Showing posts with label మోహన్‌బాబు. Show all posts
Showing posts with label మోహన్‌బాబు. Show all posts

Thursday, 5 January 2012

మొదటిసారిగా కలత చెందా...మోహన్ బాబు

తిరుమల శ్రీవారి చెంతకు వచ్చి మొదటిసారిగా కలత చెందానని సినీ నటుడు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనసును బాధ పెట్టుకుని వెళ్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, అందువల్ల తాను ఏమీ మాట్లాడబోనని, తనను వదిలేస్తే సంతోషిస్తానని అంటూనే ఆయన టిటిడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోవారిని గౌరవించకుండా వీధుల్లో ఉన్నవారిని గౌరవిస్తున్నారని ఆయన మండిపడ్డారు.మొదట ఇంట్లోవారిని గౌరవించాలని, మనల్ని మనం గౌరవించుకోవాలని ఆయన అన్నారు. ఎవరిని గౌరవిస్తున్నారో చూస్తూనే ఉన్నామని, ఇక్కడి తీరు చూసి మనసు కష్టంగా ఉందని, మొదటి సారి మనసు కష్టపెట్టుకుని వెళ్తున్నానని ఆయన అన్నారు.