తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగి కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వెళ్లేది లేదని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం
ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ
జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తాను నలభై వేల మెజార్టీతో
గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బళ్లారిలో గాలి ధాటికి కాంగ్రెసు తుడిచి
పెట్టుకు పోయిందని ఆంధ్ర ప్రదేశ్‌లోనూ అదే జరుగుతుందన్నారు. పులివెందుల,
కడప ఉప ఎన్నికల్లో ఎలా మెజార్టీ సాధించామో ఉప ఎన్నికలు వస్తే జగన్ పార్టీ
అలా మెజార్టీ సాధిస్తుందన్నారు.జగన్‌ను విడిచి ఒకరిద్దరు వెళ్లి
పోయినా ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెసులోకి వెళ్లి దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వమ్ము చేసే వాడిని కాదన్నారు. జగన్‌తో
ఉంటానన్న నా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదన్నారు. సమయం వచ్చింది కాబట్టే తాను
ఇప్పుడు మీడియా ముందు చెబుతున్నానన్నారు. కాగా అంతకుముందు కాపు రామచంద్రా
రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.
Showing posts with label రాయదుర్గం. Show all posts
Showing posts with label రాయదుర్గం. Show all posts
Sunday, 4 December 2011
Saturday, 12 November 2011
మంత్రి రఘువీరారెడ్డి చేతిలో నుంచి మైకు లాక్కున్ రాయదుర్గం ఎమ్మెల్యే
రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగిన ఉదంతమిది. రాయదుర్గం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి రఘువీరా ప్రసంగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందోనంటూ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. దీంతో ఒక్కసారిగా రామచంద్రారెడ్డి మంత్రి చేతిలో నుంచి మైకు లాక్కుని ఆవేశంగా ప్రసంగించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత బాధాకరమన్నారు. కొంతమందికి మాత్రమే సంక్షేమ ఫలాలను అందించి అందరికీ అందించినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదంటూనే రాజకీయం చేస్తున్నారని మంత్రితో వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించే వారి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు
Wednesday, 19 October 2011
ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన
రూ. 1050 కోట్లతో రాయదు ర్గం- టుంకూరు రైల్వేలైన్ నిర్మాణం ప నులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వ చ్చిన ఆయన పట్టణంలోని అర్అండ్ బీ అతిథిగృహంలో మంగళవారం వి లేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాయదుర్గం పర్యటన ఖ రారు అయినట్లు ఆయన ప్రకటించా రు. ముఖ్యమంత్రితో పాటు, కేంద్ర రైల్వే క్యాబినెట్ మంత్రి దినేష్ త్రివేది, సహాయ మంత్రి మునియప్ప వస్తున్నట్లు తెలిపారు.
ప్రథమంగా రాయదుర్గం మండలంలోని బీఎన్‌హళ్ళికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం 9 గంటలకల్లా చేరుకుని ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపా రు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన రూ. 1050 కోట్ల రాయదుర్గం- టుం కూరు రైల్వేలైన్ నిర్మాణం పనులకు, రూ.13 కోట్లతో ఓబుళాపురంలో ని ర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, డ్వామా భవనానికి, రూ.15 కోట్లతో బీటీపీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
ప్రథమంగా రాయదుర్గం మండలంలోని బీఎన్‌హళ్ళికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం 9 గంటలకల్లా చేరుకుని ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపా రు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన రూ. 1050 కోట్ల రాయదుర్గం- టుం కూరు రైల్వేలైన్ నిర్మాణం పనులకు, రూ.13 కోట్లతో ఓబుళాపురంలో ని ర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, డ్వామా భవనానికి, రూ.15 కోట్లతో బీటీపీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
Subscribe to:
Posts (Atom)