ఖండించారు. కారు తనదే కానీ, కారులో నేను లేనని నిఖిల్ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే నిఖిల్ ను బ్రీత్ అనలైజర్ తో పోలీసులు పరీక్షిస్తున్న చిత్రాన్ని ఓ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం